News


సంవత్‌ 2076 కోసం టాప్‌ 10 ముహూరత్‌ స్టాకులు!

Saturday 26th October 2019
Markets_main1572085247.png-29168

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు గత కొన్ని సెషన్‌ నుంచి పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 11,500 పైన ట్రేడవుతుండగా, సెన్సెక్స్‌ 39,000 స్థాయికి పైన ట్రేడవుతోంది. మార్కెట్‌లో సెంటిమెంట్‌ పెరిగింది. ఇలాంటి పరిస్థితులలో సంవత్‌ 2076 కోసం ఏయూఎం క్యాపిటల్‌ టాప్‌ 10 స్టాకులను సిఫార్సు చేస్తోంది...
బ్రోకరేజి: ఏయూఎం క్యాపిటల్‌
బజాజ్‌ ఆటో:
ద్విచక్ర, త్రి చక్ర వాహన విభాగంలో బజాజ్‌ ఆటో కీలకమైన కంపెనీగా ఉంది. ఈ కంపెనీ 79 దేశాలలో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ తను ఉత్పత్తి చేసిన వాహనాలలో  41 శాతం వాహనాలను ఎగుమతి చేయడం గమనార్హం. ఇండియాలో బీఎస్‌-6 నిబంధనలు ఏప్రిల్‌, 2020 నుంచి అమలు కానుండడంతో వీటి డిమాండ్‌పై అనుమానాలున్నాయి. ఒకవేళ డిమాండ్‌ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికి, బజాజ్‌ ఆటో ఎగుమతులు అధికంగా ఉండడం‍ వలన ఆటో రంగంలో ఈ కంపెనీ స్టాక్‌  రక్షణాత్మకమైన స్టాకుగా పనిచేస్తుంది. బజాజ్‌ ఆటో నవంబర్‌ నెల నుంచి బీఎస్‌ 6 నిబంధనలకు అనుగుణంగా వాహనాలను తయారుచేయడం ప్రారంభించనుంది. ఫైనాన్సియల్‌గా బలంగా ఉండడంతో పాటు, వైవిధ్యభరితమైన ఉత్పత్తులుండడం వంటి అంశాల వలన, ఈ కంపెనీ స్టాకు ఆకర్షిణియమైన వాల్యుషన్‌ వద్ద ట్రేడవుతోంది.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్:
అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్,  ఇండియాలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీ రూ. 3 వేల కోట్ల విలువైన సామర్థ్య విస్తరణను పూర్తి చేసింది.  దేశ, విదేశాలలో కలిపి ఈ కంపెనీకి 55 ప్రత్యేకతలతో 70 ఆసుపత్రులున్నాయి. మొత్తంగా మార్చి 31, 2019 నాటికి అపోలో హాస్పిటల్స్‌కు 10,167 పడకల సామర్థ్యం ఉంది.  
   కంపెనీ, కార్యచరణ ప్రదర్శనను పెంచి, రుణాలను రూ .3,300 కోట్ల నుంచి రూ .2,500 కోట్లకు తగ్గించుకునేందుకు ప్రత్యేకంగా దృష్ఠిసారించింది. కంపెనీకున్న వినూత్న ఆర్‌ అండ్‌ డీ సామర్ధ్యం, బలమైన బ్రాండ్ ఈక్విటీ, సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన సర్వీస్‌, ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడం వంటి అంశాల వలన కంపెనీ మార్జిన్‌లు, రిటర్న్‌ రేషియోలు పెరుగుతాయని నమ్ముతున్నాం. ధరలు, కంపెనీ విస్తరణ సామర్ధ్యం పెరగడం, ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మోడళ్లను మెరుగుపరచడం, ప్రమోటర్లు రుణ భారాన్ని తగ్గించుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం వలన అపోలో హాస్పిటల్స్‌ మంచి రిస్క్‌ రివార్డును అందిస్తుంది.
ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ:
ఈ కంపెనీ ట్రావెల్‌, వాహన, ఆరోగ్యం, హోం, ఇతర విభాగాలలో ఇన్సురెన్స్‌ సేవలను అందిస్తోంది. తాజాగా ప్రభుత్వం ద్వి చక్ర వాహనాలకు 3 ఏళ్లు, కార్లకు 5 ఏళ్లు థర్డ పార్టీ ఇన్సురెన్స్‌ను చేసుకోవాలనే నిబంధనను తీసుకురావడంతో, హెల్త్‌ ఇన్సురెన్స్‌ వార్షిక ధరలలో మార్పులు చేయడానికి అవకాశం వచ్చింది. ఈ నిబంధనల వలన ఇన్సురెన్స్‌  పరిశ్రమలో అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో పాటు, తీసుకున్న వివిధ చర్యల వలన ఈ కంపెనీ లాభపడనుంది. కంపెనీ టైర్‌ 3, 4 సిటీలలో కూడా విస్తరించడానికి ప్రణాళికలు వేస్తుండడంతో రిటైల్‌ వ్యాపారం వృద్ధి చెందుతుందని అంచనావేస్తున్నాం
కోటక్‌ మహింద్రా బ్యాంక్‌:
బ్యాంకింగ్‌ వ్యాపారం కాకుండా, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ అనుబంధ సంస్థలయిన ఏఎంసీ(ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ), ఇన్సురెన్స్‌, బ్రోకింగ్‌, ఫర్సనల్‌ ఫైనాన్స్‌ వంటి సంస్థలు బాగా పదర్శన చేస్తుండడంతో పాటు మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ను సంపాదించగలిగాయి. అధిక మొత్తంలో క్యాపిటలైజేషన్‌ కలిగివుండడం, బలమైన లయబిలిటీ ప్రాంచైజ్‌తో పాటు ఆస్తి నాణ్యత బాగుండడం వలన పోటీ బ్యాంకుల కంటే ఈ బ్యాంక్‌ మంచి స్థానంలో ఉంది. బ్యాంక్‌ సీఏఎస్‌ఏ(కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్స్‌ అకౌంట్‌) ఆకర్షిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ లాభాలు బాగుండడంతో బ్యాంక్‌ రుణ పుస్తకం వృద్ధి చెందడం, క్రెడిట్‌ ఖర్చులు అదుపులో ఉండడం, మార్జిన్లు బాగుండడం వంటి అంశాలు కొనసాగుతాయని అంచనావేస్తున్నాం. 
పాలీకాబ్‌ ఇండియా:
కంపెనీ 40 దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ ఎగుమతుల వాటా 5 శాతంగా ఉంది. కంపెనీ ఏప్రిల్‌ 2019న ఐపీఓ ద్వారా రూ. 1,346 కోట్లను సమీకరించంది. ఈ నిధులతో కంపెనీ మార్జిన్‌లు మెరుగుపడ్డాయి. అంతేకాకుండా కంపెనీ నిధుల ప్రవాహాం పెరిగింది. వీటితో రానున్న రెండు మూడేళ్లలో కంపెనీని రుణాలు లేని సంస్థగా మార్చాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.
ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కంపెనీ:
కంపెనీ ఐఆర్‌పీ(ఇండివిడ్జ్యువల్‌ రేటెడ్‌ ప్రీమియం) ఆర్థిక సంవత్సరం 2019 ప్రథమార్ధంలో 21.9 శాతంగా ఉండగా, ఆర్థిక సంవత్సరం 2020 ప్రథమార్ధానికి 23.1 శాతానికి పెరిగింది. ఫలితంగా కంపెనీ, ప్రైవేట్‌ మార్కెట్‌ వాటాలో విస్తరిస్తోందని తెలుస్తోంది. ఫైనాన్సియల్‌గా రక్షణ ఉండాలని ప్రజలలో అవగాహన పెరగడంతో పాటు, ఆపరేటింగ్‌ ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉండడం, సాంకేతికత ఆధారంగా సేవలనందిస్తుండడం, మార్జిన్‌లు మెరుగుపడడం వంటి అంశాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాలలో విస్తరించడం వలన ఎస్‌బీఐ లైఫ్‌ వృద్ధి కొనసాగుతుందని అంచనావేస్తున్నాం. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:
బ్యాంకింగ్‌ విభాగంలో బలమైన స్థానంలో ఉండడంతో పాటు, అతిపెద్ద పంపిణీ వ్యవస్థను కలిగివుండడం, డిజిటల్‌ సేవలపై అధిక దృష్ఠి పెట్టడం, క్యాపిటల్‌ అందుబాటులో​ ఉండడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన మార్కెట్‌ వాటాను పెంచుకుంటోంది. గత కొన్ని త్రైమాసికాల నుంచి ఫండ్స్‌ ఖర్చుల ఒత్తిడి పెరుగుతున్నప్పటికి బ్యాంక్‌ మంచి మార్జిన్‌లను కొనసాగిస్తోంది. సీఏఎస్‌ఏ డిపాజిట్‌లు వృద్ధి చెందుతున్నప్పటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఈ బ్యాంక్‌ ముందుంది. 
హవెల్స్‌ ఇండియా:
లాయిడ్‌ వ్యాపారాన్ని పునర్మించడంతో పాటు, ఆర్థిక మందగమనం కారణంగా హవెల్స్‌ ఇండియా ఆదాయ వృద్ధి ఆర్థిక సంవత్సరం 2020ఈ(ఆదాయం) లో 6 శాతం తగ్గుతుందని, కానీ డిమాండ్‌ పుంజుకోవడంతోపాటు, లాయిడ్‌ వ్యాపారం తిరిగి సాధరణ స్థాయికి చేరుకోనుండడంతో ఆర్థిక సంవత్సరం 2021ఈలో 14 శాతం బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందని అంచనావేస్తున్నాం. ప్రస్తుతం కంపెనీ షేరు ఆర్థిక సంవత్సరం 2021ఈ ఈపీఎస్‌కు 38 రెట్లు వద్ద ట్రేడవుతోంది. ఇది ఒక ఏడాది ముందస్తు పీఈ మూడేళ్ల సగటు కంటే 16 శాతం తక్కువ కావడం గమనార్హం. 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజిస్‌:
ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో,  ఆర్థిక సేవలు, తయారీ, రిటైల్ వంటి విభాగాల ద్వారా కంపెనీ 12 ఒప్పందాలను పొం‍దగలిగింది. అధికంగా డీల్‌ రావడంతోపాటు, కంపెనీ ఆర్గానిక్‌ వృద్ధి పెరగడంతో, ప్రస్తుత ఏడాదిలో కంపెనీ తన మార్గదర్శకాలను పెంచింది. ఈ కంపెనీ షేరు ఆర్థిక సంవత్సరం 16-21 మధ్య కాలానికిగాను  20.1 శాతం రెవెన్యూ సీఏజీఆర్‌ను, 18.4 శాతం పాట్‌(పన్ను తర్వాత లాభం) సీఏజీఆర్‌ను అందిస్తోంది.
కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్:
పట్టణీకరణ పెరగడం, ప్రీమియమైజేషన్‌, వివిధ ప్రాంతాలలో విస్తరించడం వం‍టి అంశాల వలన ఈ కంపెనీ ఆలంకరణ పెయింటింగ్‌ విభాగంలో మంచి స్థాయిలో ఉంది. వడ్డీ రేట్ల కోత, ప్రభుత్వ సంస్కరణలు, వ్యవస్థలో లిక్విడిటీ అందుబాటు పెరగడం వంటి అంశాల వలన ముందుకు వెళ్లేకొద్ది మెరుగుపడుతుందని అంచనావేస్తున్నాం. You may be interested

సాయం కోసం ప్రభుత్వం చెంతకు..

Saturday 26th October 2019

వొడాఫోన్‌ ఐడియా యత్నాలు లేదంటే దివాలా తప్పదని నిపుణుల అంచనా సుప్రీం కోర్టు తీర్పుతో భారీ ఇబ్బందుల్లో పడిన వొడాఫోన్‌ ఇండియా, సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని యోచిస్తోంది. లైసెన్సు ఫీజు బకాయిలపై జరిమానాలు, వడ్డీలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోతే కంపెనీ మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు పలు ఆర్థిక చిక్కులకు దారితీస్తుందని కంపెనీ సైతం భావిస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని

ఐసీఐసీఐ నికరలాభం రూ. 655 కోట్లు

Saturday 26th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంకు  నికరలాభం గతేడాదితో పోలిస్తే సుమారు 28 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ. 655 కోట్ల లాభం ప్రకటించింది, గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ. 909 కోట్ల లాభం నమోదు చేసింది. అనలిస్టులు ఈ క్యు2లో రూ. 975.6 కోట్ల లాభం అంచనా వేశారు.  ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆస్తుల నాణ్యత మెరుగైంది. క్యు2లో బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు గత త్రైమాసికంలో

Most from this category