News


విలువలు ఆకర్షణీయం...టాప్‌-10 స్టాక్ సిఫార్సులు ఇవే..!

Tuesday 10th March 2020
Markets_main1583825023.png-32389

కరోనా భయాలు, క్రూడాయిల్‌ పతనంతో  హోలీ ముందు రోజు దలాల్‌ స్ట్రీల్‌ ఎరుపు రంగుతో పోటెత్తింది. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు చరిత్రలోనే అతిపెద్ద నష్టాలను చవిచూశాయి. సుమారు రూ.7లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్‌ మహాపతనంతో దలాల్‌ స్ట్రీట్‌ సెంటిమెంట్‌ బలహీనపడింది. ఇదే తరుణంలో వాల్యూయేషన్ల్లు ఆకర్షణీయంగా మారడంతో ధీర్ఘకాలిక దృష్ట్యా పెట్టుబడులు పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు కలిసొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి మార్కెట్‌ పతనంలో భాగంగా నాణ్యమైన షేర్లను గుర్తించి వాటికి ఎంపిక చేసుకోవాలని వారు ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నారు. 

దలాల్‌ స్ట్ట్రీట్‌ ఈ ఏడాది హోలీని కేవలం ఎరుపు రంగుతో మాత్రమే ఆడింది. స్టాక్‌ భారీ పతనం గురించి భయాందోళనలను విస్మరించి ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ ఫోలియోను వైవిధ్యపరచడానికి మన్నికైన స్టాక్‌లు, బాండ్లలో పెట్టుబడులపై దృష్టి సారించడటం ఉత్తమమని ఏవీపీ సాంకేతిక నిపుణుడు ధ్యానేశ్వర్‌ పద్వాల్‌ అభిప్రాయపడ్డారు.

బలమైన ఆర్థిక స్థితి, బ్యాలెన్స్ షీట్, ఫ్రీ క్యాష్‌ ఫ్లో కలిగిన మన్నికైన షేర్లను ఎన్నుకొని వాటిని తమ పోర్ట్‌ఫోలియోలో క్రమంగా పెంచుకోవాలి. ఈ స్వభావం కలిగిన షేర్లు అనిశ్చితి పరిస్థితుల్లో ఎక్కువగా ప్రభావితం కాకుండా ఉండటంతో పాటు స్థిరమైన పనితీరు కనబరుస్తాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏడాది కాలపరిమితితో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు ఓ 10స్టాక్‌లను రికమెండ్‌ చేస్తున్నాయి. 

రిలిగేర్‌ బ్రోకరేజ్‌ సిఫార్సులు:
1. ఎల్‌అండ్‌టీ: బలమైన ఆర్డర్‌ బుక్‌ కలిగింది. అధిక ఆదాయ విజిబులిటీ పాటు హెల్తీ ప్రాజెక్ట్‌ పైప్‌లైన్‌ ఉంది. వర్కింగ్‌ క్యాపిటల్‌లో మెరుగుదల మంచి రాబడినిచ్చేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూయేషన్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
2. బ్రిటానియా ఇండస్ట్రీస్‌:  ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ కొంత మందగమనాన్ని ఎదుర్కోంటున్న మాట వాస్తవమే. ఏడాదిలోపు పుంజుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ ఆర్థిక వ్యవస్థలో పునరుజ్జీవం ఆశిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తన పరిధిని పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రీమియం, ఆవిష్కరణ చేయడం, మూలధన సామర్థ్యాన్ని పెంచుకోవడం లాంటి ప్రయత్నాలతో బ్రిటానియా మార్కెట్లో తన వాటాను పెంచుకొంది. 
3. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: 20 శాతం మార్కెట్ వాటాతో రెండవ అతిపెద్ద ఫాస్ఫాటిక్ ఎరువుల సరఫరా కంపెనీగా కొనసాగుతోంది. సాదారణ స్థాయి కంటే నైరుతి రుతుపవాలు రాక, దేశం మొత్తం మీద రబీ సీజన్‌కు పంట విత్తనాల పెరుగుదల, వ్యవసాయ, ఎరువుల పెరుగదల కంపెనీకి కలిసొస్తాయి. 
4. యాక్సిస్‌ బ్యాంక్‌: క్యూ3లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. రానున్న రోజుల్లో రుణ వృద్ధి, ఆస్తుల నాణ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ కారణాల దృష్ట్యా రానున్న రోజుల్లో షేరు మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
5. జుబిలెండ్‌ ఫుడ్‌వర్క్స్‌: దేశంలోనే పుడ్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఇటీవల అంతర్జాతీయ పుడ్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో రెండు వైవిధ్యమైన కంపెనీలైన డోమినోస్‌ పిజ్జా, డంకెన్ డోనట్స్‌ కంపెనీల నుంచి ఫ్రాంఛైజింగ్‌ హక్కులను దక్కించుకుంది. పిజ్జా సిగ్మెంట్‌లో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది.  దేశవ్యాప్తంగా డోమినోస్‌ పిజ్జా, డంకెన్ డోనట్స్‌, హాంగ్స్‌ కిచెన్స్‌లకు చెందిన సుమారు 1200 అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది. సాంకేతికంగా షేరు ఇటీవల 20శాతం కరెక‌్షన్‌కు లోనైంది. అలాగే షేరు జీవితకాల మద్దతు స్థాయి రూ.1578 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది స్థాయి షేరకు రివర్సల్‌ పాయింట్‌గా పని చేస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు షేరు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు.
6. మైండ్‌ ట్రీ: సాంకేతికంగా పరిశీలిస్తే... షేరు వీక్లీ ప్రైజ్‌ ఛార్ట్‌లో మధ్యంతర ట్రెండ్‌ లైన్‌ బ్రేక్‌ అవుట్‌ ఇచ్చింది. కాబట్టి  ధీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ దృష్ట్యా షేరు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయడటం మంచింది. 
7. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: జీడీపీలో బీమా ఇన్సూరెన్స్‌ వాటా కేవలం 3.69శాతంగా ఉంది. దీనిబట్టి ఇండియా ఇన్సూరెన్స్‌ పరిశ్రమ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయ బీమా పరిశ్రమలో హెచ్‌డీఎఫ్‌సీ లైప్‌ వాటా 25.1శాతంగా ఉంది. ప్రైవేట్‌ రంగ బీమా సంస్థల్లో అతిపెద్దది. షేరు లిస్టింగ్‌ నాటి నుంచి ఏకంగా రూ.86శాతం రాబడినిచ్చింది.  సాంకేతికంగా, ఈ స్టాక్ 50 శాతం ఫిబోనకి రిట్రాస్‌మెంట్ రూ. 495  మద్దతు స్థాయికి సమీపంలో ట్రేడవుతోంది. ఇక్కడ షేరు పతనమైన ప్రతిసారి ర్యాలీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

II. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

8. ఐసీఐసీఐ బ్యాంక్‌: ఆస్తుల నాణ్యత మెరుగుదల, కార్పోరేట్‌ అండర్‌రైటింగ్‌, బ్యాలెన్స్‌ షీట్‌ రిటైలైజేషన్ లాంటి నాణ్యమైన అంశాల దృష్టా‍్య షేరు అధిక రాబడులను ఇచ్చేందుకు మంచి అవకాశం ఉంది. అయితే తక్కువ రేటింగ్‌ కలిగిన కార్పోరేట్‌ రుణాలను కలిగి ఉన్నందున అసెట్‌ క్వాలిటీ స్వల్పకాలంతో మందగమనంతో సాగవచ్చు. అయినప్పటికీ.., దాని విస్తృత పంథా మారదు. మోడరేషన్ స్లిప్పేజీలు, ఎల్‌ఎల్‌పిలు,  ఆర్‌ఏడీలు మెరుగుపరచడం షేరు ర్యాలీకి సహకరిస్తాయి.
9. ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ సర్వీసెస్‌: గతకొన్నేళ్లుగా కంపెనీ ఎలాంటి ఆర్థిక ఒత్తిళ్లకు లోనుకాలేదు. నిధుల సమీకరణ విషయంలో 2018 తరువాత షేరు ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదు. ఈ కారణాలతో వాహనా అమ్మకాల్లో క్షీణత ఉన్నప్పటికీ.., మార్కెట్లో తన వాటాను పెంచుకోవడంతో పాటు ఈ రంగంలో అగ్రపథాన నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుపడితే ... కంపెనీకి మరింత ఫ్రీ క్యాష్‌ ఫ్లో అందుబాటులోకి వస్తుంది.  ప్రస్తుత వాల్యూయేషన్లు షేరు కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్నాయి.
10. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీ: ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఇప్పటికీ ఈ షేరు టాప్‌ పిక్‌గా కొనసాగుతోంది. ఉత్పత్తుల్లో డైవరిసిఫికేషన్‌లతో నిధుల కొరత లేకుండా చేస్తుంది.  ప్రస్తుత వాల్యూయేషన్లు షేరు కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్నాయి. You may be interested

ఎస్‌బీఐ రేటింగ్‌ తగ్గించిన హెచ్‌ఎస్‌బీసీ

Tuesday 10th March 2020

టార్గెట్‌ ధర రూ.405 నుంచి రూ.300కు కుదింపు ముంబై:  ‍ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ షేరు రేటింగ్‌ను కుదించింది. యస్‌బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు ఇందుకు కారణమని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. గతంలో తాము ఎస్‌బీఐ షేరుకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను ‘‘హోల్డ్‌’’కు సవరించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.405 నుంచి రూ.300కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. యస్‌బ్యాంక్‌లో 49శాతం వాటాను కొనుగోలు చేయనున్న

ఆసియా రిచెస్ట్‌ మ్యాన్‌ హోదా కోల్పోయిన ముకేశ్అం‌బానీ!

Tuesday 10th March 2020

ఆయిల్‌, రిటైల్‌, టెలికంలతో పాటు వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. రెండోస్థానంలో ఉన్న అలీబాబా గ్రూపు అధినేత జాక్‌ మా మొదటిస్థానంలోకి వచ్చారు. కరోనా వైర స్‌(కోవిడ్‌-19) ధాటికీ ప్రపంచ దేశాల మార్కెట్లు కూప్పకూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,942 పాయింట్లు కుప్పకూలింది. ఇది చరిత్రలోనే పాయింట్ల రీత్యా అత్యంత భారీ

Most from this category