News


టైటాన్‌ 12 శాతం క్రాష్‌

Tuesday 9th July 2019
Markets_main1562650060.png-26912

బంగారం ధరలు పెరగడంతో ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో డిమాండ్‌ తగ్గిందని టైటన్‌ ప్రకటించడంతో కంపెనీ షేరు విలువ మంగళవారం ట్రేడింగ్‌లో 12 శాతం నష్టపోయింది. స్థూల ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు బంగారం ధరలు పెరగడంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వినియోగంపై ప్రభావం చూపాయని సంస్థ  సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో పేర్కొంది.  దీంతో ఈ షేరు వరుసగా నాలుగోవ సెషన్‌లో కూడా నష్టపోయి ట్రేడవుతోంది. ‘ సంస్థ మార్కెట్‌ వాటా నిలకడగా ఉన్నప్పటికి నగల విభాగంలో నిర్ధేశించుకున్న లక్ష్యం కన్నా తక్కువ వృద్ధి నమోదు అయ్యింది’ అని ఎక్సెంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. బంగారం ధరలు పెరగడంతో డిమాండ్‌ తగ్గిందని ఫలితంగా కంపెనీ నగల విభాగం(తనిష్క్‌)లో ఆదాయ వృద్ధి మందగించిందని తెలిపింది. టీసీఎస్‌ ఆర్డర్ల కారణాన టైటాన్‌ వాచ్‌ విభాగంలోని టైటాన్‌, సొనాటా బ్రాండ్ల ద్వారా 19 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. ఐ వియర్‌ విభాగంలో 13 శాతం వృద్ధి నమోదు చేసింది. తాజాగా మోర్గాన్‌ స్టాన్లీ టైటాన్‌ కంపెనీ టార్గెట్‌ ధరను రూ.13,00గా నిర్ణయించి కంపెనీ రేటింగ్‌ను ‘ఓవర్‌ వెయిట్‌’ నుంచి ‘అండర్‌ వెయిట్‌’కు మార్చిన విషయం తెలిసిందే. టైటాన్‌ షేరు విలువ ఉదయం 10.53 సమయానికి 12.78 శాతం నష్టపోయి రూ. 1,092.60 వద్ద ట్రేడవుతోంది. 
 You may be interested

1400 డాలర్ల దిగువకు పసిడి

Tuesday 9th July 2019

డాలర్‌ బలపడటంతో పాటు ట్రేడర్ల అప్రమత్తతతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1400 డాలర్ల దిగువకు చేరుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల నష్టంతో 1,398.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమి పావెల్‌తో పాటు 10 మంది యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకుర్లు  అమెరికా కాంగ్రెస్‌ ఎదుట చేసే ప్రసంగంపై ట్రేడర్లు దృష్టిని సారించారు. ముఖ్యంగా వడ్డీరేట్ల కోతపై వారు ఎలాంటి సంకేతాలు ఇస్తారోనని

లాభాల్లో ఫార్మా షేర్లు

Tuesday 9th July 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషద పరిశ్రమ 11-13 శాతం వృద్ధి చెందగలదని సోమవారం ఇక్రా వెల్లడించిన నేపథ్యంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ మంగళవారం (జులై 9) లాభాల్లో ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌ 7,810.15 వద్ద ప్రారంభమవ్వగా 84.65 పాయింట్లు లేదా 1.09 శాతం లాభంతో 7,886.40 ట్రేడవుతోంది. సన్‌ ఫార్మా 2.10 శాతం, గ్లెన్‌ మార్క్‌ 1.90 శాతం, సిప్లా 1.45 శాతం, పెల్‌ 1.25 శాతం, కాడిల్హక్‌

Most from this category