News


డిసెంబర్‌ సీరిస్‌లో టాప్‌ 10 రోలోవర్లు..

Friday 29th November 2019
Markets_main1575010603.png-29950

నిఫ్టీ బ్యాంకులో డిసెంబర్‌ సీరిస్‌ రోలోవర్లు ఎక్కువగా కనిపించాయి. దీంతో నిఫ్టీ కన్నా బ్యాంకునిఫ్టీ డిసెంబర్‌లో మెరుగైన ప్రదర్శన చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నవంబర్‌లో ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు లాంటి దిగ్గజాల ర్యాలీ నిఫ్టీ, బ్యాంకునిఫ్టీలను ఆల్‌టైమ్‌హైకి చేర్చింది. నవంబర్‌ సీరిస్‌లో నిఫ్టీకన్నా బ్యాంకు నిఫ్టీ ఎక్కువ లాభం అందించింది. దేశీయ వీఐఎక్స్‌ 15 స్థాయి దిగువకు వచ్చింది. ఫ్యూచర్స్‌లో భారీ షార్ట్‌కవరింగ్‌ను ఎఫ్‌ఐఐలు చేశాయి. డిసెంబర్‌ సీరిస్‌కి నిఫ్టీలో 79 శాతం, బ్యాంకు నిఫ్టీలో 70 శాతం రోలోవర్లు జరిగాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఇన్‌ఫ్రా రంగాల షేర్లలో బలమైన రోలోవర్లు, క్యాపిటల్‌ గూడ్స్‌, మీడియా, సిమెంట్‌ స్టాకుల్లో బలహీన రోలోవర్లు నమోదయ్యాయి. 
బలమైన రోలోవర్లు జరిగిన టాప్‌ 10  షేర్లు..
టొరెంట్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌, ఏసీసీ, బజాజ్‌ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్, ఎంఆర్‌ఎఫ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌లో బలమైన రోలోవర్లు నమోదయ్యాయి. 


బలహీన రోలోవర్లు జరిగిన టాప్‌ 10 షేర్లు...


ఓఎన్‌జీసీ, చోళ ఫైనాన్స్‌, వోల్టాస్‌, వేదాంత, ఐషర్‌ మోటర్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, నాల్కో, టీవీఎస్‌ మోటర్స్‌, శ్రీసిమెంట్‌, వొడాఫోన్‌ ఐడియాల్లో బలహీన రోలోవర్లు నమోదయ్యాయి. 


F&O

You may be interested

నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 29th November 2019

జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, శుక్రవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12.20 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 260.95 పాయింట్లు నష్టపోయి 31,862.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో 32,122.95 వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌, శుక్రవారం సెషన్‌లో 32,074.15 వద్ద ప్రారంభమైంది. ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ 105.70 పాయింట్లు నష్టపోయి 12,045.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 377.77 పాయింట్లు

యస్‌ బ్యాంక్‌ నిధులు సమీకరణ ఫలించేనా?

Friday 29th November 2019

దేశీయ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లలో ఒకటైనా యస్‌ బ్యాంక్‌ తన నిధుల సమీకరణకు సంబంధించిన వివరాలను శుక్రవారం జరగనున్న బోర్డు మీటింగ్‌ తర్వాత మీడియాకు విడుదల చేసే అవకాశం ఉంది. తీవ్ర రుణ భారం, ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్స్‌) సంక్షోభం వంటి అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ ఈ ఏడాదిలో భారీగా పడిపోయింది. కాగా 1.2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరించడంపై  మేనేజ్‌మెంట్‌ దృష్ఠి

Most from this category