News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 16th December 2019
Markets_main1576466278.png-30235

టాటా మోటార్స్‌        కొనచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ ​‍
ప్రస్తుత ధర: రూ.177
టార్గెట్‌ ధర: రూ.195

ఎందుకంటే:  టాటా మోటార్స్‌ లగ్జరీ కార్ల విభాగం, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అమ్మకాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. వరుసగా ఐదో నెలలోనూ(ఈ ఏడాది నవంబర్‌లో) చైనాలో రెండంకెల వృద్ధిని సాధించాయి. జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు బ్రిటన్‌లో 11 శాతం తగ్గినా, చైనాలో 29 శాతం, అమెరికాలో 5 శాతం మేర పెరిగాయి. ల్యాండ్‌ రోవర్‌ కొత్త మోడళ్లు-ఆర్‌ఆర్‌ ఇవోక్‌, ఎల్‌ఆర్‌ డిస్కవరీ స్పోర్ట్స్‌, ఎల్‌ఆర్‌ డిస్కవరీ, ఆర్‌ఆర్‌ స్పోర్ట్‌ మంచి అమ్మకాలు సాధించాయి. మందగమనం ఉన్నా, అమెరికా, చైనా దేశాల్లో అమ్మకాలు పెరగడం సానుకూలాంశం. చైనా వాహన మార్కెట్లో సమస్యలున్నా, అమ్మకాల రికవరీ కొనసాగుతోంది. కొత్త మోడళ్లను అందుబాటులోకి తేవడం, రిటైలర్లతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటం ఫలితాలను ఇస్తోంది. ఈ నెలలోనే జాగ్వార్‌  ఎఫ్‌-టైప్‌ మోడల్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీనికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించగలదని కంపెనీ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 14 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది. బ్రెగ్జిట్‌(యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం)కు గట్టి మద్దతు దారైన బోరిస్‌ జాన్సన్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ మెజార్జీ లభించింది. దీంతో బ్రెగ్జిట్‌ అనిశ్చితి తొలగనున్నది. ఇది కూడా టాటా మోటార్స్‌కు సానుకూలాంశమే.


మారుతీ సుజుకీ- హోల్డ్‌
బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌ ‍
ప్రస్తుత ధర: రూ.7,215
టార్గెట్‌ ధర: రూ.7,500
ఎందుకంటే:
 ప్రయాణీకుల వాహన సెగ్మెంట్లో 50 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏడాది పాటు పడిపోతూ ఉన్న ఈ కంపెనీ వాహన విక్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో పుంజుకున్నాయి. వాహన నిల్వలు బాగా తగ్గాయి. దాదాపు 9 నెలల అనంతరం గత నెలలో వాహన ఉత్పత్తి 4 శాతం పెరిగింది. రికవరీ కొనసాగడానికి మరికొంత కాలం పట్టవచ్చని భావిస్తున్నాం. భారత్‌స్టేజ్‌ (బీఎస్‌) 6 నిబంధనలు అందుకోవడానికి వివిధ మోడళ్లలో మార్పులు, చేర్పులు చేయడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. దీంతో కార్ల ధరలను ఈ కంపెనీ పెంచక తప్పలేదు. ధరల పెంపునకు  ఆర్థిక మందగమనం కొనసాగుతుండటం కూడా తోడవడంతో ప్రయాణీకుల వాహనాలకు డిమాండ్‌ సమీప భవిష్యత్తులో అంతంతమాత్రంగానే ఉండొచ్చు. కియా మోటార్స్‌ కంపెనీలు కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తుండటంతో పోటీ పెరుగుతోంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను  స్లాబ్‌ల్లో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తాయి. ఆదాయపు పన్ను  తగ్గితే అది ఈ కంపెనీకి సానుకూలాంశమవుతుంది. ప్రయాణికుల వాహన సెగ్మెంట్లో సుదీర్ఘకాలం మందగమనం కొనసాగుతుండటం, కియా వంటి బహుళజాతి కంపెనీల నుంచి పోటీ పెరుగుతుండటం, విడిభాగాలు, రాయల్టీలకు చెల్లింపులు యెన్‌(జపాన్‌ కరెన్సీ)ల్లో ఉండటంతో కరెన్సీ మారకంలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటుండటం  ప్రతికూలాంశాలు. రెండేళ్ల కాలంలో నికర లాభం 4 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. You may be interested

పరిశ్రమవర్గాలతో ప్రి-బడ్జెట్ సమావేశాలు

Monday 16th December 2019

నేటి నుంచి ప్రారంభం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) నుంచి పరిశ్రమవర్గాలు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు మొదలైనవారితో సమావేశం కానున్నారు. వినియోగానికి, వృద్ధికి ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ప్రి-బడ్జెట్ సమావేశాలు డిసెంబర్ 23 దాకా కొనసాగుతాయని, ఫిబ్రవరి 1న బడ్జెట్

సెన్సెక్స్‌ 41,164స్థాయిని అధిగమిస్తే...

Monday 16th December 2019

సెన్సెక్స్‌ 41,164స్థాయిని అధిగమిస్తే... ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ఫైనాన్షియల్‌ మార్కెట్లను నెలల తరబడి ఆందోళన పరుస్తున్న రెండు అంశాలు ఒక కొలిక్కి వచ్చాయి. అమెరికా–చైనాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన వెలువడటం, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ సజావుగా వైదొలగడానికి (సాఫ్ట్‌ బ్రెగ్జిట్‌) అవసరమైన మెజారిటీని ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ, ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సాధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు పెద్ద ఊరటనిచ్చే అంశాలు. మన దేశ

Most from this category