News


మార్కెట్‌ కొత్త హై....టాప్‌ కంపెనీలు ఇవే!

Tuesday 26th November 2019
Markets_main1574753667.png-29870

అంతర్జాతీ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో సూచీలు మంగళవారం సరికొత్త  జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెనెక్స్‌ 41,120 వద్ద, నిఫ్టీ 12,132.45 తమ జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. వీటితో పాటు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 31,813.70 వద్ద నూతన ఆల్‌టైంకి చేరుకుంది. ఈ ఏడాదిలో నిఫ్టీ ఇండెక్స్‌ ఏకంగా 7సార్లు కొత్త రికార్డు హైలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేష్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం...

26-11-2019 నాటి ట్రేడింగ్‌లో టాప్‌-10 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌
క్రమ సంఖ్య కంపెనీ పేరు మార్కెట్‌ క్యాప్‌ విలువ
1 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.9.94లక్షల కోట్లు
2 టీసీఎస్ రూ.7.80లక్షల కోట్లు
3 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.6.95లక్షల కోట్లు
4 హిందూస్థాన్‌యూనిలివర్‌ రూ.4.46 లక్షల కోట్లు
5 హెచ్‌డీఎఫ్‌సీ రూ.3.99లక్షల కోట్లు
6 ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.3.26 లక్షల కోట్లు
7 ఐటీసీ రూ.3.06లక్షల కోట్లు
8 కోటక్‌ మహీంద్రా రూ.3.06లక్షల కోట్లు
9 ఎస్‌బీఐ రూ.3.02లక్షల కోట్లు
10 ఇన్ఫోసిస్‌ రూ.2.98లక్షల కోట్లు

 



You may be interested

42 కౌంటర్లలో ఎంఏసీడీ బై సిగ్నల్‌!

Tuesday 26th November 2019

సోమవారం ముగింపు ప్రకారం 42 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోంది. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో జిందాల్‌ స్టీల్‌, టాటాస్టీల్‌, టాటాస్టీల్‌ బీఎస్‌ఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఆదిత్యబిర్లా మనీ, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, దివిస్‌ ల్యాబ్‌, ఎరిక్‌ లైఫ్‌సైన్సెస్‌ తదితరాలున్నాయి. ఈ

మీ డిమ్యాట్‌ సురక్షితమేనా?!

Tuesday 26th November 2019

బ్రోకింగ్‌ సంస్థ నుంచి మీ హోల్డింగ్స్‌ కాపాడుకోండి నిపుణుల సూచనలు కార్వీసంస్థ నిర్వాకం బయటపడడంతో ఇన్వెస్టర్లంతా అవాక్కయ్యారు. కార్వీ అవకతవకలపై సెబి కన్నెర్రజేసింది. క్లయింట్లకు తెలియకుండా వాళ్ల అకౌంట్లను వాడుకోవడాన్ని సెబి తీవ్రంగా పరిగణించింది. కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా ఆదేశాలిచ్చింది. కార్వీ దెబ్బకు ఇన్వెస్టర్లు తమ తమ అకౌంట్లను బ్రోకింగ్‌ సంస్థలు ఎలా అనైతికంగా వాడుకుంటున్నాయో తెలిసివచ్చింది. ఈనేపథ్యంలో మీ డీమాట్‌ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు.  = టెక్నాలజీని వాడుకోండి:

Most from this category