News


టాటామోటార్స్‌ షేరు 5% డౌన్‌

Wednesday 4th March 2020
Markets_main1583318008.png-32279

బుధవారం టాటా మోటార్స్‌ షేరు 5 శాతానికి పతనమైంది. 2020 ఫిబ్రవరిలో 34.42 శాతం పడిపోయాయని కంపెనీ మంగళవారం ప్రకటించడంతో నేడు షేరు విలువ పడిపోయింది. కోవిడ్‌-19 ప్రభావంతో చైనానుంచి సరఫరా కావాల్సిన విడిభాగాలు ఆగిపోవడంతో టాటామోటార్స్‌ ఉత్పత్తి తగ్గిందని కంపెనీ తెలిపింది. గతేడాది ఫిబ్రవరిలో 56,826 యూనిట్లుగా ఉన్న ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 37,826కు పడిపోయింది. అంతేకాకుండా వాణిజ్య వాహనాల ఉత్పత్తి గతేడాదిలో 45.8 శాతంగా ఉంటే ఈ ఏడాది 35శాతానికి పడిపోయింది. మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు సైతం 29.4 శాతానికి పడినట్లు  కంపెనీ పేర్కొంది. మొత్తంగా చూస్తే ఈ ఫిబ్రరిలో 34 శాతం విక్రయాలు పతనమై 38,002 యూనిట్లుగా నమోదైయ్యాయి. మార్కెట్‌ ముగిసేసమయానికి టాటామోటార్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం తగ్గి రూ.126.40 వద్ద ముగిసింది.



You may be interested

ఫెడ్‌ ఆకస్మిక రేట్ల కోత: భారత్‌లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు పెరుగుతాయా..?

Wednesday 4th March 2020

కరోనా వైరస్‌ వ్యాధి ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు విస్తరిస్తున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ వడ్డీరేట్లపై అత్యవసరంగా 50 బేసిస్‌ పాయింట్ల కోత విధించింది. అనూహ్యంగా ప్రపంచ మార్కెట్లు రేట్ల తగ్గింపు ఈక్విటీ మార్కెట్లను మెప్పించకపోవడంతో ఆయా దేశాల స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.  రేట్ల తగ్గింపు ఇన్వెస్టర్లు స్వాగతించకపోగా మరింత అప్రమత్తత వహిస్తూ అమ్మకాల మొగ్గుచూపారు. వాస్తవానికి మార్చి 17-18 తేదీల్లో ఫెడ్‌ రిజర్వ్‌ సమీక్షా సమావేశాల్లో

ఆటుపోట్ల మధ్య నష్టాల ముగింపు

Wednesday 4th March 2020

సెన్సెక్స్‌ 214 పాయింట్లు డౌన్‌ 52 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ ఫార్మా, ఐటీ రంగాలు లాభాల్లో కరోనా కల్లోలానికి చెక్‌ పెట్టేందుకు వీలుగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నపళంగా అర శాతం వడ్డీ రేటును తగ్గించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 214 పాయింట్లు క్షీణించి 38,409 వద్ద నిలవగా.. నిఫ్టీ 52 పాయింట్ల వెనకడుగుతో 11,251 వద్ద స్థిరపడింది. ఫెడ్‌ వడ్డీ తగ్గింపుతో మంగళవారం తొలుత అమెరికా మార్కెట్లు 1

Most from this category