News


12 శాతం రాబడికి 12 సిఫార్సులు

Monday 27th August 2018
Markets_main1535357311.png-19681

వచ్చే 1- 3 నెలల కాలానికి దాదాపు 12 శాతం వరకు రాబడినిచ్చే 12 స్టాకులను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
చార్ట్‌వ్యూ ఇండియా మజార్‌ మహ్మద్‌ రికమండేషన్లు
1. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 540. స్టాప్‌లాస్‌ రూ. 490. పలుమార్లు ఈ స్టాకుల రూ. 490 వరకు దిగివచ్చి బౌన్స్‌ బ్యాక్‌ అయింది. తాజాగా మరోమారు ఇదే తరహా ధోరణి చూపే క్రమంలో ఉంది. చార్టుల్లో ఇండికేటర్లు మరో బౌన్స్‌బ్యాక్‌ సూచిస్తున్నాయి. 
2. బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 603. స్టాప్‌లాస్‌ రూ. 535. గత ర్యాలీ అనంతరం 80 శాతం రిట్రేస్‌మెంట్‌ పతనం చూపింది. రూ. 538 స్థాయిల వద్ద బలమైన మద్దతు పొందుతోంది. ఈ స్థాయికి పైన తాజా గ్యాప్‌ రూ. 580- 603ను మరోమారు పరీక్షించవచ్చు. 
3. ఐషర్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 30080. స్టాప్‌లాస్‌ రూ. 28350. ఇటీవలే రూ. 28076ను తాకి అక్కడ మద్దతు పొందింది. గత ర్యాలీకి ఇది 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి. మూడు రోజులుగా కన్సాలిడేట్‌ అవుతూ ఇక్కడనుంచి మరోమారు పైకి ఎగిసేందుకు రెడీగా ఉంది.
యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రాజేశ్‌ పల్వియా రికమండేషన్లు
1. గ్లెన్‌మార్క్‌ ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 700. స్టాప్‌లాస్‌ రూ. 625. వీక్లీ చార్టుల్లో ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ట్రెండ్‌రివర్సల్‌కు ఇది సంకేతం. దీన్నుంచి అధిక వాల్యూంలతో బ్రేకవుట్‌ సాధించింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా మారింది. 
2. కమ్మిన్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 805. తాజా బ్రేకవుట్‌తో ఇప్పటివరకు కొనసాగుతూవస్తున్న డౌన్‌ స్లోపింగ్‌ ఛానెల్‌ నుంచి బయటపడింది. స్వల్ప, మధ్యకాలిక డీఎంఏ స్థాయిలకన్నా పైన ట్రేడవుతూ పాజిటివ్‌గా కనిపిస్తోంది. 
3. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 650. స్టాప్‌లాస్‌ రూ. 588. వీక్లీ చార్టుల్లో పదివారాల కన్సాలిడేషన్‌ పిరియడ్‌ను ఛేదించి బయటపడినట్లు తెలుస్తోంది. స్టోకాస్టిక్‌ తదితర ఇండికేటర్లు బుల్లిష్‌గా మారాయి. వాల్యూంలు పెరిగడం పాజిటివ్‌ సంకేతం. 
4. హిందుస్థాన్‌ జింక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 310. స్టాప్‌లాస్‌ రూ. 282. డైలీ చార్టుల్లో కన్సాలిడేషన్‌ నుంచి బ్రేకవుట్‌ చూపుతోంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా మారింది. స్వల్పకాలిక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా కనిపిస్తోంది. 
 బీఎన్‌పీ పారిబా గౌరవ్‌ రత్నపర్కి రికమండేషన్లు
1. ఉజ్జీవన్‌ ఫిన్‌సర్వ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 390. స్టాప్‌లాస్‌ రూ. 341. చార్టుల్లో లోయర్‌ బోలింగర్‌ రివర్సల్‌ చూపుతోంది. ఇండికేటర్లు తాజా బై సిగ్నల్‌ ఇస్తున్నాయి.
2. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 245. స్టాప్‌లాస్‌ రూ. 215. స్టాక్‌ చార్టులో ఎంగల్ఫింగ్‌ బుల్లిష్‌ క్యాండిల్‌ మద్దతు జోన్‌ వద్ద ఏర్పడింది. మరోమారు కొత్త ర్యాలీకి సంసిద్ధంగా ఉంది.
3. ఐషర్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 31700. స్టాప్‌లాస్‌ రూ. 28070. కీలక డీఎంఏ స్థాయిల వద్ద బలమైన మద్దతు పొందుతోంది. మోమెంట్‌ ఇండికేటర్లు బుల్లిష్‌గా మారాయి. 
ఏంజెల్‌ బ్రోకింగ్‌ సమిత్‌చవాన్‌ రికమండేషన్లు 
1. నీల్‌కమల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2105. స్టాప్‌లాస్‌ రూ. 1772. దాదాపు 14 నెలలు త్రిభుజాకార పాటర్న్‌లో పయనిస్తూ ఉంది. ఇటీవలే ఈ ఆకృతి దిగువ స్థాయి నుంచి మంచి వాల్యూంలతో పైకి ఎగిసింది. ఈ అప్‌మూవ్‌లో భాగంగా త్రిభుజాకృతి పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. రెండు రోజులుగా చిన్నపాటి ప్రాఫిట్‌బుకింగ్‌ కనిపిస్తోంది. ప్రస్తుత స్థాయిల వద్ద కొనొచ్చు.
2. జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 373. స్టాప్‌లాస్‌ రూ. 343. మూడేళ్ల నుంచి మంచి బుల్‌రన్‌లో ఉంది. శుక్రవారం మరో మంచి బ్రేకవుట్‌ను భారీ వాల్యూంలతో సాధించింది. మెటల్‌రంగంలో పాజిటివ్‌ సంకేతాలు షేరుకు కలిసివస్తాయి. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల పరుగులు

Monday 27th August 2018

నిప్టీ-50లో టాప్‌గెయినర్లుగా ఎస్‌బీఐ, ఐసీఐసీఐ షేర్లు ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాకింగ్‌ షేర్ల ర్యాలీ సోమవారం సూచీలను పరుగులు పెట్టిస్తుంది. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంకు ఇండెక్స్‌, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్‌లు 2నుంచి 3శాతానికి పైగా ర్యాలీచేశాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎస్‌బీఐ(3.15శాతం), ఐసీఐసీఐ బ్యాంకు(3.09శాతం) లాభపడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్ల విభాగంలో చోటు దక్కించుకున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌:- నేడు

ఆల్‌టైమ్‌ గరిష్టాల్లో సూచీలు

Monday 27th August 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. ఇండెక్స్‌లు 1 శాతానికిపైగా పెరిగాయి. మధ్యాహ్నం 12:36 సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 413 పాయింట్ల లాభంతో 38,665 వద్ద ట్రేడవుతోంది. ఇది ఒకానొక సమయంలో 38,670 స్థాయిని కూడా తాకింది. ఇదే సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి. ఇక నిఫ్టీ కూడా 120 పాయింట్ల లాభంతో 11,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీకి ఇది జీవిత కాల గరిష్ట

Most from this category