News


టైటాన్‌ 9.50శాతం డౌన్‌

Wednesday 6th November 2019
Markets_main1573015956.png-29391

టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ షేరు బుధవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 9.50శాతం పతనమైంది. రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో పాటు వచ్చే రెండు తైమాసికంలో ఆభరణాల అమ్మకాల వృద్ధి గైడెన్స్‌ను తగ్గించడం ఇందుకు కారణమైంది.  నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్యూ‍2లో కంపెనీ నికరలాభం 4 వృద్ధి చెంది రూ.301 కోట్లు నికర లాభాన్ని ఆర్జించింది. అయితే విశ్లేషకులు మాత్రం ఇదే క్యూ2లో రూ.378 కోట్ల నికరలాభాన్ని సాధించవచ్చని అంచనా వేశారు. సమీక్షిస్తున్న త్రైమాసికంలో మొత్తం ఆదాయం మొత్తం ఆదాయం రూ.4,595 కోట్ల నుంచి రూ.4,693 కోట్లకు పెరిగింది. నిర్వహణ ఆదాయం రూ. 4,435 కోట్లను సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,407 కోట్లను ఆర్జించింది. కంపెనీ ఆభరణ అమ్మకాల వృద్ధి గైడెన్స్‌ను వచ్చే రెండో త్రైమాసికాలకు 11-13 శాతానికి తగ్గించడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బ్రోకరేజ్‌ సంస్థ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ క్రిడెట్‌ శాష్యూ రేటింగ్‌ను న్యూట్రల్‌ రేటింగ్‌ను కొనసాగించినప్పటికీ టార్గెట్‌ ధర రూ.1,110లకు తగ్గించింది. సీఎల్‌ఎస్‌ఈ షేరుకు ‘‘సెల్‌’’ రేటింగ్‌ను, టార్గెట్‌ ధర రూ.1,025లకు తగ్గించింది. ఈ ప్రతికూలాంశాలతో నేడు బీఎస్‌ఈలో ఈ షేరు క్రితం ముగింపు ధర(రూ.1283.85)తో పోలిస్తే 9.64శాతం నష్టంతో రూ.1160.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఉదయం 10:00లకు షేరు 7.50శాతం నష్టంతో రూ.1186.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.766.65, రూ.1389.85లుగా నమోదయ్యాయి. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో ద్రవ్య కొరత లాంటి సమస్యలున్నప్పటికీ.., షేరు 73.7శాతం ర్యాలీ చేసింది. 

 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు

Wednesday 6th November 2019

ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన నేప్యథంలో కొన్ని ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నిన్న ఫలితాలను వెల్లడించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఫలితాలు అంచనాలకు అందుకోకపోవడం, ఏడురోజుల మార్కెట్‌ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణలో భాగంగా ప్రభుత్వరంగ షేర్లలో అమ్మకాలు సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో  ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ

సమీపకాలానికి టాప్‌ స్టాక్‌ సిఫార్సులు: రెలిగేర్‌ బ్రోకింగ్‌

Wednesday 6th November 2019

నిఫ్టీ ఈ వారం 11,700-12,000 పరిధిలో కదలనుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా  ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వారంలో 5-14 శాతం రాబడులను ఇవ్వగలిగే టాప్‌ మూడు స్టాకులను సిఫార్సు చేశారు. మిగిలిన ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లో...   నిఫ్టీ, గత సెషన్లో పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికి, చివరికి ప్రతికూలంగా ముగిసింది. ఇది నిఫ్టీ గరిష్ఠ స్థాయిల వద్ద కన్సాలిడేషన్‌ అవుతుందనే

Most from this category