News


2.50శాతం ర్యాలీ చేసిన టైటాన్‌ షేర్లు

Wednesday 19th June 2019
Markets_main1560934592.png-26417

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ రేటింగ్‌ పెంచడంతో టైటాన్‌ కంపెనీ షేర్లు బుధవారం 2.50శాతం ర్యాలీ చేశాయి. నేడు టైటాన్‌ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.1280ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒకదశలో 1288 రూపాయలకు చేరాయి. ‘‘టైటాన్‌ కంపెనీ వ్యూహాత్మక ప్రణాళికలు, మేనేజ్‌మెంట్‌ పారదర్శకమై పనితీరుతో మేము సంతృప్తికరంగా ఉన్నాము. షేరు ప్రస్తుత స్థాయిల నుంచి 28శాతం అప్‌ట్రెండ్‌కు కొనసాగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో గతంలో  షేరకు కేటాయించిన అవుట్‌ ఫెర్ఫామింగ్‌ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1,250ల వద్ద నుంచి రూ.1,600లకు పెంచుతున్నాము’’ అని యూబీఎస్‌ ఒక నివేదికలో తెలిపింది. అలాగే షేరు అప్‌సైడ్‌ ఫెయిర్‌ వ్యాల్యూ రూ.1800లుగా, డౌన్‌సైట్‌ ఫెయిర్‌ వాల్యూ రూ.900లుగా ఉంటుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. బ్రోకరేజ్‌ సంస్థ టార్గెట్‌ ధరను పెంచడంతో ఈ షేరు ఇంట్రాడేలో 2.50శాతం పెరిగి రూ.1288 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:20నిల.కు షేరు గత ముగింపు ధర(రూ.1258.1)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.1270.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.731.70  రూ.1299.00లుగా నమోదయ్యాయి. గత 9నెలల్లో షేరు 55శాతం ర్యాలీ చేసింది. 



You may be interested

మార్కెట్‌ నుంచి బయటపడండి.. ఇదే సరైన సమయం!

Wednesday 19th June 2019

ఎస్‌బీఐ లైఫ్‌ సీఐఓ గోపీకృష్ణ షెనాయ్‌ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ జరిపి బయటపడడం మంచిదని ఎస్‌బీఐ లైఫ్‌ సీఐఓ గోపీకృష్ణ షెనాయ్‌ సూచిస్తున్నారు. వాల్యూషన్లు బాగా వ్యాకోచించాయని, ఈ నేపథ్యంలో ఈక్విటీల నుంచి బయటకు రావడం ఉత్తమమని ఆయన చెప్పారు. గతేడాది దేశీయ సూచీలు పదిశాతం ర్యాలీ జరిపాయి. ఈ ఏడాది కూడా జోరు చూపుతున్నాయి. అయితే ఎర్నింగ్స్‌ గ్రోత్‌ బాగుంటుందని చెప్పే సరైన తక్షణ సూచికలేమీ లేవని,

ఇండిగో షేర్లకు రేటింగ్‌ బూస్టింగ్‌

Wednesday 19th June 2019

దేశీయ విమానయాన రంగ సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌ ఆరంభంలో లాభాల్లోకి మరలాయి. ప్రముఖ బ్రోకరింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ షేరు టార్గెట్‌ ధరను పెంచడటం ఇందుకు కారణమైంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో 1673 రూపాయల వద్ద ఆరంభమై ఒకదశలో 1683 రూపాయలకు చేరింది. ఇటీవల కంపెనీ కొత్తగా కొనుగోలు చేస్తున్న 280 విమానాలకు సంబంధించి లీప్‌-1ఏ ఇంజన్ల తయారీకి కంపెనీ సీఎఫ్‌ఎం ఇంటర్నేషన్‌ సంస్థకు

Most from this category