News


బీఎస్‌ఈ సెన్సెక్స్‌లోకి నెస్లే, టైటాన్‌, అల్ట్రాటెక్‌

Saturday 23rd November 2019
Markets_main1574478773.png-29795

  • యూపీఎల్‌, డాబర్‌ ఇండియాకు కూడా చోటు
  • టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, వేదాంత, యస్‌ బ్యాంకు తొలగింపు
  • డిసెంబర్‌ 23 నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ: ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీలోకి కొత్తగా నెస్లే, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ అడుగు పెట్టనున్నాయి. ప్రస్తుతం సూచీలో ఉన్న వేదాంత, యస్‌ బ్యాంకు, టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ బయటకు వెళ్లిపోనున్నాయి. డిసెంబర్‌ 23 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రకటించింది. ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌, బీఎస్‌ఈ జాయింట్‌ వెంచర్‌లో ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ నిర్వహణ కొనసాగుతోంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంకును తొలగించి, వీటి స్థానాల్లో యూపీఎల్‌, డాబర్‌ ఇండియాను ప్రధాన సూచీలోకి చేర్చబోతున్నట్టు బీఎస్‌ఈ ప్రకటించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నెక్స్ట్‌ 50 సూచీలోకి ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌బ్యాంకు, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా)కు స్థానం కల్పించింది. అదే సమయంలో క్యాడిలా హెల్త్‌కేర్‌, డాబర్‌ ఇండియా, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, యూపీఎల్‌, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను సెన్సెక్స్‌ నెక్ట్స్‌ 50 నుంచి తొలగింపునకు గురవుతాయి. ప్రధాన సూచీలతో పాటు బీఎస్‌ఈ 500, బీఎస్‌ఈ 200, బీఎస్‌ఈ 100లోనూ స్టాక్‌ ఎక్సేంజ్‌ మార్పులు చేసింది. బీఎస్‌ఈ 200 సూచీలోకి సింజీన్‌ ఇంటర్నేషనల్‌, థర్మాక్స్‌, గుజరాత్‌ గ్యా్స్‌ను చేర్చనున్నట్టు, బదులుగా గ్రాఫైట్‌ ఇండియా, హెచ్‌ఈజీ, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ను తొలగించనున్నట్టు బీఎస్‌ఈ తెలిపింది. 



You may be interested

ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్‌

Saturday 23rd November 2019

న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్‌)కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎయిర్‌టెల్‌ శుక్రవారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏజీఆర్‌ మొత్తంపై వడ్డీ, జరిమానాను రద్దు చేయాలని ఈ పిటిషన్‌లో కోరింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్‌ లెక్కల ప్రకారం ఎయిర్‌టెల్‌  రూ. 21,682 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడింది. స్పెక్ట్రం యూసేజీ చార్జీగా చెల్లించాల్సింది రూ.13,904 కోట్లు. కాగా వొడాఫోన్‌ ఐడియా కూడా సుప్రీంలో

స్టాక్స్‌ వ్యాల్యూషన్లపైనే దృష్టి పెట్టండి: ప్రశాంత్‌ జైన్‌

Saturday 23rd November 2019

దేశ జీడీపీ తాత్కాలికంగా క్షీణించిందని స్టాక్‌మార్కెట్‌ పట్ల ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉండడం సరికాదని ప్రముఖ ఫండ్‌ మేనేజర్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ అయిన ప్రశాంత్‌ జైన్‌ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో జైన్‌ మాట్లాడుతూ విలువైన విషయాలను ఇన్వెస్టర్లకు తెలియజేశారు.    ‘జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 5 శాతానికి పడిపోవచ్చు. అయితే, అది అక్కడే ఉండిపోదన్న’ విషయాన్ని ప్రశాంత్‌ జైన్‌

Most from this category