News


షార్ట్‌టర్మ్‌కు స్ట్రాంగ్‌ సిఫార్సులు

Monday 10th February 2020
Markets_main1581331382.png-31666

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే డజన్‌ స్టాకులను నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌
1. బయోకాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 325. స్టాప్‌లాస్‌ రూ. 300. బలమైన ప్రైస్‌వాల్యూం బ్రేకవుట్‌ సాధించింది. ఏడీఎక్స్‌ సహా పలు ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. 
2. టాటామోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 190. స్టాప్‌లాస్‌ రూ. 167. బడ్జెట్‌ అనంతరం మంచి ర్యాలీ జరుపుతోంది. చార్టుల్లో హయ్యర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ ఏర్పడడం అప్‌ట్రెండ్‌ కొనసాగింపునకు మద్దతునిస్తోంది.
3. సెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 52. స్టాప్‌లాస్‌ రూ. 46. రైజింగ్‌ ట్రెండ్‌లైన్‌ నుంచి మద్దతు పొందుతూ వస్తోంది. తోటి కంపెనీలతో పోలిస్తే మంచి పొజిషన్‌లో ఉంది.
మజార్‌మహ్మద్‌, చార్ట్‌వ్యూ ఇండియా
1. అరబిందో ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 597. స్టాప్‌లాస్‌ రూ. 513. కీలక నిరోధాలకు పైన బ్రేకవుట్‌ సాధించి అప్‌ట్రెండ్‌లో ఉంది. త్వరలో మధ్యంతర టాప్‌ను మరోమారు టచ్‌ చేయవచ్చు.
2. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 101. స్టాప్‌లాస్‌ రూ. 85. చాలా రోజుల కన్సాలిడేషన్ ప్రయాణం కొనసాగుతోంది. తాజా పతనం అనంతరం తిరిగి కన్సాలిడేషన్‌ రేంజ్‌లో టాప్‌ అవధిని చేరే ఛాన్సులున్నాయి.
3. ఎక్సైడ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 197. స్టాప్‌లాస్‌ రూ. 175. ఇటీవలి పతనంలో కన్సాలిడేషన్‌ జోన్‌ దిగువ అవధి వరకు వచ్చింది. ఈ దశలో పతనం పూర్తయినట్లు కనిపిస్తోంది. 
వైశాలి, ప్రభుదాస్‌ లీలాధర్‌
1. ఎస్‌బీఐ లైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1040. స్టాప్‌లాస్‌ రూ. 900. ఇటీవలి కరెక‌్షన్‌లో రూ. 885 వద్ద బాటమ్‌ అవుట్‌ చెందింది. ఇక్కడ నుంచి రికవరీ బాటలో పయనిస్తోంది.
2. వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 100. స్టాప్‌లాస్‌ రూ.77. క్రమానుగత పతనం అనంతరం రూ. 77 వద్ద బాటమ్‌అవుట్‌ చెందినట్లు హయ్యర్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ఇక్కడ నుంచి అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తోంది.
సమిత్‌ చౌతా, ఏంజల్‌ బ్రోకింగ్‌
1. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 367. స్టాప్‌లాస్‌ రూ. 324. నిరంతరంగా హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. తాజాగా నిరోధ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది.
2. టైటాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1428. స్టాప్‌లాస్‌ రూ. 1185. కొన్ని నెలలుగా స్వల్పరేంజ్‌లో కొనసాగుతోంది. క్యు3 ఫలితాల అనంతరం ఈ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది.
3. వీఐపీ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 555. స్టాప్‌లాస్‌ రూ. 461. బడ్జెట్‌ అనంతరం మిడ్‌క్యాప్స్‌లో జోరు పెరిగింది. ఇదే దోవలో ఈ స్టాక్‌ సైతం అప్‌మూవ్‌ సిగ్నల్స్‌ ఇస్తోంది.
వినయ్‌ రజని, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
1. ఆల్‌కెమ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2700. స్టాప్‌లాస్‌ రూ. 2400. ఇటీవల ఆల్‌టైమ్‌ హైని చేరింది. చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం కీలక డీఎంఏలకు పైన స్థిరంగా కొనసాగుతోంది. You may be interested

కోటక్‌ ఎంఎఫ్‌ అంతర్జాతీయ స్కీమ్‌ల విలీనం 

Tuesday 11th February 2020

కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ.. కోటక్‌ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ (కేయూఈఎఫ్‌), కోటక్‌ వరల్డ్‌ గోల్డ్‌ (కేడబ్ల్యూజీ) ఫండ్‌లను కోటక్‌ గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ (కేజీఈఎం) స్కీమ్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇది ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఇప్పుడు విడిగా నడిచే ఈ పథకాల పెట్టుబడుల లక్ష్యాల్లో మార్పులకు అవకాశం లేకపోలేదు. కనుక ఇన్వెస్టర్లు తమ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి రావచ్చు.   విలీనమయ్యేవి.. కోటక్‌ యూఎస్‌

దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 6 శాతం డౌన్‌!

Monday 10th February 2020

గ్రేటర్‌ నోయిడా: ఈ జనవరిలో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 6.2 శాతం పడిపోయాయి. జీడీపీ వృద్ధి నెమ్మదించడం, వాహన ధరలు పెరగడంతో వాహన కొనుగోలుదార్లపై ఒత్తిడిపడి దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు పడిపోయాయని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చర్స్‌( సియామ్‌) సోమవారం వెల్లడించింది. సియామ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ..గత ఏడాది జనవరిలో దేశీయ పాసింజర్‌ వాహన విక్రయాలు 2,80,091 యూనిట్లుగా ఉంటే ఈ ఏడాది జనవరిలో

Most from this category