News


స్మాల్‌క్యాప్‌లో రేసు గుర్రాలు!

Sunday 30th June 2019
Markets_main1561916774.png-26693

దీర్ఘకాలానికి మన మార్కెట్లు ఈ స్థాయిల నుంచి మంచి రాబడులను ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని, నాణ్యమైన స్టాక్స్‌ను వెతికి పట్టుకుని క్రమంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఆ విధంగా చూసినప్పుడు అధిక రాబడులు కోరుకునే వారు, స్మాల్‌క్యాప్‌ విభాగంలో నాణ్యమైన స్టాక్స్‌ కోసం వీటిని పరిశీలించొచ్చన్నది వ్యాల్యూ రీసెర్చ్‌ సూచన.

 

భారత్‌ రసాయన్‌
1989లో ఏర్పాటైన ఈ కంపెనీ టెక్నికల్‌ గ్రేడ్‌ రకం పురుగుమందుల ఫార్ములేషన్స్‌ను తయారు చేస్తోంది. బీ2బీ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నిస్సాన్‌, బేయర్‌, ర్యాలీస్‌ కంపెనీలకు ఫార్ములేషన్లను అందిస్తోంది. దేశీయ వ్యాపారంతోపాటు ఎగుమతులు, గ్రూపు కంపెనీలైన భారత్‌ ఆగ్రోటెక్‌, భారత్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ల నుంచి ఆదాయాలు వస్తున్నాయి. ఆగ్రోకెమికల్స్‌కు సంబంధించి గడువు తీరనున్న వాటి జనరిక్‌ వెర్షన్ల విడుదలపై కంపెనీ దృష్టి సారించింది. చైనాలో కాలుష్యం కారణంగా విధించిన నిషేధం వల్ల ముడి పదార్థాల సరఫరాకు కొరత ఏర్పడడంతో దహేజ్‌ ప్లాంట్‌ బ్యాక్‌వర్డ్‌ ఇంటెగ్రేషన్‌ను చేపట్టింది. గతంతో తమ అవసరాలపై చైనాపై ఆధారపడిన బహుళజాతి సంస్థలు సైతం భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి. ఈ అవకాశాల నేపథ్యంలో గుజరాత్‌లోని శాయఖాలో కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. మరింతగా బహుళజాతి సంస్థల ఆర్డర్లను సొంతం చేసుకోవడంపైనా దృష్టి పెట్టింది. కంపెనీ రుణం-ఈక్విటీ రేషియో 2.1 రెట్ల నుంచి 0.43కు తగ్గింది. గత ఐదేళ్లలో 25 శాతానికి పైగా ఆర్‌వోఈని నమోదు చేస్తోంది. గత మూడేళ్లలో ఈ స్టాక్‌ 51 శాతం, గత ఏడాదిలో 33 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం 15పీఈలో ట్రేడ్‌ అవుతోంది. 

 

టాటా ఎలెక్సీ
టాటా గ్రూపు కంపెనీ ఇది. 1989లో ఏర్పాటైంది. ఆటోమోటివ్‌, బ్రాడ్‌కాస్ట్‌, కమ్యూనికేషన్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, హెల్త్‌కేర్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాలకు డిజైన్, టెక్నాలజీ సేవలను టాటా ఎలెక్సీ అందిస్తుంటుంది. ఎంబెడెడ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌ (ఈపీడీ) (ఆదాయంలో 86 శాతం), ఇండస్ట్రియల్‌ డిజైన్‌ (10 శాతం), విజువలైజేషన్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంటెగ్రేషన్‌ (3 శాతం) అనే మూడు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్వయం చోదక కార్లు, కనెక్టెడ్‌ కార్డు, అడ్వాన్స్‌డ్‌ డ్రైవింగ్‌ అసిస్టెన్స్‌, నేవిగేషన్‌ సిస్టమ్స్‌ తదితర భవిష్యత్తు ఆవిష్కరణలపై పరిశోధనల దృష్ట్యా టాటా ఎలెక్సీ ఈపీడీ విభాగంపై ఆసక్తి నెలకొంది. ఆటోమొబైల్స్‌, కమ్యూనికేషన్‌, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ల నుంచి కంపెనీకి అధిక ఆదాయం వస్తోంది. ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ గత మూడేళ్లలో టాటా ఎలెక్సీ 14 శాతానికి పైగా ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. లాభం ఇదే కాలంలో 23 శాతం పెరిగింది. అయితే, ఈ స్టాక్‌ గత ఏడాది కాలంలో 35 శాతం పడిపోయింది. ఎర్నింగ్స్‌కు 19 రెట్ల ప్రస్తుతం ట్రేడ్‌ అవుతోంది. ఆటోమొబైల్స్‌, హెల్త్‌కేర్‌లో టెక్నాలజీ వినియోగం పెరుగుతుండడం, డిజిటైజేషన్‌ వేగంగా జరుగుతుండడం, ఓటీటీకి పెరుగుతున్న డిమండ్‌ ఇవన్నీ కంపెనీకి వృద్ధి అవకాశాలు.

 

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌
2001లో ఏర్పాటైంది. స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌ నుంచి వేరుపడింది. 2016లో విద్యుత్‌ పంపిణీ వ్యాపారాన్ని వేరు చేయడంతో పూర్తి స్తాయి ఆప్టిక్‌ ప్రొడక్ట్స్‌, సొల్యూషన్లను అందించే కంపెనీగా అవతరించింది. ప్రపంచంలో ఆప్టిక్‌ ఫైబర్‌ విభాగంలో సమగ్ర సేవల కంపెనీ ఇది. తయారీ నుంచి నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల వరకు అన్నింటినీ అందిస్తోంది. ప్రస్తుతం దేశీయంగా 45 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీ చేతుల్లోనే ఉంది. అయితే, ఈ రంగంలో ఇటీవల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ ధరలు పడిపోవడం జరిగింది. దీంతో ఈ వ్యాపారంలో ధరల పరంగా ఒత్తిళ్లు ఉన్నాయి. అయితే, ఆప్టిక్‌ ఫైబర్‌కు సంబంధించి కంపెనీకి దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నాయి. కనుక ఈ ప్రభావం కంపెనీపై పెద్దగా ఉండదు. ప్రమోటర్లు తమ వాటాల్లో 97 శాతం వరకు షేర్లను తనఖా పెట్టగా, వాటిని మొత్తం విడిపించుకోవడం సానుకూలం. డెట్‌-ఈక్విటీ రేషియో 1.2 రెట్లుగా ఉంది. 18-20 శాతం నిర్వహణ మార్జిన్‌ సాధించే విషయంలో కంపెనీ యాజమాన్యం విశ్వాసంతో ఉంది. ఉత్పత్తులు, సేవల పరంగా ఆదాయాన్ని సమం చేసుకోవడం కూడా కంపెనీ వ్యూహంలో భాగం. 2018-19 ఆదాయానికి 2.1 రెట్లు అధికంగా, రూ.10,500 కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉంది. గత మూడేళ్లలో ఆదాయంలో 31 శాతం, లాభంలో 53 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్‌వోఈ 35 శాతంగా ఉంది. ప్రస్తుతం 13పీఈ వద్ద ట్రేడవుతోంది. You may be interested

మిడ్‌క్యాప్‌లో రాబడుల అవకాశాలు మెండు...

Sunday 30th June 2019

ఈక్విటీ మార్కెట్‌ అంటేనే ఇతర సాధనాలతో పోలిస్తే అధిక రిస్క్‌ ఉంటుంది. దీంతో సహజంగా రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్నవారే ఈక్విటీలవైపు చూస్తారు. కనుక రిస్క్‌ తీసుకునే వారికి అధిక రాబడుల కోసం లార్జ్‌క్యాప్‌ కంటే మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ దీర్ఘకాలానికి మంచి ఎంపికలుగా యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ అరుణ్‌ తుక్రాల్‌ సూచించారు.    ‘‘స్టాక్స్‌ను వాటి మార్కెట్‌ విలువ ఆధారంగా లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అని వర్గీకరించిన విషయం తెలిసిందే. సెబీ నిర్వచనం

నిఫ్టీ ఆప్షన్స్‌ ఏం సూచిస్తున్నాయి?

Saturday 29th June 2019

దేశీయ మార్కెట్‌ గతవారం ఒత్తిడిలో ముగిసింది. నిఫ్టీ డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది, వీక్లీచార్టుల్లో బుల్లిష్‌ హరామీ ఏర్పాటు చేసింది. ఇకపై నిఫ్టీలో అప్‌మూవ్‌ ఉండాలంటే 10822 పాయింట్ల పైన బలంగా కొనసాగాల్సిఉంటుంది. ఒకవేళ ఫెయిలైతే తిరిగి 11650 స్థాయిలను చూడవచ్చు. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 11500, 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా ఉండగా, 12000, 12500 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. కొత్త పుట్‌రైటింగ్‌

Most from this category