STOCKS

News


నష్టాలా మార్కెట్లో.. ర్యాలీ చేసిన స్టాకులు

Thursday 15th August 2019
Markets_main1565865709.png-27790

మార్కెట్లు ప్రస్తుతం బేర్‌ చేతుల్లో చిక్కుకున్నాయి. గత ఎనిమిదేళ్లలో మొదటి సారి మార్కెట్లు ప్రతికూల రాబడులను ఇవ్వడం చూశాం. గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.4 శాతం నష్టపోయింది. అదే విధంగా నిఫ్టీ 50 3.5 శాతం కోల్పోపోయింది. యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ ఆందోళనవలన అంతర్జాతీయ మందగమనం పెరిగింది. అంతేకాకుం‍డా చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోడానికి కారణమయ్యింది. ఐఎల్ అండ్‌ ఎఫ్ఎస్  లిక్విడిటీ సంక్షోభం చాలా వరకు ఎన్‌బీఎఫ్‌సీలపై తీవ్రంగా ప్రభావం చూపింది. వీటికి తోడు ఆస్తి నాణ్యత ఆందోళనలు, వినియోగం తగ్గడం, ఆర్థిక మందగమనం, అంచనాలను అందుకోని కార్పొరేట్ ఆదాయాలు, సూపర్-రిచ్ లపై సర్‌చార్జ్ విధించడం ఫలితంగా ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు)ల ఔట్‌ ఫ్లో పెరగడం వంటి కారణాలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.

భారీగా పడిపోయిన రంగాలు..
గత ఏడాది కాలంలో ఐటీ తప్ప అన్ని రంగాల బీఎస్‌ఈ సూచీలు నష్టపోయాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్‌ కేవలం 4 శాతం మాత్రమే లాభపడింది. కాగా కొనుగోలు వ్యయం పెరగడంతో పాటు, లిక్విడిటీ సంక్షోభం, రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచే ప్రతిపాదనలు, ఉద్గార నిబంధనలలో మార్పు వంటి కారణాల వలన ఆటో సెక్టార్‌ మందగమనంలో చిక్కుకొంది. ఫలితంగా గత ఏడాది కాలంలో బీఎస్‌ఈ ఆటో ఇండెక్స్‌ 36 శాతం నష్టపోయి అతి పెద్ద పతనాన్ని చవిచూసింది. మిగిలిన రంగాలలో బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌ సూచీలు 1 నుంచి 14 శాతం మేర నష్టపోయాయి. విస్తృత మార్కెట్‌లో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 17 శాతానికి పైగా పడిపోగా, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 25 శాతం క్షీణించింది. తత్ఫలితంగా, బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో  ఏడాదికి గాను,  75 శాతం షేర్లు తమ తక్కువ ధరల వద్ద ట్రేడవుతున్నాయి.

ర్యాలీ చేసిన 16 స్టాకులు..
ఇలాంటి పరిస్థితులున్నప్పటికి కొన్ని స్టాకులు మాత్రం లాభపడడమే కాకుండా అద్భుత ప్రదర్శనను చేశాయి. లాభపడిన 25 శాతం స్టాకులలో టాప్‌ 16 స్టాకులు గత ఏడాది కాలానికి గాను  32-87 శాతం పరిధిలో ర్యాలీ చేయడం గమనార్హం. అదానీ పవర్, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్, ప్రొక్టర్ అండ్‌ గ్యాంబుల్ హెల్త్, స్పైస్ జెట్, వినటి ఆర్గానిక్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 50 శాతానికి పైగా లాభపడ్డాయి. కాగా ఎస్‌ఆర్‌ఎఫ్, ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా), ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, బాటా ఇండియా, పీఐ ఇండస్ట్రీస్, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు 40-50 శాతం మధ్య ర్యాలీ చేశాయి. వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్‌, ఇన్ఫోసిస్ షేర్లు కూడా 10-25 శాతం లాభపడ్డాయి.

70-90 శాతం పతనమయిన స్టాకులు..
మరోవైపు, డీహెచ్‌ఎఫ్‌ఎల్, శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండియాబుల్స్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, ఇన్ఫిబీమ్ అవెన్యూస్, ఎస్‌ఆర్‌ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, హెచ్‌ఈజీ, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, గ్రాఫైట్ ఇండియా, బాంబే డైయింగ్ అం‍డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇండియాబుల్స్ వెంచర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఈ ఏడాది కాలంలో 70-90 శాతం క్షీణించడం గమనార్హం.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో యస్‌ బ్యాంక్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం(మహింద్రా అండ్‌ మహింద్రా), టాటా స్టీల్, మారుతి సుజుకి, వేదాంత, సన్ ఫార్మా 30-80 శాతం పతనమయ్యాయి.

 

గమనిక: పైన లాభపడిన, నష్టపోయిన స్టాకుల డేటా గత ఏడాది కాలంలో మార్కెట్‌ పరిణామాలకు అనుగుణంగా రాసినవి. ఇందులో ఇన్వెస్ట్‌చేయమంటూ సాక్షి  ప్రోత్సహించడం లేదు. You may be interested

స్వల్పకాలంలో సిప్‌ రాబడులు తగ్గినా మంచిదే.

Thursday 15th August 2019

స్వల్పకాలానికి సిప్‌ మీద వచ్చే రాబడులు తగ్గితే మంచిదేనని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ పాండే అంటున్నారు. సిప్‌లపై ప్రతికూల రాబడి వస్తున్నప్పుడు సిప్‌ పెట్టుబడి మొత్తాన్ని లేదా సిప్‌ల సంఖ్యను పెంచాలని పాండే తెలిపారు. ఎందుకంటే మార్కెట్‌ రికవరీ అయిన్పడు, మొత్తం పెట్టుబడిపై రాబడి ఎక్కువగా ఉంటుందని పాండే అభిప్రాయపడుతున్నారు. మార్కెట్లో ఏర్పడిన కరెక‌్షన్‌ కారణంగా సమర్థవంతమైన వ్యాపారాలు, స్థిరమైన నగదు ప్రవాహం కలిగి నాణ్యమైన కంపెనీలకు

4శాతం నష్టపోయిన ఏడీఆర్‌లు

Thursday 15th August 2019

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు  ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏడీఆర్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా టాటామోటర్స్‌ ఏడీఆర్‌, విప్రో ఏడీఆర్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌లు 4శాతం వరకు నష్టపోయాయి. అత్యధికంగా టాటామోటర్‌ ఏడీఆర్‌ 4శాతం నష్టపోయింది. అలాగే విప్రో ఏడీఆర్‌ 3.50శాతం,

Most from this category