News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 20th January 2020
Markets_main1579490811.png-31037

బంధన్‌ బ్యాంక్‌:-  కొనొచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ:- ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర:- రూ.481
టార్గెట్‌ ధర:- రూ.650
ఎందుకంటే:- ‍ఈ ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కీలకమైన సూక్ష్మ రుణాల విభాగంలో తాజా మొండి బకాయిలు పెద్దగా లేవు. అయినప్పటికీ, అదనంగా రూ.200 కోట్ల కేటాయింపులు జరిపింది. గృహ్‌ ఫైనాన్స్‌ విలీనం తర్వాత రుణ నాణ్యత ఒకింత తగ్గినా, మెరుగైన స్థితిలోనే ఉంది.  నిర్వహణ ఆస్తులు 84 శాతం వృద్ధితో రూ.65,456 కోట్లకు పెరిగాయి. గృహ్‌ ఫైనాన్స్‌ రుణాలను మినహాయించి చూస్తే, రుణ వృద్ధి 33 శాతంగా ఉంది. సూక్ష్మ రుణాలు కాకుండా ఇతర రుణాలు 54 శాతం పెరిగాయి. ఈ క్యూ3లో 7.3 లక్షల మంది కొత్త ఖాతాదారులయ్యారు. దీంతో మొత్తం బ్యాంక్‌ ఖాతాదారుల సంఖ్య 1.9 కోట్లకు పెరిగింది. మార్జిన్‌ 7.9 శాతానికి తగ్గడంతో నికర వడ్డీ ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే, 0.5 శాతమే వృద్ధి చెంది రూ.1,540 కోట్లకు పెరిగింది. రూ.200 కోట్లు అదనంగా కేటాయింపులు జరపడంతో నికర లాభం రూ.700 కోట్లకే పరిమితమైంది. డిపాజట్లు 59 శాతం వృద్ధితో రూ.54,908 కోట్లకు పెరిగాయి. బంధన్‌ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్లను కొనసాగించడంతో హోమ్‌ ఫైనాన్స్‌ వ్యాపార నిర్వహణ మెరుగ్గానే ఉండగలదని భావిస్తున్నాం. విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ఉన్న గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకున్న  ఫలితాలు కనిపిస్తున్నాయి. గృహ్‌ ఫైనాన్స్‌కు ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉంది. అయితే ఇటీవల చెలరేగిన అలజడుల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకింత అశాంతి నెలకొనడం ప్రతికూలాంశం. రెండేళ్లలో నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. 


ఇన్ఫోసిస్‌:-  కొనొచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ:- మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర:- రూ.768
టార్గెట్‌ ధర:- రూ.870
ఎందుకంటే:- దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 10 శాతం పెరగ్గా. నికర లాభం 23 శాతం ఎగసి రూ.4,500 కోట్లకు పెరిగింది. కీలకమైన బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌, బీమా సేవలు(బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌ విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాలు పటిష్టమైన వృద్ధిని సాధించాయి. యూరప్‌ మార్కెట్లో వృద్ధి బలహీనంగా ఉన్నా, అమెరికా మార్కెట్లో 10 శాతం వృద్ధిని సాధించింది. పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, రూపాయి బలహీనపడటం.... వంటి కారణాల వల్ల మార్జిన్‌ 21.9 శాతానికి పెరిగింది. భారీ డీల్స్‌ 58 శాతం పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం ఆదాయ అంచనాలను 9-10 శాతం నుంచి 10-10.5 శాతానికి పెంచింది. ప్రజావేగు సంబంధిత సమస్యలున్నప్పటికీ, భారీ డీల్స్‌ను సాధించడం, ఆదాయ అంచనాలను పెంచడం చెప్పుకోదగ్గ విశేషాలు. ఇన్ఫోసిస్‌ వ్యాపారం సజావుగానే సాగుతోందనడానికి ఇవే నిదర్శనాలు. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆట్రీషన్‌ రేటు(ఉద్యోగుల వలస) 2 శాతం తగ్గడం, ప్రజావేగు ఆరోపణల్లో నిజం లేదని, కంపెనీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తేలడం, రెండేళ్లలో మార్జిన్‌ 1.3 శాతం పెరుగుతాయనే అంచనాలు, అప్రమత్త వ్యాపార పరిస్థితుల్లోనూ భారీ డీల్స్‌ను సాధించడం, ఆదాయ అంచనాలను పెంచడం,..సానుకూలాంశాలు. You may be interested

Q3 ఎఫెక్ట్‌- తొలుత జోరు- తదుపరి డీలా(అప్‌డేటెడ్‌)

Monday 20th January 2020

గత వారాంతాన పలు దిగ్గజ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ శుక్రవారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో శనివారం ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్లు ఫలితాల ఆధారంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో భిన్న రకాలుగా స్పందిస్తున్నాయి.  కాగా.. తొలుత

నేడు ఫ్లాట్‌ ఓపెనింగ్‌?

Monday 20th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 7 పాయింట్లు ప్లస్‌ నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 7 పాయింట్ల స్వల్ప లాభంతో 12,384 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,377 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. వివాద పరిష్కారంలో భాగంగా చైనాతో వాణిజ్య

Most from this category