News


నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 4th February 2020
Markets_main1580794403.png-31493


వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

నేడు బోర్డు సమావేశాలు నిర్వహించే కంపెనీలు..
 ఆదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, అవంతీ ఫీడ్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బల్‌మర్‌ లారై అండ్‌ కంపెనీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఆరికిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ సాఫ్ట్‌వేర్‌, పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, టాటా గ్లోబల్‌ బేవరేజస్‌, థర్‌మ్యాక్స్‌, టైటాన్‌ కంపెనీ, టీవిఎస్‌ మోటార్‌ కంపెనీ.

వెల్‌స్పన్‌ కార్పొరేషన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 8 రెట్లు పెరిగి రూ.223.48 కోట్లకు చేరిందని వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ వెల్లడించింది.

హడ్కో: డిసెంబర్‌తో ముగిసిన మూడోత్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 37 శాతం తగ్గి రూ.206 కోట్లకు చేరిందని హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) వెల్లడించింది. 

బేయర్‌ క్రాప్‌సైన్స్‌: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో నికర లాభం రూ.138 చేరిందని బేయర్‌ క్రాప్‌సైన్స్‌ ప్రకటించింది. 2018లో నికర లాభం రూ.63.1 కోట్లుగా ఉంది. 

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 38.4 శాతం పెరిగి రూ.879.16 కోట్లకు చేరిందని శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ ప్రకటించిది.

పీఎన్‌బీ: బాసల్‌ 3 ప్రమాణాలు కలిగిన బాండ్స్‌ జారీ చేయడం ద్వారా రూ.1,000 కోట్ల నిధులను సమీకరించేందుకు బోర్డు అనుమతిచ్చిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వెల్లడించిది.

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: ఈ కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడెటేడ్‌ నికర లాభం 2 రెట్లు పెరిగి రూ.75 కోట్లకు చేరిందని ప్రకటించింది.

గ్లాక్సోస్మిత్‌క్లైన్‌: జిన్‌ట్యాక్‌ ఔషధాన్ని మార్కెట్‌ నుంచి స్వచ్ఛందంగా ఉపసంహరించుకోవడంతో క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.661.16 కోట్లు అని కంపెనీ తెలిపింది. 

దీపక్‌ నైట్రైట్‌: దీపక్‌ నైట్రైట్‌ కంపెనీ క్యూ3లో నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.157 కోట్లకు చేరిందని కంపెనీ ప్రకటించింది.

టాటామోటార్స్‌: టాటా మోటార్స్‌ ఎస్‌యూవీ హారీయర్‌ బీఎస్‌-6 కంప్లీయంట్‌ వెర్షన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం జంప్‌..!

Tuesday 4th February 2020

మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో భాగంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2.25శాతం పెరిగింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,235.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.25శాతం

ఐటీసీ షేరు పతనం... పన్నుపోటొక్కటే కారణమా?

Tuesday 4th February 2020

అంతర్జాతీయంగా బలహీనంగా ఉన్న టొబాకో వ్యాపారం ప్రభావం చూపని కొత్త సీఈఓ బడ్జెట్లో సిగిరెట్లపై పన్ను భారం పెంచడంతో ఐటీసీ రెండ్రోజుల్లో దాదాపు 12 శాతం పతనమైంది. ఇప్పుడే కాదు చాలాసార్లు అనలిస్టులు, మదుపరుల అంచనాలను ఐటీసీ బోల్తా కొట్టిస్తూనే ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్లుగా దాదాపు 85 శాతం మంది అనలిస్టులు ఈ స్టాకుపై బుల్లిష్‌గా ఉంటున్నా ఐటీసీ మాత్రం స్థిరంగా పతనమవుతూ వచ్చింది. తాజాగా దాదాపు ఐదేళ్ల కనిష్ఠాలకు

Most from this category