News


టాప్‌-10 కంపెనీలకు లాభాల పండగే.!!

Monday 13th January 2020
Markets_main1578855268.png-30868

మార్కెట్‌ విలువ పరంగా దేశంలోని మొదటి పది పెద్ద కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి లాభాల్లో 23 శాతానికి పైగా సగటు వృద్ధిని చూపించొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గడం, ఆర్థిక సేవల రంగం కాస్త తెరిపిన పడడం వంటి వాటిని ఇందుకు ఆధారంగా పేర్కొంటున్నారు. క్రితం ఏడాది ఇదే కాలంలో (2018 డిసెంబర్‌ త్రైమాసికం) ఈ కంపెనీల లాభాల్లో వృద్ధి సగటున 14 శాతంగానే ఉండడం గమనార్హం. ఆరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిన దేశ ఆర్థిక వృద్ధి రేటును పుంజుకునేలా చేసేందుకు, కేంద్ర సర్కారు కార్పొరేట్లపై ఆదాయ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం. 

 

లాభాలను భారీగా పెంచుకుంటాయని అంచనా వేస్తున్న టాప్‌ కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. వీటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు లాభాల వృద్ధి మిగతా వాటితో పోలిస్తే మరింత అధికంగా ఉండనుందని అంచనా. భారీ ఎన్‌పీఏలకు పరిష్కారం నేపథ్యంలో బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ రంగం మంచి ఆరోగ్యకర పనితీరు చూపించొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ పాండే పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్ను తగ్గించడం కూడా లాభదాయకతను పెంచుతుందన్నారు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే డిసెంబర్‌ త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభం 20 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గడంతో ఇనిస్టిట్యూషన్స్‌, అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు గత ఏడాదిన్నర కాలంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌పైనే దృష్టి సారించడం తెలిసిందే. దీంతో లార్జ్‌క్యాప్‌ విభాగంలోని నాణ్యమైన అగ్రస్థాయి కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి.

 

ఇక నిఫ్టీ-50లోని 50 కంపెనీల లాభాలు డిసెంబర్‌ త్రైమాసికంలో సగటున 10.7 శాతం పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 11.8 శాతంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా కార్పొరేట్‌ పన్ను తగ్గింపు బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల కంపెనీలకు ఎక్కువగా కలసి రానుంది. గతేడాది నిఫ్టీ-50 12 శాతం ర్యాలీ చేయగా, మిడ్‌క్యాప్‌ సూచీ 4.3 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 9.5 శాతం మేర నష్టపోవడం గమనార్హం. ఇప్పటికే ఇన్ఫోసిస్‌ డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ఫలితాలను ప్రకటించగా, లాభం 23.7 శాతం వృద్ధి సాధించింది. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, విప్రో, టీసీఎస్‌ ఫలితాలు ఈ వారంలోనే వెలువడనున్నాయి. మందగమన ప్రభావం ఉన్న రిటైల్‌ రంగానికి సంబంధించి టీసీఎస్‌కు ఎక్కువ క్లయింట్లు ఉండడం, బ్రెగ్జిట్‌ కారణంగా కంపెనీ ఫలితాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.



You may be interested

క్యూ3 ఫలితాలు, ఆర్థికాంశాలే దిక్సూచీ

Monday 13th January 2020

- ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, విప్రో ఫలితాలు ఈవారంలోనే.. - సోమవారం సీపీఐ, మంగళవారం డబ్ల్యూపీఐ డేటా వెల్లడి - అమెరికా–చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి - తొలి దశ ఒప్పందంపై బుధవారం సంతకాలు చేసే అవకాశం! న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ3 ఫలితాల ప్రకటనలు, ద్రవ్యోల్బణ గణాంకాల వంటి స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ సేవల

యాంఫి మార్పుల ప్రభావం ఫండ్స్‌పై ఉంటుందా..?

Monday 13th January 2020

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు) అసోసియేషన్‌ ‘యాంఫి’ సెబీ నిబంధనల మేరకు స్టాక్స్‌ వర్గీకరణ జాబితాను ఇటీవలే ప్రకటించింది.  మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా టాప్‌100 స్టాక్స్‌ను లార్జ్‌క్యా్‌ప్‌ విభాగంలోకి, తదుపరి 150 స్టాక్స్‌ను మిడ్‌క్యాప్‌ విభాగం కింద, ఆ తర్వాత స్టాక్స్‌ను స్మాల్‌క్యాప్‌గా వర్గీకరించడం జరిగింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల పనితీరు పోల్చి చూసుకునేందుకు, సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సెబీ 2017 అక్టోబర్‌లో

Most from this category