News


మిడ్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులకు ఇది సమయమేనా...?

Monday 11th November 2019
Markets_main1573462589.png-29505

గత రెండేళ్లలో ఇన్వెస్టర్లకు అంతంత మాత్రంగా ఆదాయాల్ని సమకూర్చిన మిడ్‌క్యాప్‌ ఫండ్లల్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులు సిఫార్సు చేస్తున్నారు. 2018 జనవరి నాటి నుంచి షేరు ధరల్లో భారీ పతనాన్ని చవిచూసిన తరుణంలో వ్యాల్యుయేషన్స్‌ ‍కనిష్టస్థాయిని తాకాయి. అయితే మందగమనం కారణంగా మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నందున మూడేళ్ల కాల పరిమితితో మిడ్‌క్యాప్‌ పథకం యూనిట్లను కొనుగోలు చేయవచ్చని అనలిస్టులు సలహానిస్తున్నారు. ఫ్రాంక్టిన్‌ ఇండియా ప్రిమ ఫండ్‌, కోటక్‌ ఎమర్జీ ఈక్విటీ ఫండ్‌, సుందరం మిడ్‌క్యాప్‌ ఫండ్‌, ఇన్వెస్కో మిడ్‌క్యాప్‌ ఫండ్ల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాయి. 

రిస్క్‌ రివార్డును భరించగలిగే ఇన్వెస్టర్లకు మూడేళ్ల కాల పరిమితితో మిడ్‌క్యాప్స్‌లో పెట్టుబడి ఇది సరియైన సమయం. అనేక మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ గణనీయంగా దిద్దుబాటుకు లోనయ్యాయి. ఇప్పుడు కొనుగోలుకు సరియైన ధర వద్ద ట్రేడ్‌ అవుతున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్త్‌ మేనేజెంట్‌ హెడ్‌ అశిష్‌ శంకర్‌ అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్‌ సూచీ కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన ఈ సమయంలోనూ, మిడ్‌ క్యాప్‌ సూచీల్లో ఎలాంటి ర్యాలీ కనబడటం లేదు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌-150 ఇండెక్స్‌ జనవరి 2018లో 7469 జీవితకాల గరిష్టాన్ని తాకిన అనంతరం 18శాతం వరకు కరెక్షన్‌ను లోనైంది. చాలా స్టాకులు 30నుంచి 50శాతం వరకు నష్టపోయాయని ఆయన తెలిపారు. 

భారీ దిద్దుబాటు అనంతరం మిడ్‌క్యాప్‌ వాల్యూయేషన్లు ఇప్పుడు కొనుగోళ్లకు మద్దతినిస్తున్నాయి. అవి 2014కి ముందు ధర స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయని యాక్సిస్‌ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెచ్‌ కశ్యప్‌ పుజారా అభిప్రాయపడ్డారు. వీటి ప్రైస్‌ టు బుక్‌ వ్యాల్యూ రేషియో 10ఏళ్ల కనిష్టం అంటే 20శాతం డిస్కౌంట్‌లో ఉన్నాయని పుజారా తెలిపారు. మార్చి 2015 మరియు ఆగస్టు 2018 మధ్య, ఎన్‌ఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ నిఫ్టీ యొక్క హై-బీటా వేరియంట్‌గా 80 శాతం అధిక రాబడిని నమోదు చేసిందని పూజారా అభిప్రాయపడ్డారు. ఆయా కంపెనీల ఆదాయాల పెరుగుదల లేకపోవడంతో చాలా మిడ్ క్యాప్ షేర్లు చాలా ఖరీదైనవిగా మారాయి. దీని ఫలితంగా 2018 ఆరంభం నుండి మిడ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి.

ఫండ్ నిర్వాహకులు సైక్లిల్స్‌ చూసిన సుదీర్ఘ ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్న మిడ్‌క్యాప్‌ ఫండ్లలను ఎంపిక చేసుకోవాలని మోతీలాల్‌ ఓస్వాల్‌ విశ్లేషకుడు శంకర్‌ సూచిస్తున్నారు. అయితే స్వల్పకాలికానికి మిడ్‌క్యాప్‌ షేర్లలో అనిశ్చతి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రిమా ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, సుందరం మిడ్‌క్యాప్ ఫండ్లు శంకర్‌ టాప్‌పిక్‌లో ఉన్నాయి. 

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ కంపెనీల ఆదాయ వృద్ధి 2016లో 13శాతం, 2017లో 5శాతం, 2018లో 14శాతం క్షీణించాయి. అయితే 2019లో ఇప్పటికి వరకు 1.9శాతం పెరిగింది. రాబోయే రెండేళ్లలో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఆదాయ వృద్ధి బలంగా ఉంటుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఆశిస్తోంది. 2020 లో ఇది 113.9 శాతం, 2021 లో 20.1 శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లోయర్‌ సంస్థాగత యాజమాన్యం మిడ్‌క్యాప్‌లకు అనుకూలంగా వ్యవహరించగలదని విశ్లేషకులు తెలిపారు. 

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో 34శాతం స్టాకులు 10 మంది విశ్లేషకులకు తగ్గకుండా ట్రాక్‌ చేయబడుతున్నాయి. తక్కువ ద్రవ్యత మిడ్‌క్యాప్ స్టాక్‌లను అస్థిరంగా చేస్తుంది. కరెక్షన్‌ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. దిద్దుబాటు జరిగిన ప్రతిసారి ఇన్వెస్టర్లు 6నెలల నుంచి గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితితో మిడ్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చుని మనీ హని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ మేనిజింగ్‌ డైరెక్టర్‌ అనూప్‌ అభిప్రాయపడ్డారు. You may be interested

పసిడి మెరుపులు తగ్గుతాయా??

Monday 11th November 2019

ట్రేడ్‌వార్‌ ముగింపుతో బంగారం ధర తగ్గే ఛాన్సులు స్వల్పకాలికమేనని నిపుణుల అంచనా గతవారం యూఎస్‌, చైనా వాణిజ్య చర్చలపై పాజిటివ్‌ వార్తలు వచ్చిన నేపథ్యంలో దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధర కాస్త వెనకడుగువేసింది. దేశీయ ఎంసీఎక్స్‌ బంగారం గతవారాన్ని 1.6 శాతం నష్టంతో ముగించింది. రెండు పెద్ద దేశాల మధ్య చర్చలు ఫలప్రదమయ్యే అవకాశాలు కనిపించడంతో స్టాక్‌ మార్కెట్లు కదం తొక్కాయి. వాణిజ్యయుద్ధం శాంతియుతంగా ముగిస్తే ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను పునఃసమీక్షిస్తామని

రెండేళ్లలో లార్జ్‌క్యాప్స్‌ను మించి మిడ్‌క్యాప్స్‌ లాభాలు!

Monday 11th November 2019

 ‘మిడ్‌క్యాప్స్‌ సెక్టార్‌ యూ ఆకారపు రికవరికి సిద్ధంగా ఉందని అంచనావేస్తున్నాం. జీడీపీ వృద్ధి చెందితే ఈ స్టాకులు కూడా మంచి ప్రధర్శన  చేయడం గమనించవచ్చు. ముందుకెళ్లే కొద్ది జీడీపీ రికవరి అవుతుందనే అంచనాలున్నాయి. ఈ రికవరి విస్తృతంగా ఉంటే, ఇంకో రెండుమూడేళ్లలో మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌ క్యాప్‌లను మించి ప్రదర్శన చేస్తాయి’ అని యాక్సిస్‌ క్యాపిటల్‌, రీసెర్చ్‌ హెడ్‌, కశ్యప్‌ పుజారా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు

Most from this category