చౌకగా మూడు బ్లూచిప్‌లు...!
By Sakshi

ఎటువంటి పరిస్థితుల్లో అయినా బ్లూచిప్ కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆయా కంపెనీల బ్రాండ్ విలువ, వాటి సామర్థ్యాలే వీటికి కారణం. ఎంతటి దిగ్గజ కంపెనీలు అయినా మార్కెట్ ప్రతికూలతల సమయాల్లో అమ్మకాల కారణంగా ధరల పరంగా దిద్దుబాటుకు లోనవుతుంటాయి. నిజానికి సాధారణ ఇన్వెస్టర్లకు అటువంటి సమయాలే పెట్టుబడులకు అనుకూలమని వారెన్ బఫెట్ వంటి నిపుణులు చెబుతుంటారు. కొన్ని అంశాల ఆధారంగా బ్లూచిప్ కంపెనీల్లో చౌకగా ట్రేడ్ అవుతున్న, ఆకర్షణీయంగా కనిపిస్తున్న మూడు కంపెనీలను వ్యాల్యూ రీసెర్చ్ సంస్థ ఇన్వెస్టర్ల దృష్టికి తీసుకొచ్చింది. ఐచర్స్ మోటార్స్ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్
రాయల్ ఎన్ఫీల్డ్ 250సీసీ అంతకుమించి సామర్థ్యం కలిగిన బైకుల మార్కెట్లో దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ. 2019లో 8 లక్షలకుపైగా మోటారు సైకిళ్లను విక్రయించింది. 50కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని స్వీడన్‌కు చెందిన ఏబీ వోల్వోతో కలసి నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) కంపెనీ పనితీరు సానుకూలంగా లేదు. ఆటో రంగం నిదానించడం ఇందుకు ప్రధాన కారణం. కేరళలో భారీ వరదలు రావడం, ఈ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ కావడం కూడా కంపెనీపై ప్రభావం చూపించింది. నూతన భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావడం, అదే సమయంలో థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ వ్యయాలు పెరిగిపోవడం కూడా వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపింది. ఈ భారాన్ని కంపెనీ కస్టమర్లకు బదలాయించాల్సి ఉంది. అయితే, నూతన మోడళ్ల విడుదల, థాయిలాండ్‌లో నూతన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడం, దక్షిణ కొరియా తదితర నూతన మార్కెట్లోకి అడుగుపెట్టడం రానున్న కాలంలో కంపెనీ వృద్ధికి అవకాశాలు కల్పించనుంది. ప్రస్తుతం ఈ స్టాక్ 24పీఈలో ట్రేడవుతోంది. పోటీ సంస్థలతో పోలిస్తే అధిక పీఈలో ఉన్నా కానీ, ఐదేళ్ల సగటు పీఈ 42 కంటే తక్కువలోనే ఉంది.
ఎల్అండ్టీ గ్రూపులో భాగమైన 20 ఏళ్ల చరిత్ర కలిగిన ఐటీ కంపెనీ. ఆదాయాల పరంగా చూస్తే దేశంలో ఆరో అతిపెద్ద ఐటీ కంపెనీ కూడా. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 66 కంపెనీలు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. నార్త్ అమెరికా నుంచి 66 శాతం ఆదాయం వస్తోంది. మార్చి క్వార్టర్లో ఇది వార్షికంగా 15 శాతం పెరిగింది. యాక్టివ్ క్లయింట్ల సంఖ్య మార్చి నాటికి 343కు పెరిగింది. ఆదాయం విషయంలో ఐదు అగ్రస్థాయి క్లయింట్లపై ఎక్కువగా ఆధారపడడం కూడా తగ్గింది. గతంలో 35.2 శాతంగా ఉండగా, మార్చి నాటికి 32.2 శాతానికి పరిమితం చేసుకుంది. ఆపరేటింగ్ మార్జిన్ గత నాలుగు త్రైమాసికాల్లో పెరుగుతూనే పోతోంది. ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 29 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎక్కువ శాతం ఆదాయాలు బీఎఫ్ఎస్ఐ నుంచి వస్తున్నాయి. పోటీ సంస్థలకు మాదిరే 20 పీఈలో ట్రేడవుతున్నా గానీ, దీని చారిత్రక సగటు పీఈ 22కంటే కొంచెం తక్కువలోనే ఉంది.
ప్రభుత్వరంగ సంస్థ అయిన బీపీసీఎల్ బ్రాండ్ విలువే 675 మిలియన్ డాలర్లు. ఆయిల్ రిఫైనరీ, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్, హైడ్రోకార్బన్ల అన్వేషణా, ఉత్పత్తి కార్యకలాపాల్లో ఉంది. దేశంలో మూడో అతిపెద్ద రిఫైనరీ సంస్థ. వార్షిక సామర్థ్యం 36.5 మెట్రిక్ టన్నులు. ఈ కంపెనీ డెట్ టు ఈక్విటీ రేషియో 1.1 దగ్గరే ఉంది. ఆపరేటింగ్ మార్జిన్ 4.43 శాతం. చమురు ధరల్లో తీవ్ర అస్థిరతలు ఉంటే అది బీపీసీఎల్ తరహా ఆయిల్ రిఫైనరీ, మార్కెటింగ్ సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని మర్చిపోవద్దు. ప్రస్తుతం ఈ స్టాక్ 11పీఈ వద్ద ట్రేడవుతోంది. ఐదేళ్ల సగటు పీఈ వద్దే ఉంది.
You may be interested
లాభాల ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి
Thursday 6th June 2019రంజాన్ సెలవు అనంతరం గురువారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్...కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. 52 పాయింట్ల లాభంతో 40,136 పాయింట్ల వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ వెనువెంటనే 42 పాయింట్ల నష్టంతో 40,045 పాయింట్ల వద్దకు తగ్గింది. 18 పాయింట్ల లాభంతో 12,038 పాయింట్ల వద్ద మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచి..కొద్ది నిముషాల్లోనే 20 పాయింట్ల నష్టంతో 12,001 పాయింట్ల వద్దకు పడిపోయింది. గెయిల్ 9 శాతం క్రాష్ ట్రేడింగ్ ప్రారంభంలోనే
2025 నాటికి సెన్సెక్స్... 1,00,000: కార్వీ
Wednesday 5th June 2019ఎన్నికల ఘట్టం ముగిసిపోయింది. మోదీ సర్కారుకే దేశ ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. ఇప్పటి వరకు నిధులతో వేచి చూసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు పెట్టుబడి అవకాశాల అన్వేషణలో పడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల అండతో దేశీయ సూచీలు నూతన రికార్డు స్థాయిలకు దూసుకుపోవడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే, తమ పోర్ట్‌ఫోలియోలో వేటిని చేర్చుకోవాలన్న మీమాంసతో ఉన్న ఇన్వెస్టర్లు ఎందరో ఉన్నారు. ఇక ముందు మార్కెట్లలో రాబడులు అన్నవి కంపెనీల ఆర్థిక