News


సైక్లికల్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌పై ఫోకస్‌..

Friday 6th December 2019
Markets_main1575655621.png-30098

ఇన్వెస్టర్లు అధిక వ్యాల్యూషన్‌ కలిగిన (నాణ్యమైన కంపెనీలు) కంపెనీల నుంచి సైక్లికల్‌, నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌వైపు దృష్టి సారించాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోదన్‌ నాయర్‌ సూచించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

 

ఆర్‌బీఐ పరపతి విధానం..
రేట్లను మార్చకూడదని ఎంతో ఆలోచించి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఐదు పర్యాయాలు తగ్గించిన రేట్ల బదిలీ ప్రయోజనం రుణ గ్రహీతలకు పూర్తి స్థాయిలో అమలు జరగాలని, ద్రవ్యోల్బణంపై మరింత స్పష్టత కోసం వేచి చూడాలన్నది కేంద్ర బ్యాంకు విధానంగా ఉంది. స్థూల ఆర్థిక అంశాల ఆధారంగా రానున్న పాలసీ భేటీల్లో మరిన్ని రేట్ల కోత ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఆర్‌బీఐ విధానం మార్కెట్ల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేస్తుందని భావించడం లేదు. కాకపోతే రేట్ల పరంగా సున్నిత స్టాక్స్‌లో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.

 

గరిష్ట మార్కెట్లలో పెట్టుబడి విధానం..
ప్రతీ సైకిల్‌ కూడా భిన్నంగా ఉంటుంది. కనుక ఒకటే ప్రామాణిక విధానాన్ని సూచించలేం. మా సూచన ఏమిటంటే.. అధిక వ్యాల్యూషన్‌కు చేరిన స్టాక్స్‌ నుంచి పెట్టుబడులను నాణ్యమైన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, సైక్లికల్‌ స్టాక్స్‌లోకి మళ్లించుకోవాలి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఆర్థిక సంస్థల ప్రాతినిధ్యం గత రెండు త్రైమాసికాల్లో పెరిగింది. ఇది ఎంతో సానుకూలత. ఆర్థిక వ్యవస్థ, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఇనుమడిస్తే.. వచ్చే రెండు మూడేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌, స్మాల్‌క్యాప్‌ మంచి పనితీరు చూపిస్తాయి. దేశీయంగా వడ్డీ రేట్లు, పన్ను రేట్లు దిగొస్తున్నాయి. ప్రోత్సాహకాలు పెరుగుతున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడులకు ఇది మంచి తరుణం. ఏజీఆర్‌ బకాయిలపై మారటోరియం, టారిఫ్‌ల పెంపుతో టెలికం రంగంలో సాధ్యాసాధ్యాల పరిస్థితి మెరుగుపడింది. ఈ రంగంలో ఆర్‌ఐఎల్‌ పట్ల సానుకూలంగా ఉన్నాం. ఎందుకంటే జియో బలమైన పనితీరు చూపించనుంది. ఆటోమొబైల్‌ అమ్మకాల గణాంకాలు నవంబర్‌లో దాదాపు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. తక్కువ బేస్‌ కారణంగా వచ్చే జనవరి నుంచి రికవరీని అంచనా వేస్తున్నాం. You may be interested

భారతీ ఎయిర్‌టెల్‌ పట్ల సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Friday 6th December 2019

టెలికం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ పట్ల అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సానుకూలంగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ ఏజీఆర్‌ బకాయిలు చెల్లింపుల కోసం గాను 3 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2 బిలియన్‌ డాలర్లను క్యూఐపీ రూపంలో, మరో బిలియన్‌ డాలర్లు డెట్‌ రూపంలో సమీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో రిస్క్‌-రాబడుల దృష్ట్యా ఎయిర్‌టెల్‌ సానుకూలంగా ఉందని సీఎల్‌ఎస్‌ఏ

మార్కెట్‌ను వెంటాడిన వృద్ధి భయాలు

Friday 6th December 2019

ఆర్థిక వృద్ధి ఆందోళనలతో లాభాల స్వీకరణ 12వేల దిగువున ముగిసిన నిఫ్టీ  334 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ ఆర్థిక వృద్ధి ఆందోళనతో ఇన్వెస్టర్లు​లాభాల స్వీకరణకు పూనుకోవడంతో శుక్రవారం సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 334 పాయింట్లు నష్టపోయి 40,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పతనమైన 12వేల దిగువన 11,914 వద్ద ముగిసింది. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగి ఆర్థిక రంగ షేర్లైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 5శాతం పతనం

Most from this category