News


ఈ వారం స్టాక్స్‌​ రికమెండేషన్స్‌

Monday 18th November 2019
Markets_main1574049376.png-29661

గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌  కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.756
టార్గెట్‌ ధర: రూ.1,057

ఎందుకంటే: ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రస్తుతం నాలుగు విభాగాల్లో-వీఎస్‌ఎఫ్‌, సిమెంట్‌, రసాయనాలు, టెక్స్‌టైల్స్‌ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటిల్లో వీఎస్‌ఎఫ్‌, సిమెంట్‌ కీలక విభాగాలు. ఈ కంపెనీ మొత్తం ఆదాయం, నిర్వహణ లాభాల్లో ఈ రెండు విభాగాల వాటా దాదాపు 90 శాతం. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. విఎస్‌ఎఫ్‌, కాస్టిక్‌ సోడా ధరలు అంతర్జాతీయంగా బలహీనంగా ఉండటంతో నిర్వహణ లాభం(స్టాండ్‌అలోన్‌) అంచనాల మేరకు పెరగలేదు. వీఎస్‌ఎఫ్‌(విస్కోస్‌ స్టేపుల్‌ ఫైబర్‌-నూలు లాగానే ఉండే బయోడిగ్రేడబుల్‌ ఫైబర్‌. దుస్తులు, హోమ్‌ టెక్స్‌టైల్స్‌, డ్రెస్‌ మెటీరియల్‌, లో దుస్తుల తయారీలో దీనిని వినియోగిస్తారు)కు సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం వంద శాతాన్ని వినియోగించుకున్నా, అమ్మకాలు 3 శాతమే పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు బలహీనంగా ఉండటంతో మార్జిన్లపై ప్రభావం పడింది. ముడి పదార్ధాల ధరలు తగ్గుతుండటంతో రానున్న క్వార్టర్లలో ఒకింత ప్రయోజనం కలుగవచ్చు. డిమాండ్‌ బలహీనంగా ఉండటం, దిగుమతులు పెరగడంతో కెమికల్స్‌ విభాగం పనితీరు అంచనాలను అందుకోలేకపోయింది. అమ్మకాలు 7 శాతం తగ్గగా, మార్జిన్లు 8 శాతం తగ్గి 20 శాతానికే పరిమితమైంది. దేశంలోనే అతి పెద్ద సిమెంట్‌ కంపెనీ అయిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌లో 57.3 శాతం వాటా ఉండటం, స్టాండ్‌అలోన్‌ వ్యాపారాలు నిలకడైన వృద్ధిని సాధిస్తుండటం, వీఎస్‌ఎఫ్‌ వ్యాపారంలో దాదాపు గుత్తాధిపత్యం ఉండటం, వీఎస్‌ఎఫ్‌, రసాయనాల విభాగాల ఉత్పత్తి సామర్థ్యాలు పెరుగుతుండటం, ఏబీ క్యాపిటల్‌, ఇతర కంపెనీల్లో వాటాలుండటం... సానుకూలాంశాలు. మరో గ్రూప్‌ కంపెనీ వొడాఫోన్‌ ఐడియా రుణ భారం భారీగా ఉండటం, (ఈ రుణానికి గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ ఎలాంటి కార్పొరేట్‌ గ్యారంటీని ఇవ్వకపోవడంతో ఇది పెద్ద ప్రతికూలాంశం కాబోదు), సిమెంట్‌, వీఎస్‌ఎఫ్‌ ధరలు తగ్గే అవకాశాలు, వీఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశాలు.... ప్రతికూలాంశాలు. 

బాట ఇండియా 
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.1,736
టార్గెట్‌ ధర: రూ.1,955

ఎందుకంటే: బాటా ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మందగమన నేపథ్యంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.722 కోట్లకు పెరిగింది. ప్రీమియమ్‌(ఖరీదైన) ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా స్థూల మార్జిన్లు 60 బేసిస్‌ పాయింట్లు పెరిగి 54.4 శాతానికి, నిర్వహణ లాభ మార్జిన్‌ అర శాతం పెరిగి 13.5 శాతానికి పెరిగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా నికర లాభం 27 శాతం ఎగసి రూ.71 కోట్లకు పెరిగింది. కొత్త ట్రెండీ కలెక్షన్‌లను అందుబాటులోకి తెస్తుండటం, మార్కెటింగ్‌ వ్యయాలు పెంచుతుండటం, ప్రస్తుత స్టోర్‌ మోడళ్లను రీ డిజైనింగ్‌ చేయడం తదితర చర్యల కారణంగా ఈ కంపెనీ బ్రాండ్‌ ఇమేజ్‌ ‘మాస్‌’ నుంచి ​‘ప్రీమియమ్‌’కు మారుతోంది. ఫ్రాంచైజీ స్టోర్స్‌తో కలుపుకొని దేశవ్యాప్తంగా 1,420 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. మార్కెట్‌ వాటా మరింతగా పెంచుకునే నిమిత్తం టైర్‌ టూ, త్రీ నగరాల్లో స్టోర్స్‌ను విస్తృతంగా ఏర్పాటు చేయనున్నది. ఐదేళ్లలో 500 ఫ్రాంచైజీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు, యువత కేటగిరీలో కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుండటం, ప్రీమియమ్‌ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుండటం, ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరిస్తుండటం, ప్రకటనల కోసం అధికంగానే ఖర్చు చేస్తుండటం, స్థూల లాభం మెరుగుపడే అవకాశాలుండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, రూ.800 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటం....సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. You may be interested

ఆర్‌కామ్‌ వేలం నుంచి తప్పుకున్న ఎయిర్‌టెల్‌

Monday 18th November 2019

రుణదాతల కమిటీ తీరుపై అభ్యంతరాలు న్యూఢిల్లీ: దివాలా తీసిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) ఆస్తుల కొనుగోలు రేసు నుంచి టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తప్పుకుంది. వేలానికి సంబంధించి బిడ్డింగ్‌ గడువు పెంచాలంటూ తాము కోరితే పట్టించుకోని రుణదాతల కమిటీ (సీవోసీ), మరో పోటీ సంస్థ (రిలయన్స్ జియో) అభ్యర్ధిస్తే మాత్రం సానుకూల నిర్ణయం తీసుకుందంటూ ఎయిర్‌టెల్ ఆక్షేపించింది. రుణదాతల కమిటీ తీరు పూర్తిగా అసమంజసమని, పక్షపాతంతో కూడుకున్నదని వ్యాఖ్యానించింది. రిలయన్స్

పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు

Monday 18th November 2019

-టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ పన్ను ఆదా కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లోనూ ఇన్వెస్ట్‌ చేసే వారున్నారు. సెక్షన్‌ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్‌ సేవింగ్స్‌ కూడా ఒకటి.  రాబడులు టాటా

Most from this category