News


బడ్జెట్‌ బాగుంటే ఈ షేర్లు కొనొచ్చు!

Friday 28th June 2019
Markets_main1561712313.png-26659

అనలిస్టుల టాప్‌ 10 రికమండేషన్లు
ఈ వారం రానున్న కేంద్ర బడ్జెట్‌ మార్కెట్‌ ఆశలకు అనుగుణంగా ఉంటే దృష్టి పెట్టాల్సిన టాప్‌ 10 స్టాకులను వివిధ నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు.
1. ఐసీఐసీఐ బ్యాంకు: బ్యాంకు తాజా ఫలితాల్లో నికర ఎన్‌పీఏలను గణనీయంగా తగ్గించుకుంది. ఎన్‌ఐఐలో 27 శాతం మెరుగుదల నమోదయింది. రిటైల్‌బ్యాంకింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. 
2. మారికో: వచ్చే రెండుమూడేళ్లలో బలమైన క్యాపెక్స్‌ వ్యయం నమోదు చేయాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. గత మూడేళ్లుగా కంపెనీ కీలక అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించింది. 
3. ఎల్‌ఐసీ హౌసింగ్‌: అందరికీ గృహకల్పన జోరందుకోవడం కంపెనీకి కలిసివచ్చే అంశం.
4. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: ప్రభుత్వం రక్షణ వ్యయం పెంచడం బీఈఎల్‌కు పాజిటివ్‌ అంశం. కంపెనీకి రక్షణ రంగంలో బలమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆర్‌అండ్‌డీలో విదేశీ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది.
5. కల్పతరు పవర్‌: ఇప్పటివరకు టీఅండ్‌డీ విభాగంలో దాదాపు రూ.9వేల కోట్ల టెండర్లలో భాగస్వామ్యం పొందింది. కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ దాదాపు రూ. 14వేల కోట్లను దాటింది. సేల్స్‌ గ్రోత్‌ గైడెన్స్‌ 15- 20శాతముంది.
6- 10: వీటితో పాటు ఫెడరల్‌బ్యాంకు, హెచ్‌యూఎల్‌, డాబర్‌, కాల్గేట్‌, హీరోమోటోకార్‌‍్ప షేర్లు సైతం బడ్జెట్లో పథకాలతో పాజిటివ్‌గా స్పందిస్తాయని నిపుణుల అంచనా.You may be interested

ఫలితాల వాయిదా: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 13.50శాతం డౌన్‌..!

Friday 28th June 2019

కంపెనీ త్రైమాసిక ఫలితాల విడుదల ప్రక్రియ వాయిదా పడటంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 9శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.82.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ జూన్‌ 29న శనివారం వెల్లడించాల్సిన గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాలను జూలై 13కు వాయిదా వేస్తున్నట్లు కంపెనీ నేడు ఎక్చ్చేంజీలకు సమాచారం ఇచ్చింది. అడిట్‌ కమిటీ సభ్యులను నిర్థారించడానికి  కొందరు డైరెక్టర్లు​ అందుబాటులో లేకపోవడంతో

డబుల్‌ టాప్‌, డబుల్‌ బాటమ్‌ అంటే...?

Friday 28th June 2019

మార్కెట్లో షేరు ధరలను అధ్యయనం చేసి ట్రెండ్‌ను గుర్తించడంలో డబుల్‌టాప్‌, డబుల్‌ బాటమ్‌ ఉపయోగపడుతుంటాయి. ఒకే ధర వద్ద కొంత కాలపరిమితి తేడాతో ఏర్పడే కచ్ఛితమైన టాప్‌లను డబుల్‌టాప్‌ అని, కచ్ఛితమైన బాటమ్‌లను డబుల్‌ బాటమ్‌లని అంటారు. సాధారణంగా ఈ స్థాయిల వద్ద ట్రెండ్‌ రివర్సల్‌కు అవకాశాలుంటాయి. ఒక షేరు నిర్ణీత ధర వరకు చేరుకొన్న తర్వాత కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా కరెక‌్షన్‌ వస్తుంది. దీని తర్వాత బుల్స్‌

Most from this category