News


ఎఫ్‌అండ్‌వోలో ఎక్కువ రోలోవర్‌ వీటిల్లోనే...

Friday 30th August 2019
Markets_main1567189262.png-28118

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో డేటాను పరిశీలించడం ద్వారా ట్రేడర్ల యాక్టివిటీని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోలోవర్ల పరిమాణం ఆయా స్టాక్స్‌ కదలికలపై రానున్న రోజుల్లో చూపించగలదు. దీనిపై సెంట్రమ్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ జయ్‌ పురోహిత్‌ విశ్లేషణ ఇలా ఉంది. 
 

ముఖ్యంగా షార్ట్‌ పొజిషన్లను కొన్నింటిని రోలోవర్‌ చేసుకున్నారు. సూచీలు జూలై నెలలో అమ్మకాలు చవిచూడగా, ఆగస్ట్‌ సిరీస్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. కీలకమైన 11,000 మార్కును కోల్పోవడమే కాకుండా ఆరు నెలల కనిష్ట స్థాయి 10,637ను నమోదు చేసింది. ఆ తర్వాత రికవరీ అయి తిరిగి 11,000మార్క్‌ను చేరింది. ఆగస్ట్‌ సిరీస్‌లో నికరంగా 2.70 శాతం నిఫ్టీ నష్టపోయింది. అయితే, గత నెల నష్టాలకు షార్ట్‌ పొజిషన్ల రోలోవర్లు గణనీయంగా ఉండడం కూడా ఒక కారణమే. అయితే, వీటిల్లో చాలా వరకు షార్ట్‌ పొజిషన్లు సెప్టెంబర్‌ సిరీస్‌కు బదిలీ కాలేదు. ఆగస్ట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.20,341 కోట్ల మేర అమ్మకాలు చేశారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో చెప్పుకోతగ్గ పరిమాణంలో షార్ట్‌ కూడా చేశారు. వారి లాంగ్‌, షార్ట్‌ పొజిషన్ల నిష్పత్తి ఇండెక్స్‌లో 31 శాతానికి తగ్గింది. ఇక దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ ఈక్విటీల్లో నికర కొనుగోలుదారులుగా వ్యవహరించారు. నికరంగా రూ.26,259 కోట్ల మేర అమ్మకాలు చేశారు. 

 

ఇక సెప్టెంబర్‌ సిరీస్‌ మొదటి రోజు సూచీలు మంచి లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ 11,000 మార్క్‌ను అధిగమించింది. నిఫ్టీ సెప్టెంబర్‌ సిరీస్‌ రోలోవర్‌ 68.76 శాతంగా ఉంది. త్రైమాసికంగా సగటు రోలోవర్‌ 75.34 శాతం కంటే తక్కువ. సెప్టెంబర్‌ సిరీస్‌కు సంబంధించి అధిక ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 11,700, 11,200 కాల్స్‌, 11,000, 11,600 పుట్‌ ఆప్షన్లలో నమోదైంది. ఇక ముందు నిఫ్టీకి 10,550-10,500 బలమైన మద్దతు స్థాయిలుగా, 11,250-11,500 నిరోధాలుగా పనిచేస్తాయి. అయితే, నిఫ్టీలో మొత్తం మీద పొజిషన్లు తక్కువగానే ఉన్నాయి. రానున్న రోజుల్లో తాజాగా ఏర్పాటయ్యే పొజిషన్లు గమనాన్ని నిర్దేశించనున్నాయని అంచనా. బ్యాంక్‌ నిఫ్టీలో కొన్ని షార్ట్‌ పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయి. ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ క్రితం ఎక్స్‌పైరీ నుంచి ఆగస్ట్‌ ఎక్స్‌పైరీకి 8.35 శాతం పెరిగింది. 

 

బ్యాంకు నిఫ్టీలో 66.41 శాతం పొజిషన్లు రోలోవర్‌ అయ్యాయి. యస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా, యూనియన్‌బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు కౌంటర్లలో చెప్పుకోతగ్గ షార్ట్‌ పొజిషన్లు సెప్టెంబర్‌కు బదిలీ అయ్యాయి. గత సిరీస్‌లో లాంగ్‌ పొజిషన్లు ఏర్పాటవడంతోపాటు సెప్టెంబర్‌కు రోలోవర్‌ అయిన వాటిల్లో బెర్జర్‌ పెయింట్‌, టాటా గ్లోబల్‌, మారికో, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ ఉన్నాయి. బాగా షార్ట్స్‌ క్రియేట్‌ అయి, తాజా సిరీస్‌కు రోలోవర్‌ అయిన వాటిల్లో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌డీవీఆర్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు, జిందాల్‌ స్టీల్‌, డిష్‌ టీవీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, ఎస్‌బీఐ, బీహెచ్‌ఈఎల్‌, ‍గ్రాసిమ్‌ ఉన్నాయి. 
 You may be interested

బ్యాంకిం‍గ్‌ బాహుబలి

Saturday 31st August 2019

ఈసారి 10 బ్యాంకుల విలీనం రూ. 55.81 లక్షల కోట్ల వ్యాపార పరిమాణం ప్రభుత్వ రంగంలో 12కి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య విలీనాలతో రుణ వితరణ పెంపు, వృద్ధికి ఊతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి బ్యాంకింగ్‌లో గవర్నెన్స్‌పరంగా మరిన్ని సంస్కరణలు జవాబుదారీతనం పెంచే చర్యలు న్యూఢిల్లీ: మందగమన భయాలతో డీలా పడుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, మొండిబాకీలతో కుదేలవుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల వ్యూహాన్ని కొనసాగిస్తోంది. ఎస్‌బీఐ, బీవోబీల్లో ఇతర

సెనెక్స్‌ లాభం 263 పాయింట్లు

Friday 30th August 2019

75 పాయింట్లు పెరిగిన నిఫ్టీ లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల మద్దతు చివరికి లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 263.86 లాభంతో 37,332.79 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,023.25 వద్ద ముగిసింది. అన్నిరంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 27,423.30 వద్ద

Most from this category