News


ఈ రెండు షేర్లను కొనొచ్చు

Monday 12th August 2019
Markets_main1565591830.png-27709

మారుతీ సుజుకీ    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.6,101
టార్గెట్‌ ధర: రూ. 6,950

ఎందుకంటే:-  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమ్మకాలు సాధారణ స్థాయికి వస్తాయని కంపెనీ భావిస్తోంది. దీని కోసం ఉత్పత్తి సామర్థ్యం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పెంపు కోసం సేల్స్‌, సర్వీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేస్తోంది. విద్యుత్‌ వాహనాలు, హైబ్రిడ్‌ వాహనాల కోసం టెక్నాలజీ నిమిత్తం టయోటా కంపెనీతో మారుతీ సుజుకీ కుదుర్చుకున్న ఒప్పందం సానుకూల ప్రభావం చూపనున్నది. ఈ ఒప్పందం కారణంగా టెక్నాలజీ చౌకగా మారుతీ కంపెనీకి అందనున్నది. దీంతో  మారుతీ సుజుకీ తక్కువ ధరకు విద్యుత్‌, హైబ్రిడ్‌ వాహనాలను అందించగలుగుతుంది. ఫలితంగా ధరలు కీలకమైన భారత విపణిలో మారుతీ కంపెనీకి మేలు కలుగుతుంది.  వచ్చే ఏడాది ఎలక్ట్రిక్‌ వాహనాలను అందించనున్నది. సీఎన్‌జీ, హైబ్రిడ్‌ వాహన విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి చెందగలవన్న అంచనాలతో ఈ వాహనాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 8 శాతం పెరిగినా, నికర లాభం 7 శాతం తగ్గింది. 2011-12 ఆర్థిక సంవత్సరం తర్వాత నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి. మొత్తం పెట్టుబడుల్లో మూడో వంతు నగదు రూపంలో ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ, కంపెనీ ఆర్‌ఓసీఈ(రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌-పెట్టిన పెట్టుబడిపై వచ్చే రాబడి) 22.1 శాతం స్థాయిలో ఆరోగ్యకరంగానే ఉంది. ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అధికంగా లాభపడే వాహన కంపెనీల్లో ఇది కూడా ఒకటి కానున్నది. మోడల్స్‌ పరంగా పటిష్టంగా ఉండటం, వాహన తయారీలో స్థానిక విడిభాగాల వినియోగం అధికంగా ఉండటం, ఒడిదుడుకులు అధికంగా ఉండే విదేశీ కరెన్సీపై ఆధారపడటం తక్కువగా ఉండటం ఇవన్నీ సానుకూలాంశాలు.  


ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్స్‌  
ప్రస్తుత ధర: రూ.501
టార్గెట్‌ ధర: రూ. 570
ఎందుకంటే:
దేశంలో నాలుగవ అతి పెద్ద మోర్టగేజ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇది. గృహ రుణాలు, నిర్మాణ రంగ కార్యకలాపాలకు, కార్పొరేట్‌ హౌసింగ్‌ స్కీమ్‌లకు రుణాలందిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. రుణ వ్యయం అధికంగా ఉండటం, నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) తక్కువగా ఉండటం వల్ల నికర లాభం అంచనాలను అందుకోలేక రూ.610 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్‌ రంగానికి చెందిన తాజా మొండి బకాయిల కారణంగా స్థూల మొండి బకాయిలు 1.98 శాతానికి పెరిగాయి. (గత క్యూ1లో ఇవి 1.53 శాతంగా ఉన్నాయి) నికర వడ్డీ మార్జిన్‌ 2.35 శాతంగా నమోదైంది. రుణ వృద్ధి నిలకడగా 17 శాతంగా ఉన్నప్పటికీ, ఆదాయం అంచనాలను అందుకోలేకపోయింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, డెవలపర్లకు ఇచ్చిన రుణాలు 4 శాతం పెరిగాయి. మాతృసంస్థ జీవీత బీమా సం‍స్థ, ఎల్‌ఐసీ అండదండలు ఉండటం, నగదు నిల్వలు పుష్కలంగా ఉండటం వంటి కారణాల వల్ల... ఒడిదుడుకులను అధిగమించగలిగిన సత్తా ఈ కంపెనీకి ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం చివరినాటికి ఈ కంపెనీ మొత్తం రుణాలు రూ.1,97 లక్షల కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యతలో ఒడిదుడుకులు, నికర వడ్డీ మార్జిన్‌ అంతంతమాత్రంగానే ఉండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించే అంశాలు. పోటీ తీవ్రత తగ్గడం, లిక్విడిటీ స్థితిగతులు సౌకర్యవంతంగా ఉండటం... సానుకూలాంశాలు. You may be interested

తాజా బౌన్స్‌తో మారేదేమీ లేదు!

Monday 12th August 2019

మధ్యకాలిక డౌన్‌ట్రెండ్‌ కొనసాగుతుంది మార్కెట్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ మార్కెట్లలో కనిపిస్తున్న తాజా అప్‌మూవ్‌తో స్వల్పకాలిక నెగిటివ్‌ అవుట్‌లుక్‌ ఏమీ మారదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజ్‌ షెట్టి చెప్పారు. గురువారం అప్‌మూవ్‌కు కొనసాగింపుగా శుక్రవారం కూడా నిఫ్టీ, సెన్సెక్స్‌ మంచి జోరే చూపాయి. కానీ శుక్రవారం నిఫ్టీ తన కీలక నిరోధం 11115 స్థాయికి పైన ముగియడంలో విఫలమైందని షెట్టి చెప్పారు. ఇంట్రాడేలో ఈ నిరోధాన్ని దాటినా, చివరకు ఆ స్థాయి దిగువనే

దివీస్‌ సీఎండీ వేతనం రూ.58.8 కోట్లు

Monday 12th August 2019

హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ రంగంలో అత్యధికంగా రూ.58.8 కోట్ల వేతనం అందుకున్న వ్యక్తిగా దివీస్‌ ల్యాబొరేటరీస్‌ సీఎండీ మురళి కె దివి నిలిచారు. ఇదే కంపెనీకి చెందిన ఈడీ ఎన్వీ రమణ రూ.30 కోట్లు, హోల్‌ టైం డైరెక్టర్‌ కిరణ్‌ ఎస్‌ దివి రూ.20 కోట్లు వేతనం పొందారు. సిప్లా ఎండీ ఉమాంగ్‌ వోరా రూ.15.03 కోట్లు, అరబిందో ఎండీ ఎన్‌.గోవిందరాజన్‌ రూ.14.6 కోట్లు, డాక్టర్‌

Most from this category