News


2019 బిజినెస్‌ రివైండ్‌: స్టాక్‌ మార్కెట్లు ... రికార్డు పరుగులు

Monday 30th December 2019
Markets_main1577677436.png-30510

ఈ ఏడాది ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్‌ మార్కెట్లు మాత్రం దానికి భిన్నంగా రయ్‌న ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్‌ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10.2 లక్షల కోట్లు ఎగిసింది. జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్‌ 5,000 పాయింట్లు పైగా పెరిగి 41,000 పైకి చేరింది. బేరిష్‌గా ఉన్న ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్‌ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ కేవలం కొన్ని షేర్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయులతో పోలిస్తే మిడ్‌ క్యాప్‌ సూచీ 19 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 33 శాతం పడ్డాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది.  కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం తదితర అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ. 1 లక్ష కోట్ల పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్‌ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బులిష్‌గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. 



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 30th December 2019

గత శుక్రవారం భారీ ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 111 పాయింట్ల లాభంతో 41,686 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,275 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

ఫ్రీ... వాళ్ల పాలసీ... మీరేం చేయాలి?

Monday 30th December 2019

క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై ఉచిత బీమా మ్యూచువల్‌ ఫండ్స్‌ సిప్‌ పెట్టుబడులపైనా.. టర్మ్‌, ప్రమాద, పర్యాటక, ఆరోగ్య బీమాలు నియమ, నిబంధనలు తెలుసుకోవడం అవసరం అవగాహనతోనే వీటివల్ల ప్రయోజనం బీమా పాలసీలు ఉచితంగా రావడం ఏంటి... అని ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజమే. ఆర్థిక ఉత్పత్తులు, పెట్టుబడి సాధనాలకు అనుబంధంగా ఉచిత బీమా పాలసీలను కంపెనీలు ఆఫర్‌ చేయటం కొత్తేమీ కాదు. బ్యాంకు ఖాతాలు, డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇలా ఎన్నింటికో బీమా పాలసీలను

Most from this category