News


టైటాన్‌ 3 శాతం డౌన్‌

Wednesday 7th August 2019
Markets_main1565156605.png-27600

క్యూ1 ఫలితాలను టైటాన్‌ కంపెనీ మంగళవారం ప్రకటించిన తర్వాత పలు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు, ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను తగ్గించాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో టైటాన్‌ కంపెనీ లి. షేరు విలువ ఉదయం 11.04 సమయానికి 3.55 శాతం నష్టపోయి రూ. 1,009.50 వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్లో ఈ కంపెనీ షేరు 0.5 శాతం లాభపడి రూ. 1,042.00 వద్ద ముగిసింది. 
టైటాన్‌ క్యూ 1 ఫలితాలు: టైటాన్ కంపెనీ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ .370.7 కోట్ల స్టాండ్‌ఎలోన్‌ లాభాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ప్రకటించిన స్టాండ్‌ ఎలోన్‌ లాభం రూ. 349.2 కోట్ల కంటే 6.2 శాతం అధికం కావడం గమనర్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .4,319 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం, ఈ జూన్‌ త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రూ .4,939.7 కోట్లకు చేరుకుంది. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనంకు ముందు ఆదాయం (ఇబిఐటిడిఎ) 14.1 శాతం పెరిగి రూ. 565.3 కోట్లకు చేరుకోగా, మార్జిన్ మాత్రం ఫ్లాట్ 11.4 శాతంగానే ఉంది. 
  కంపెనీ ఇతర ఆదాయం రూ .56 కోట్లుగా నమోదుకాగా, ఆర్థిక ఖర్చులు రూ.68.1 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో ఆభరణాల విభాగంలో ఈ కంపెనీ 13.3 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. గడియారాల వ్యాపారంలో ఆదాయం, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .594 కోట్లు ఉండగా, ఈ త్రైమాసికం నాటికి 20.04 శాతం పెరిగి రూ .715 కోట్లకు చేరుకుంది. కళ్లజోడు వ్యాపారం 13.1 శాతం పెరిగి రూ.149 కోట్లకు చేరుకోగా, ఉపకరణాలు, సుగంధ ద్రవ్యాలు, చీరలతో కూడిన ఇతర వ్యాపారాలు 37.9 శాతం పెరిగి రూ.36 కోట్లకు చేరుకున్నాయి. తక్కువ వినియోగంతో పాటు స్థూల-ఆర్థిక వాతావరణం, మా వ్యాపారాలలో కొన్నింటిని ప్రభావితం చేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ తెలిపారు.



You may be interested

యస్‌ బ్యాంక్‌ 7 శాతం అప్‌

Wednesday 7th August 2019

7.50శాతం ర్యాలీచేసిన షేర్లు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంకు షేర్లు బుధవారం 7శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.86.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో ప్రారంభం కానున్న యస్‌ బ్యాంక్‌ క్యూఐపీ ఇష్యూలో ప్రైవేట్‌రంగ ఈక్విటీ సంస్థలైన జీఐటీ, వెస్ట్‌బ్రిడ్జ్‌ సంస్థలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సంస్థలు పాల్గొనవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో ఈ యస్‌ బ్యాంకు షేర్లకు కొనుగోళ్ల డిమాండ్‌

రుణ రేటును తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Wednesday 7th August 2019

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. అన్ని కాలపరిమితుల రుణ రేట్లు 0.10 శాతం తగ్గాయి.  తాజా నిర్ణయం బుధవారం నుంచీ అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభమైన రెండవరోజు హెచ్‌డీఎఫ్‌సీ తాజా ప్రకటన చేయడం గమనార్హం. బ్యాంకులకు తానిచ్చే

Most from this category