STOCKS

News


షార్ట్‌టర్మ్‌కు రెలిగేర్‌ రికమండేషన్లు

Tuesday 24th December 2019
Markets_main1577165335.png-30405

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే మూడు షేర్లను రెలిగేర్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది.
1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 780. స్టాప్‌లాస్‌ రూ. 725. రెండు నెలలుగా రూ. 710-755 రేంజ్‌లో ట్రేడవుతోంది. ఇటీవల ఈ రేంజ్‌ పైఅవధిని తాకి తిరిగి వెనక్కువచ్చింది. ప్రస్తుతం తాజా కొనుగోళ్లకు అనుకూతంగా ఉంది. రూ. 740- 745 రేంజ్‌లో స్వల్పకాలానికి కొనుగోలు చేయవచ్చు.
2. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 310. స్టాప్‌లాస్‌ రూ. 285. భారీ ఒడిదుడుకుల అనంతరం షేరు రీబౌండ్‌ అయ్యే సంకేతాలు ఇస్తోంది. ఈ వారం ఆరంభంలో బ్రేకవుట్‌ సాధించింది. వాల్యూంలో పెరుగుదల అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉంది.
3. టాటా కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 695. స్టాప్‌లాస్‌ రూ. 650. నాలుగు నెలలుగా పాజిటివ్‌ ధృక్పథంతో కొనసాగుతోంది. 200 డీఎంఏ వద్ద మద్దతు పొందుతూవస్తోంది. తాజాగా కీలక డీఎంఏలకు పైన కదలాడుతూ మరో అప్‌ట్రెండ్‌కు సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇస్తోంది. 



You may be interested

4రోజూ లాభాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Tuesday 24th December 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వరుసగా 4రోజూ లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.295.00వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ కంపెనీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 3శాతం పెరిగి రూ.303.20 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.294.75)తో పోలిస్తే 1.78శాతం లాభంతో రూ.300.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు గడిచిన నెలల్లో

లెమన్‌ ట్రీ- నిట్‌ టెక్‌.. జోరు

Tuesday 24th December 2019

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ రెండు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఒకటి ఆతిథ్య రంగ కంపెనీ లెమన్‌ ట్రీ హోటల్స్‌ కాగా.. మరొకటి సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌. డార్జిలింగ్‌లో హోటల్‌ నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు లెమన్‌ ట్రీ షేరుకి హుషారునివ్వగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) వార్తలతో నిట్‌

Most from this category