News


నెల రోజులకు మూడు సిఫార్సులు

Saturday 4th January 2020
Markets_main1578129521.png-30677

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడిని అందించే మూడు స్టాకులను ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ అందిస్తోంది.
1. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 560. స్టాప్‌లాస్‌ రూ. 524. కొన్ని నెలలుగా ఈ షేరు రూ. 510 చుట్టూ తిరుగుతోంది. గతంలో ఈ స్థాయి షేరుకు బలమైన డిమాండ్‌ జోన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ జోన్‌ వద్ద డబుల్‌ బాటమ్‌ కూడా ఏర్పడింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. 
2. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 175. స్టాప్‌లాస్‌ రూ. 148. కొన్ని సెషన్లుగా మెటల్‌స్టాక్స్‌ మంచి పనితీరు చూపుతున్నాయి. వేదాంత కూడా వాటి వేగాన్ని అందుకునే యత్నాల్లో ఉంది. తాజాగా వీక్లీ చార్టుల్లో మేజర్‌ బ్రేకవుట్‌ సాధించినట్లు కనిపిస్తోంది. ఇకపై అ అప్‌ట్రెండ్‌ మరింతగా కొనసాగవచ్చు.
3. బీఈఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 110. స్టాప్‌లాస్‌ రూ. 98. గత గరిష్ఠం రూ. 122 నుంచి పతనమైన తర్వాత రూ. 97 స్థాయిల్లో కన్సాలిడేట్‌ చెందింది. శుక్రవారం ఈ కన్సాలిడేషన్‌ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ప్రస్తుతం తన 200 రోజుల డీఎంఏకు పైన కదలాడుతూ బుల్లిష్‌గా ఉంది. 



You may be interested

ఈఎంఐలు కట్టుదాటకుండా చూసుకోండి!

Saturday 4th January 2020

రిటైల్‌ రుణాలు వేగంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో గృహోపకరణాల నుంచి గృహ నిర్మాణం వరకు విద్య నుంచి వైద్యం వరకు లోన్‌ తీసుకోవడం కామనైపోయింది. అయితే ఇలా ఎడా పెడా లోన్లు తీసుకుని నెలసరి వాయిదాలు కట్టలేక చేతులెత్తే బదులు ముందుగానే మీ ఈఎంఐ ఎంతుండాలో నిర్ణయించుకొని తదనుగుణంగా లోన్‌ ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఈఎంఐ ఎంత ఉండాలనేది మీ ఆదాయమే చెబుతుంది. ఇంటి అద్దె, పిల్లల

గృహరుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ రేట్ల తగ్గింపు

Saturday 4th January 2020

ప్రైవేటు రంగ రుణ దిగ్గజ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించేసింది. కొత్త కస్టమర్లను పొందేందుకు, ప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయం తీసుకుంది. హౌసింగ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు తగ్గింపుతో అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఈ తగ్గింపు నిర్ణయం జనవరి 6 నుంచి అమలులోకి వస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఒక

Most from this category