News


హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ స్టాక్‌ సిఫార్సులు

Tuesday 4th June 2019
Markets_main1559631936.png-26088

వచ్చే నెల రోజుల సమయంలో దాదాపు 10 శాతం వరకు రాబడిని అందించే మూడు స్టాకులను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది.
1. గోద్రేజ్‌ కన్జూమర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 680. కొద్దికాలం క్రితం రూ.630 వద్ద బహుళస్థాయి మద్దతు పొందిన అనంతరం మార్చిలో అప్‌మూవ్‌ చూపింది. ప్రస్తుతం డైలీ చార్టుల్లో హైవాల్యూంలతో కూడిన బ్రేకవుట్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఎంసీజీ రంగం సైతం బాటమవుట్‌ చెంది ర్యాలీకి రెడీ అవుతోంది. ప్రస్తుతం షేరు ధర స్వల్పకాలిక డీఎంఏలపై కదలాడుతూ బుల్లిష్‌గా కనిపిస్తోంది. 
2. పీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 140. స్టాప్‌లాస్‌ రూ. 120. డైలీ చార్టుల్లో నిరోధ రేఖకు పైన క్లోజయి బ్రేకవుట్‌ ఇచ్చింది. హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తూ మరింత ర్యాలీకి సంకేతాలు ఇస్తోంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీ ఇండికేటర్లు బుల్లిష్‌క్రాసోవర్లు ఏర్పరిచాయి. 
3. జేకే లక్ష్మి సిమెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 425. స్టాప్‌లాస్‌ రూ. 365. ఇటీవలి బ్రేకవుట్‌ అనంతరం కన్సాలిడేషన్‌ చెందింది. స్టాకులో ప్రాథమిక ట్రెండ్‌ మాత్రం ఇంకా బుల్లిష్‌గానే ఉంది. సిమెంట్‌ రంగంలో రికవరీ కంపెనీకి కలిసిరానుంది. చార్టుల్లో ఇండికేటర్లు పాజిటివ్‌ సంకేతాలు ఇస్తున్నాయి. 



You may be interested

ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Tuesday 4th June 2019

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లకు ఫిచ్‌ రేటింగ్‌ షాక్‌ నిచ్చింది. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకుల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. ఈ రెండు బ్యాంకులకు చెందిన ధీర్ఘకాలిక ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్‌(ఐడీఆర్‌)ను బిబిబి(-) నుంచి బిబి(+)కి, అలాగే వైయబిలిటీ రేటింగ్‌ బిబిబి(-) నుంచి బిబి(+) తగ్గిస్తున్నట్లు తెలిపింది. పిచ్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే

లాభాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Tuesday 4th June 2019

నష్టాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2 శాతానికి పైగా పెరిగింది. మందగించిన దేశీయ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ ఈ సమీక్షా సమావేశాల్లో కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు మొగ్గుచూపుందనే అంచనాలు ఊపందుకున్నాయి. అలాగే మొండిబకాయిలతో సతమతవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదుకునేందుకు కేంద్రం రూ.40వేల కోట్ల మూలధన సహాయాన్ని సమకూర్చే యోచనలో

Most from this category