News


టైటాన్‌ లాభం..రూ. 370.7 కోట్లు

Tuesday 6th August 2019
Markets_main1565086176.png-27580

టైటాన్ కంపెనీ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ .370.7 కోట్ల స్టాండ్‌ఎలోన్‌ లాభాన్ని సాధించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ప్రకటించిన స్టాండ్‌ ఎలోన్‌ లాభం రూ. 349.2 కోట్ల కంటే 6.2 శాతం అధికం కావడం గమనర్హం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .4,319 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం, ఈ జూన్‌ త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రూ .4,939.7 కోట్లకు చేరుకుంది. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనంకు ముందు ఆదాయం (ఇబిఐటిడిఎ) 14.1 శాతం పెరిగి రూ. 565.3 కోట్లకు చేరుకోగా, మార్జిన్ మాత్రం ఫ్లాట్ 11.4 శాతంగానే ఉంది. 
  కంపెనీ ఇతర ఆదాయం రూ .56 కోట్లుగా నమోదుకాగా, ఆర్థిక ఖర్చులు రూ.68.1 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో ఆభరణాల విభాగంలో ఈ కంపెనీ 13.3 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. గడియారాల వ్యాపారంలో ఆదాయం, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ .594 కోట్లు ఉండగా, ఈ త్రైమాసికం నాటికి 20.04 శాతం పెరిగి రూ .715 కోట్లకు చేరుకుంది. కళ్లజోడు వ్యాపారం 13.1 శాతం పెరిగి రూ.149 కోట్లకు చేరుకోగా, ఉపకరణాలు, సుగంధ ద్రవ్యాలు, చీరలతో కూడిన ఇతర వ్యాపారాలు 37.9 శాతం పెరిగి రూ.36 కోట్లకు చేరుకున్నాయి. తక్కువ వినియోగంతో పాటు స్థూల-ఆర్థిక వాతావరణం, తమ వ్యాపారాలలో కొన్నింటిని ప్రభావితం చేసిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ తెలిపారు. టైటాన్‌ షేరు విలువ మంగళవారం ట్రేడింగ్‌లో 0.50 శాతం పెరిగి రూ. 1,042.00 వద్ద ముగిసింది.



You may be interested

సూచీలకు దన్నుగా హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం

Tuesday 6th August 2019

హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ మంగళవారం సూచీలకు కలిసొచ్చింది. ఇరు కంపెనీలు క్యూ1లో మెరుగైన ఫలితాలను సాధించడంతో పాటు, నిన్నటి ట్రేడింగ్‌లో  అమ్మకాల ఒత్తిడికి లోనైన నేపథ్యంలో ట్రేడర్లు నేడు ఈ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ పూనుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ 1.50శాతం, హెచ్‌డీఎఫ్‌ఎసీ బ్యాంక్‌ దాదాపు అరశాతం ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ ఆర్జించిన మొత్తం 85 పాయింట్లలో ఒక హెచ్‌డీఎఫ్‌సీ వాటా 14.51 పాయింట్లు కాగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటా

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 36 శాతం జంప్‌

Tuesday 6th August 2019

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లి.(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) రుణ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తయారుచేసిన రిజల్యూషన్‌ ప్లాన్‌ డ్రాప్ట్‌ను ఆమోదించింది. ఈ డ్రాఫ్ట్‌ ప్రణాళికను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఈ ప్రత్యేక కమిటీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఫైనాన్సియల్‌ సలహాదారు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సహకారంతో తయారు చేసింది. ఫలితంగా ఈ కంపెనీ షేరు విలువ మంగళవారం మధ్యాహ్నం 3.06 సమయానికి  36.71 శాతం లాభపడి, రూ. 57.35 వద్ద ట్రేడవుతోంది. గత

Most from this category