STOCKS

News


ఐఆర్‌సీటీసీ లిస్టింగ్‌ నేడే

Monday 14th October 2019
Markets_main1571020838.png-28854

  • బంపర్‌ లాభాలకు చాన్స్‌...
  • ఇష్యూ ధర రూ.320
  • లిస్టింగ్‌ రూ.500 పైనే ఉండొచ్చని అంచనాలు...

న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) షేర్లు నేడు (సోమవారం) స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. సెప్టెంబర్‌ 30న మొదలై ఈ నెల 4న ముగిసిన ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా ఐఆర్‌సీటీసీ రూ.638 కోట్లు సమీకరించింది. రూ.10 ముఖ విలువ,  రూ.315-320 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఇంత భారీగా ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌కావడం ఇదే మొదటిసారి. ఈ ఐపీఓలో భాగంగా 12 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో కేంద్రం విక్రయించింది. 

అనూహ్యంగా లిస్టింగ్‌ లాభాలు ..! 
ఐఆర్‌సీటీసీ ఐపీఓలో క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లు(క్విబ్‌)లకు కేటాయించిన వాటా 109 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 355 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 15 రెట్లు చొప్పున ఓవర్‌సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఐపీఓకు అనూహ్య స్పందన రావడంతో లిస్టింగ్‌ లాభాలు కూడా అనూహ్యంగానే ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఐపీఓకు ఇష్యూ ధరగా రూ.320ను కంపెనీ ని‍ర్ణయించింది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో రూ.200-250 రేంజ్‌లో ప్రీమియమ్‌ ఉందని, దీంతో స్టాక్‌ మార్కెట్లో ఐఆర్‌సీటీసీ షేర్‌ కనీసం రూ.200 లాభంతో... అంటే రూ. 500పైననే లిస్ట్‌ కావచ్చని విశ్లేషకులు అం‍చనా వేస్తున్నారు.
ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా యెస్‌ సెక్యూరిటీస్‌(ఇండియా), ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరించాయి. రైల్వేలకు కేటరింగ్‌ సేవలందిస్తున్న ఏకైక ఆధీకృత కంపెనీ ఐఆర్‌సీటీసీయే. ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే టికెట్లను విక్రయిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో రైల్‌ నీర్‌ పేరుతో తాగు నీటి బాటిళ్లను విక్రయిస్తోంది. 2008లో ఈ కంపెనీకి మినీ రత్న హోదా లభించింది. You may be interested

బ్యాంక్స్‌ చీఫ్‌లతో నేడు ఆర్థిక మంత్రి భేటీ

Monday 14th October 2019

రుణ వితరణ తదితర అంశాలపై చర్చ న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) సమావేశం కానున్నారు. చిన్న, మధ్య తరహా సంస్థలు, ఆర్థిక సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) మొదలైన రంగాలకు నిధుల లభ్యత, రుణ వితరణ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు సంబంధిత

38,400పైన ముగిస్తేనే ర్యాలీ ...

Monday 14th October 2019

ఒకవైపు దేశీయంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, మరోవైపు అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఆశలతో భారత్‌ స్టాక్‌సూచీలు గతవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అలాగే ఈ సీజన్‌లో తొలుతగా వెలువడిన ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, టీసీఎస్‌ల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చడం కూడా సూచీల్ని ఊగిసలాటకు లోనుచేశాయి. క్యూ2 ఫలితాల పట్ల మార్కెట్‌కు పెద్దగా అంచనాలు లేనప్పటికీ, కార్పొరేట్లు ఇన్వెస్టర్లకు షాక్‌కు గురిచేస్తే మాత్రం...పన్ను కోతతో పెరిగిన

Most from this category