News


స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో టాప్‌ సిఫార్సులు

Saturday 14th September 2019
Markets_main1568439806.png-28373

దీర్ఘకాలానికి గాను బ్రోకరేజిలు సిఫార్సు చేసిన స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ స్టాకులు:
విశ్లేషకులు: ట్రేడింగ్‌బెల్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, అమిత్ గుప్తా
బీసీఎల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌
ప్రభుత్వం చమురు దిగుమతి బిల్లులను తగ్గించుకోడానికి ప్రయత్నిస్తోంది. ఫలితంగా ఇథనాల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభ్తుత్వం ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌(ఈబీపీ)ని ప్రోత్సహిస్తుండడంతో బీసీఎల్‌ ఇండస్ట్రీస్‌, శ్రీ రేణుక షుగర్స్‌ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. 
అఫ్లె ఇండియా
మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వృద్ధి చెందుతుండడంతో అఫ్లె ఇండియాకు దేశియంగా పెరుగుతున్న మొబైల్‌ వినియోగదారుల సంఖ్య లాభాన్ని చేకూర్చనుంది.
యూనిటెడ్‌ స్పిరిట్స్‌
రుణాలను తగ్గించుకోవడంతో యూనిటెడ్‌ స్పిరిట్స్‌ లాభపడనుంది.

విశ్లేషకులు: వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్, అజిత్ మిశ్రా, 
దీర్ఘకాలానికిగాను పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ క్రింది స్టాక్‌ల వాల్యుషన్‌ ఆకర్షిస్తోంది. 
వర్ల్పూల్, ఎల్గి ఎక్విప్మెంట్స్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అక్జో నోబెల్, ఐజీఎల్‌, కేఈసీ ఇంటర్నేషనల్, మిండా కార్ప్ వంటి మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు బాగున్నాయి. ఈ కంపెనీలు ప్రాథమికంగా బలంగా ఉండడంతో పాటు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు కలిగి ఉన్నాయి. ఈ కంపెనీలు వచ్చే రెండుమూడేళ్లలో మంచి రిటర్న్‌లను ఇవ్వగలవు.

బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్
సెంచరీ ప్లైబోర్డ్స్‌
సెంచరీ ప్లైబోర్డ్స్‌ కంపెనీ ప్లైవుడ్, లామినేట్ విభాగంలో కీలకంగా ఉంది. వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఈ కంపెనీ వివిధ ధరల వద్ద అనేక రకాల ఉత్పత్తులతో మార్కెట్లో అందుబాటులో ఉంది. సెంచరీ ప్లై తన లామినేట్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఎండీఎఫ్‌(మీడియం డెన్సిటీ ఫైర్‌బోర్డ్‌), పార్టికల్ బోర్డ్‌ విభాగంలోకి ప్రవేశించింది. కాగా ఆర్థిక సంవత్సరం 2020లో ఇతర వ్యాపారాలలో 15-20 శాతం ఆదాయ వృద్ధిని ఈ కంపెనీ అంచనా వేస్తుంది. స్టాండ్‌ ఎలోన్‌ ఎబిట్డా ఈ జూన్‌ త్రైమాసికంలో మారనప్పటికి మార్జిన్‌ మాత్రం గత మూడు త్రైమాసికాలతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల సాధించింది. 
ఓరియంటల్‌ సిమెంట్‌:
ఈ కంపెనీ ఈ జూన్‌ త్రైమాసికంలో ప్రకటించిన మార్జిన్‌ బాగున్నప్పటికి, ఎన్నికలు, లిక్విడిటీ కొరత వలన ఈ కంపెనీ వాల్యుమ్‌లు పడిపోయాయి. ఓరియంటల్‌ సిమెంట్‌ రూ. 6,900 కోట్ల రెవెన్యూను ఈ జూన్‌ త్రైమాసికంలో ప్రకటించింది. కానీ డిమాండ్‌ మందగించడంలో వలన వాల్యుమ్‌ మాత్రం 6 శాతం పడిపోవడం గమనార్హం. కంపెనీ దక్షిణ భారతదేశంలో బాగా రాణించినప్పటికి పశ్చిమ ప్రాతంలో కొంత బలహీనతను ఎదుర్కొంటుంది. ప్రాజెక్టులు, వాణిజ్యేతర విభాగానికి అధిక అమ్మకాలు ఉన్నందున ఈ కంపెనీ బలంగానే ఉంది. మూలధన వ్యయం అదుపులో ఉండడంతో ఈ కంపెనీ నికర అప్పులు రూ.10.7 బిలయన్‌లకు తగ్గడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం 21లోని ఆదాయానికి 2.2 రెట్లు నికర అప్పులు/ఎబిట్డా ఉండగా, ఇది ఆర్థిక సంవత్సరం 2019లో 4 రెట్లుగా ఉంది. ఈ కంపెనీ ఈపీఎస్‌ విలువను ఈ బ్రోకరేజి రూ. 106 నుంచి రూ. 112 కు పెంచింది. 
పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ
పీఎల్‌ఎన్‌జీ కంపెనీ, దేశంలో మొదటి ఎల్‌ఎన్‌జీ రిసీవింగ్‌, రీగ్యాసిఫికేషన్‌ టెర్మినల్‌ను దాహెజ్‌, కొచ్చి వద్ద ప్రారంభించింది. ఈ కంపెనీలో గెయిల్‌(ఇండియా), ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పోరేషన్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ కంపెనీలకు 12.5 శాతం చొప్పున వాటా ఉండడం గమనార్హం. ఈ కంపెనీ ఈపీఎస్‌ అంచనాలను ఆర్థిక సంవత్సరం 2020కి గాను రూ. 16.8కి, ఆర్థిక సంవత్సరం 2021కి గాను రూ. 19 కి ఈ బ్రోకరేజి తగ్గించింది.
పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌
పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌ నిర్మణ, మౌలిక రంగంలో అభివృద్ధి చెందుతోంది. ఈ కంపెనీ హైవేలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే వంటి నిర్మాణాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంది. ఆర్డర్‌ బుక్‌ బలంగా ఉండడంతో ఈ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2020కి గాను ఆదాయాన్ని ఏడాది ప్రాతిపదికన 45-50 శాతం వృద్ధి మార్గదర్శకాలను కొనసాగిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2020ఈ కి 11.3 రెట్లు వద్ద, ఆర్థిక సంవత్సరం 2021ఈ కి 7.9 రెట్లు వద్ద పీఎన్‌సీ ఇంజినీరింగ్‌ ప్రోక్యుర్‌మెంట్‌ కనస్ట్రక్సన్‌ బిజినెస్‌ పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్‌ రేసియో) వద్ద అందుబాటులో​ ఉంది.

విశ్లేషకులు: హెడ్ ఆఫ్ రీసెర్చ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వినోద్ నాయర్
మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ (ఎంటీఈపీ(ఎంటెప్‌))
పెయింట్స్, లూబ్రికెంట్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆహారం వంటి ఉత్పత్తులకు అధిక నాణ్యత కలిగిన ప్యాకేజిని అందించే కంపెనీలలో ఎంటెప్‌ ముందుంటుంది. ఈ కంపెనీ ఆదాయం సీఏజీఆర్‌(కాంపాండ్‌ యాన్యుల్‌ గ్రోత్‌ రేట్‌) ఈ జూన్‌ త్రైమాసికంలో 13 శాతం పెరిగింది. కం‍పెనీ సామర్ధ్య విస్తరణ, పెరుగుతున్న అమ్మకాలు, ఎఫ్‌ఎంసీజీ వాటా వలన ఈ కంపెనీ లాభపడుతోంది. ఐ మౌల్డ్‌ లేబులింగ్‌ (ఐఎంఎల్‌) సాంకేతిక పరిజ్ఞానం వైపు మారతుండడం వలన ఈ కంపెనిపై సానుకూలంగా ఉన్నాం. ఈ కంపెనీపై కొనుగోలు రేటింగ్‌ను ఇస్తున్నాం.
అవంతి ఫీడ్స్
రొయ్యల ఆహార తయారిదారు, రొయ్యల ప్రాసెసర్‌ కంపెనీ అయిన అవంతి ఫీడ్స్‌ గత ఐదేళ్ళలో ఈ పరిశ్రమ వృద్ధి కంటే మంచి రికార్డును నమోదు చేసింది.  ఈ కంపెనీ అమ్మకాల వృద్ధి ఆర్థిక సంవత్సరం 19 లో ఫ్లాట్‌గా ఉంది. కానీ, రాబోయే కాలంలో ఈ పరిశ్రమ మెరుగుపడే అవకాశం ఉండడంతో ఈ కంపెనీ లాభపడనుంది. ఇప్పటికే రొయ్యల ధరలు తాజా త్రైమాసికం‍లో స్వల్పంగా మెరుగుపడటం గమనించాం. కాగా ఈ కంపెనీ ఆర్థిక సంవత్సరం 2019-21ఈ కన్నా ఆదాయా సీఏజీఆర్‌ 14 శాతం, పాట్‌ సీఏజీఆర్‌ 19 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నాం.  

 You may be interested

స్వల్పంగా పెరిగిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 14th September 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శనివారం స్వల్పలాభంతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో మార్కెట్‌ ముగిసే సరికి 11,130.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11105.55 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో, ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపు (11111.00)తో పోలిస్తే 19 పాయింట్ల లాభంతో ఉంది. జాతీయ, అంతర్జాతీయంగా నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు జరగకపోతే సోమవారం నిఫ్టీ ఇండెక్స్‌ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే

ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు

Saturday 14th September 2019

లిక్విడిటీ మెరుగునకు కాఫీడే చర్యలు న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్‌) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ (సీడీఈఎల్‌) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్‌ గ్రేడ్‌ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్‌ నెగెటివ్‌ రేటింగ్‌ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది.

Most from this category