News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 30th December 2019
Markets_main1577675774.png-30505

టాటా కెమికల్స్‌:-        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర:- రూ.668
టార్గెట్‌ ధర:- రూ.811
ఎందుకంటే:- ఉత్తర అమెరికాలో ఉన్న జాయింట్‌ వెంచర్‌ కంపెనీ(టాటా కెమికల్స్‌ సోడా యాష్‌ పార్ట్‌నర్స్‌ హోల్డింగ్స్‌-టీసీసాప్‌)లో 25 శాతం వాటాను టాటా కెమికల్స్‌ కొనుగోలు చేసింది. దీంతో టీసీసాప్‌లో వంద శాతం వాటా టాటా కెమికల్స్‌ పరమైంది. ఈ వాటా కొనుగోలు కోసం టాటా కెమికల్స్‌ కంపెనీ 19.5 కోట్ల డాలర్లు వెచ్చించింది. దీంట్లో 17.5 కోట్ల డాలర్లను రుణాల ద్వారా సమీకరించింది. మిగిలిన మొత్తాన్ని అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంది. టీసీసాప్‌ నేచురల్‌ సోడా యాష్‌ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.5 మెట్రిక్‌ మిలియన్‌ టన్నులు. నేచురల్‌ సొడా యాష్‌ ఉత్పత్తికి అవసరమైన ట్రోనా రిజర్వ్‌లు ఉత్తర అమెరికాలోనే అధికంగా ఉన్నాయి. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు 25-30 శాతం రేంజ్‌లో తగ్గుతాయి. స్పెషాల్టీ కెమికల్స్‌ వ్యాపారంపై పూర్తి స్థాయిలో దష్టి కేంద్రీకరించే నిమిత్తం 2016లో ఎరువుల వ్యాపారాన్ని టాటా కెమికల్స్‌ విక్రయించింది. 2019లో కన్సూమర్‌ బిజినెస్‌ను డీమెర్జ్‌ చేసింది. మిథాపూర్‌ ప్లాంట్‌ విస్తరణ నిమిత్తం రూ.2,400 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు ఫలితాలు 2022 నుంచి కనిపించనున్నాయి. కంపెనీకి కామధేనువు లాంటి సోడా యాష్‌, సోడియమ్‌ బైకార్పొనేట్‌  వ్యాపారం నిలకడగా ఉంది. ఈ వ్యాపారానికి సంబంధించి డిమాండ్‌-సరఫరా పరిస్థితులు సమతూకంగానే ఉండటం సానుకూలాంశం. ఈ వ్యాపారం నుంచి వచ్చే నిధులను మార్జిన్లు అధికంగా ఉండే స్పెషాల్టీ కెమికల్స్‌ వ్యాపారంలోకి మళ్లిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 5 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 

జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐడీబీఐ క్యాపిటల్‌
ప్రస్తుత ధర: రూ.1,630
టార్గెట్‌ ధర: రూ.1,836
ఎందుకంటే: జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కంపెనీ డొమినోస్‌ పిజ్జా, డంకిన్‌ డొనట్‌, హాంగ్స్‌ కిచెన్‌ బ్రాండ్ల కింద రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. పిజ్జా కేటగిరీలో 77 శాతం మార్కెట్‌ వాటా డొమినోస్‌ పిజ్జాదే. పిజ్జాలకు సంబంధించి వెరైటీల్లో ఈ కంపెనీదే పై చేయి. ధరలు కూడా అనుకూల స్థాయిల్లోనే ఉన్నాయి. ఇటీవలనే హాంగ్స్‌ కిచెన్‌ పేరుతో చైనీస్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ అవుట్‌లెట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి మెనూలో 40 శాతం ఉత్పత్తులు రూ.100-200 రేంజ్‌లోనే ఉన్నాయి. పిజ్జా మార్కెట్‌ కన్నా చైనీస్‌ ఫాస్ట్‌ఫుడ్‌ మార్కెట్‌ మూడు రెట్లు (రూ.15,000 కోట్లు) ఉంటుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఎస్‌ఎస్‌ఎస్‌జీ(సేమ్‌ స్టోర్స్‌ సేల్స్‌ గ్రోత్‌) 16.4 శాతంగా ఉంది. మందగమనం కారణంగా రానున్న రెండేళ్లలో ఇది 11-14శాతంగానే ఉండొచ్చని భావిస్తున్నాం. గత 4-5 ఏళ్లలో టెక్నాలజీపై భారీగా ఇన్వెస్ట్‌ చేసింది. 2012లో ఆరంభమైన డంకిన్‌ డొనట్స్‌ విభాగం గత ఆర్థిక సంవత్సరంలోనే బ్రేక్‌ఈవెన్‌ సాధించింది. వివిధ అప్‌గ్రేడెడ్‌ ఫీచర్లతో కూడిన డొమినోస్‌ యాప్‌ను రీలాంచ్‌ చేయడం కలిసివచ్చింది. 
ఓవెన్‌స్టోరీ వంటి క్లౌడ్‌ కిచెన్‌ రిటైలర్లు జోరుగా విస్తరిస్తుండటం, వీటి నుంచి పోటీ తీవ్రత పెరుగతుండటం, ఉల్లిపాయలు, చికెన్‌, చీజ్‌ వంటి ముడి పదార్థాల ధరలు పెరుగుతుండటం వల్ల స్థూల మార్జిన్లపై ఒత్తిడి పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. వ్యయ నియంత్రణ పద్ధతులు, ధరలు పెంచడం ద్వారా ముడి పదార్ధాల ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించుకోనున్నది. రెండేళ్లలో ఆదాయం 14 శాతం, నిర్వహణ లాభం 19 శాతం, నికర లాభం 23 శాతం మేర చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 75.1 శాతంగా ఉన్న స్థూల మార్జిన్లు 2021-22 నాటికి 75.4 శాతానికి పెరుగుతాయని భావిస్తున్నాం. You may be interested

నిఫ్టీ మద్దతు 12,183...నిరోధం 12284

Monday 30th December 2019

స్వల్ప లాభంతో కదులుతున్న ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(సోమవారం) అక్కడక్కడే అన్నట్లుగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 10 పాయింట్ల స్వల్ప లాభంతో 12,329 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కాగా.. గత వారాంతాన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ర్యాలీ బాట పట్టాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్లు జంప్‌చేసి 41,575 వద్ద నిలవగా, ఎన్‌ఎస్‌ఈ

సెన్సెక్స్‌ తక్షణ అవరోధం 41,810

Monday 30th December 2019

మార్కెట్‌ ట్రాకింగ్‌ కోసం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఫండ్స్‌...అధికంగా అనుసరించే నిఫ్టీ–50 సూచి ఈ ఏడాది పలు సందర్భాల్లో 11,700–12,160 పాయింట్ల మధ్య కొత్త రికార్డుల్ని నెలకొల్పినా,  రికార్డుస్థాయి దాటిన ప్రతీ సందర్భంలోనూ మరింత ముందడుగువేయలేక, పెద్ద కరెక్షన్‌కు లోనవుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌ చివరివారంలో 12,158 గరిష్టస్థాయిని దాటిన తర్వాత 1 శాతం వరకూ నిఫ్టీ పైకి ఎగరగలిగింది. మళ్లీ యథాప్రకారం వెనువెంటనే దిద్దుబాటు బాటలో పడిపోయింది. సాంకేతికంగా

Most from this category