STOCKS

News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 14th October 2019
Markets_main1571022007.png-28859

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌    కొనచ్చు
బ్రోకరేజ​ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.1,223
టార్గెట్‌ ధర: రూ.1,530

ఎందుకంటే:- ఈ ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం అంచనాలను మించగా, మొండిబకాయిలు అంచనాలను మించి పెరిగిపోయాయి. రూ.740 కోట్ల మేర కేటాయింపులు జరిపినప్పటికీ, నికర లాభం 52 శాతం వృద్ధితో రూ.1,400 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 2,910 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 5 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4.1 శాతానికి వృద్ధి చెందింది. వినియోగదారుల, కార్పొరేట్‌ రుణాలు మందగించడంతో 21 శాతం రుణ వృద్ధిని మాత్రమే సాధించగలిగింది. మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాలు 55 శాతంగా ఉన్నాయి. డిపాజిట్లు 23 శాతం, కాసా 17 శాతం చొప్పున పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.2 శాతానికి, నికర మొండి బకాయిలు 1.1 శాతానికి చేరాయి. వినియోగదారుల, కార్పొరేట్‌ రుణాలు బలహీనంగా ఉండటం, వాహన విక్రయాలు మందగించడం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటం... ఇవన్నీ బ్యాంక్‌ క్యూ2 ఆర్థిక ఫలితాలపై తగిన ప్రభావమే చూపించాయి. నికర లాభం నిలకడగానే ఉన్నా, వ్యాపార వృద్ధి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో పరిస్థితులు చక్కబడగలవని బ్యాంక్‌ యాజమాన్యం భావిస్తోంది.  రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ)ఈ ఆర్థిక సంవత్సరంలో 1.9 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.2 శాతంగా ఉండగలదని అంచనా. 


అశోక్‌ లేలాండ్‌    కొనచ్చు
బ్రోకరేజ​ సంస్థ: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.69
టార్గెట్‌ ధర: రూ.111

ఎందుకంటే:-  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ఈ కంపెనీ మధ్య, భారీ వాణిజ్య వాహన విక్రయాలు 37 శాతం మేర తగ్గాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఈ విక్రయాలు 60 శాతం పడిపోయాయి. అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి సంబంధించి  అత్యంత అధ్వానమైన అమ్మకాలు ఇవే. వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య వరకూ వాహన పరిశ్రమలో గడ్డు పరిస్థితులు కొనసాగవచ్చు. ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకునే అవకాశాలున్నాయి. అధిక యాక్సిల్‌ లోడ్‌ నిబంధనలు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల లిక్విడిటీ సంక్షోభం, ఆర్థిక మందగమనం, భారత్‌ స్టేజ్‌(బీఎస్‌)-సిక్స్‌కు మార్పు... ఈ అంశాలన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌ వరకూ ప్రభావం చూపించవచ్చు. ఒక్కసారి బీఎస్‌ సిక్స్‌ నియమాలు అమల్లోకి వచ్చాక, వాహన పరిశ్రమకు ఊరట లభిస్తుంది. ప్రభుత్వం ఇవ్వనున్న పన్ను రాయితీల కారణంగా కొత్త పెట్టుబడుల జోరు పెరగనుండటం, రెండేళ్ల మందగమనం తర్వాత డిమాండ్‌ పుంజుకోనుండటం, లిక్విడిటీ పరిస్థితలు మెరుగుపడుతుండటం, వాహన పరిశ్రమను ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫలితాలనివ్వడం ప్రారంభం కానుండటం,... ఇవన్నీ సానుకూలాంశాలు. 2021-22 ఆర్థిక సంవత్సరం కల్లా నిర్వహణ లాభ మార్జిన్‌ 11 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. అందుకే గతంలో ఈ షేర్‌కు ‘తగ్గించుకోండి’ అని ఇచ్చిన రేటింగ్‌ను ఇప్పుడు ‘కొనొచ్చు’ కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 2021-22 అంచనా ఈపీఎస్‌కు 17 రెట్ల ధరను (రూ.111) టార్గెట్‌ ధరగా నిర్ణయించాం. 

 You may be interested

అనిశ్చితిలో సురక్షిత పెట్టుబడుల కోసం..

Monday 14th October 2019

అనిశ్చితిలో సురక్షిత పెట్టుబడుల కోసం.. మిరే అసెట్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ డి.జయంత్‌కుమార్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ అంతర్జాతీయంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు, భౌగోళిక రాజకీయ అంశాలకుతోడు, దేశీయంగా ఆర్థిక వృద్ధి నిదానించడం వంటి అంశాల కారణంగా స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ కాస్త సురక్షితమైనవి. ఎందుకంటే ఇవి స్థిరమైనవే కాకుండా, మార్కెట్లు కుదుటపడిన వెంటనే

ఆరోగ్యం విషయంలో ముందే మేల్కొంటేనే ...

Monday 14th October 2019

చిన్న వయసు నుంచే వైద్య బీమా అవసరం ఊహించని ఆరోగ్య సమస్యలు ప్రమాదాల కారణంగా గాయాలు పెరిగిపోతున్న క్లెయిమ్‌లు పెరుగుతున్న చికిత్సల వ్యయాలు వైద్య బీమాతో ఆర్థికంగానూ రక్షణ  పెద్ద వయసులోనే వైద్య బీమా (హెల్త్‌ ప్లాన్‌) అవసమరని చాలా మంది భావిస్తుంటారు. నేటి జీవన శైలి, పర్యావరణ కాలుష్యం, ఉద్యోగ పని స్వభావాల నేపథ్యంలో చిన్న వయసు నుంచే హెల్త్‌ కవరేజీ ఎంతో అవసరమన్న విషయాన్ని ఇప్పటికీ ఎక్కువ మంది గుర్తించడం లేదు. ఆరోగ్య బీమా పరిశ్రమ

Most from this category