News


ఈ రంగాలకు ప్రస్తుతం దూరం: మోతీలాల్‌ ఓస్వాల్‌

Monday 14th January 2019
Markets_main1547490146.png-23582

ఆటో, మెటల్స్‌, సిమెంట్‌ రంగాల షేర్లకు ప్రస్తుతం దూరంగా ఉండడం నయమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా సూచించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎన్నికల వరకు వేచి ఉండాలా అనే దానిపై సంశయంతో ఉన్నారని చెప్పారు. గతేడాది చివర్లో రాష్ట్రాల ఎన్నికల ముందు వ్యాల్యూమ్‌లు తగ్గిపోయాయని, కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో ఓటమి పాలైనా గానీ తర్వాత మార్కెట్లు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కనుక ఎన్నికల కోసం వేచి చూడనవసరం లేదని, ఎంపిక చేసిన స్టాక్స్‌లో ముందుకు వెళ్లొచ్చని ఖేమ్కా సూచించారు. అయితే, వచ్చే కొన్ని నెలల పాటు కొనుగోళ్లు కొద్ది కొద్దిగా చేయడం నయమన్నారు. రెండో అర్థభాగంలో ఎన్నికల తర్వాత మార్కెట్లు రికవరీ అయితే ప్రయోజనం పొందొచ్చన్నారు. అస్థిర మార్కెట్లో సిప్‌ మార్గం ఉత్తమమైనదిగా సూచించారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన ఓ వార్తా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

యస్‌ బ్యాంకు కొనుగోలు చేయవచ్చా..?
‘‘యస్‌ బ్యాంకు స్టాక్‌ ఇంత కంటే తక్కువ ధరల్లో చూశాం. అయితే, గత కొన్ని వారాల్లో ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయిల్లో స్థిరపడింది. అన్ని ప్రతికూలతలు స్టాక్‌ ధరపై ఇప్పటికే ప్రభావం చూపించాయి. మార్కెట్లు అస్థిరతను నచ్చవు. తదుపరి నాయకత్వం వహించేది ఎవరని స్పష్టమైతే అస్థిరతకు తెరపడుతుంది. ఇదంతా నాయకత్వం గురించే కానీ, బ్యాంకు నిర్వహణ అంశాల వల్ల కాదు. బ్యాంకు కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. ఈ అంశాలు బయటకు రాకముందు బ్యాంకు పట్ల మొత్తం మార్కెట్‌ సానుకూలంగా ఉంది. బ్యాంకు గణాంకాలు చక్కగా ఉన్నాయి. ఇవి కొనసాగుతాయి. ఏడాది కాలానికి చూస్తే యస్‌ బ్యాంకు పట్ల సానుకూలంగా ఉన్నాం. టార్గెట్‌ ధర రూ.270’’

 

ఈ రంగాలకు దూరం
‘‘టాటా మోటార్స్‌ మినహాయిస్తే ఆటో రంగం ఫలితాలు ఫ్లాట్‌గా, ప్రతికూలంగా ఉండనున్నాయి. అమ్మకాల పరంగా సమస్యలు ఉన్నాయి. ప్యాసింజర్‌, ద్విచక్ర వాహన నెలవారీ గణాంకాల్లో వీటిని చూశాం. అధిక బీమా వ్యయం, అధిక ఇంధన ధరలు ప్రభావం చూపాయి. అధిక వడ్డీ రేట్లతో కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. డిసెంబర్‌ త్రైమాసికంతోపాటు, మార్చి త్రైమాసికంలోనూ బలహీనంగానే ఫలితాలు ఉండొచ్చు. అయితే, ఆటో రంగంలో ప్రస్తుత స్థాయిలో మారుతి బలమైన ఎంపిక, ఇక మెటల్స్‌ రంగానికి కూడా దూరంగా ఉండొచ్చు. గత రెండు మూడేళ్ల కాలంలో ఈ కంపెనీలు మంచి ఫలితాలను చూపించాయి. అయితే, మెటల్‌ సైకిల్‌ గరిష్టానికి సమీపంలో ఉంది. చైనాలో వృద్ధి మందగమనం, అమెరికా-చైనా వాణిజ్య ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు తగ్గాయి. వరుసగా ఏడు త్రైమాసికాల తర్వాత ఈ క్వార్టర్లో మెటల్స్‌ కంపెనీల ఫలితాలు ఫ్లాటిష్‌గా ఉండనున్నాయి. సిమెంట్‌ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటిస్తాయని అంచనా వేస్తున్నాం. అమ్మకాలు మొత్తం మీద మంచిగానే ఉన్నాయి. అయితే, అధిక వ్యయాల కారణంగా మార్జిన్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో లాభదాయకతపై ప్రభావం ఉంటుంది’’ అని సిద్ధార్థ్‌ ఖేమ్కా వివరించారు.  You may be interested

ఏ వయసులో ఎంత వైద్య బీమా?

Monday 14th January 2019

ఒకరిపై కుటుంబం ఆధారపడి ఉంటే, జీవిత బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి. కానీ, వైద్య బీమా అలా కాదు. ఎవరికి వారు వారి ఆరోగ్య సమస్యలు, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అనారోగ్యం అన్నది ఎప్పుడు ఏ రూపంలో ఎదురవుతుందో తెలియదు. ప్రమాదం బారిన పడినా వైద్య చికిత్సలు అవసరం అవుతాయి. చిన్న వయసులో ఆరోగ్య సమస్యల ముప్పు తక్కువ. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ

10750 పాయింట్ల దిగువకు నిఫ్టీ

Monday 14th January 2019

36వేల దిగువకు సెన్సెక్స్‌ 10750 స్థాయిని కోల్పోయిన నిఫ్టీ చివరి గంటలో రికవరీ మెటల్‌, అటో, ప్రైవేట్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ మూడోరోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35853 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 10737.60 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థితర సైతం సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. నేడు డబ్ల్యూపీఐ గణాంకాల విడుదలతో పాటు వివిధ కంపెనీల క్యూ3 ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల

Most from this category