News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 9th December 2019
Markets_main1575860190.png-30117

యాక్సిస్‌ బ్యాంక్‌ -  కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.718
టార్గెట్‌ ధర: రూ.870

ఎందుకంటే: రుణాల పరంగా చూస్తే, దేశంలో అతి పెద్ద మూడవ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇది. ఈ బ్యాంక్‌ 4,284 బ్రాంచ్‌లు, 12,191 ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అన్ని రకాలైన రుణాలను ఈ బ్యాంక్‌ అందిస్తోంది. భారీ, మధ్య తరహా కంపెనీలకే కాకుండా లఘు, చిన్న తరహా వాణిజ్య సంస్థలకు, వ్యవసాయ, రిటైల్‌ రుణాలను కూడా ఇస్తోంది. అధిక మార్జిన్‌లు వచ్చే రుణాలపైననే ఈ బ్యాంక్‌ అధికంగా దృష్టి సారిస్తోంది. అంతే కాకుండా పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా రాబడి నిష్పత్తులను మెరుగుపరచుకోవాలని కూడా చూస్తోంది. 2014-19 కాలానికి రుణ వృద్ధి 17 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఇది బ్యాంకింగ్‌ రంగం సగటు కంటే అధికం. ఇదే కాలానికి రిటైల్‌ రుణాలు మాత్రం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 38 శాతంగా ఉన్న రిటైల్‌ రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి ఎగియనున్నాయి. 2014-19 కాలానికి డిపాజిట్లు 14 శాతం చొప్పున చక్రగతి వృద్ధిని సాధించాయి. రెండేళ్లలో రుణాలు 17 శాతం, డిపాజిట్లు కూడా 17 శాతం చొప్పున చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. .రుణ నాణ్యత మెరుగుకు ఈ బ్యాంక్‌ తీసుకున్న పటిష్టమైన చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో స్థూల మొండి బకాయిలు 5 శాతం, నికర మొండి బకాయిలు 2 శాతానికి తగ్గాయి. దాదాపు 35గా ఉన్న అనుబంధ సంస్థల పనితీరు మెరుగ్గానే ఉండటం సానుకూలాంశం. ఎమ్‌డీ, సీఈఓగా కొత్తగా అమితాబ్‌ చౌధురిని నియమించడం... బ్యాంక్‌ సంస్థాగత మార్పుకు సంకేతంగా భావించవచ్చు. 

టెక్‌ మహీంద్రా - కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 
ప్రస్తుత ధర: రూ.758
టార్గెట్‌ ధర: రూ.937
ఎందుకంటే:
టెలికం కంపెనీలకు ఐటీ సేవలందించే అగ్రస్థాయి ఐటీ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. సత్యం కంప్యూటర్స్‌ విలీనం కారణంగా టెక్‌ మహీంద్రా కంపెనీ భారత్‌లో ఐదవ అతి పెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. గత మూడేళ్లుగా ఎలాంటి ఎదుగు, బొదుగూ లేని టెలికం విభాగం ఇటీవలనే వృద్ధి బాటలోకి ప్రవేశించింది. 5జీ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానుండటంతో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 5జీకి అనుగుణంగా మార్చుకోవడం టెలికం కంపెనీలకు తప్పనిసరి. దీంతో ఈ కంపెనీ టెలికం సేవల విభాగం మరింత వృద్ధిని సాధించే అవకాశాలున్నాయి. క్లయింట్ల నుంచి టెక్నలాజికల్‌ సొల్యూషన్స్‌కు డిమాండ్‌ పెరగడం వల్ల ఆర్థిక మందగమనం సమయంలోనూ టెక్‌ మహీంద్రా మంచి పనితీరునే చూపించింది. గత మూడేళ్లలో మార్జిన్లు మెరుగుపడుతున్నప్పటికీ, డీల్స్‌ పునర్వ్యస్థీకరణ వ్యయాలు పెరగడంతో మార్జిన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.3 శాతం మేర తగ్గే అవకాశాలున్నాయి. అయితే నిర్వహణ పరంగా సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం, ఆటోమేషన్‌, తదితర కారణాల వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్జిన్లు మెరుగుపడవచ్చు. కంపెనీ మొత్తం ఆదాయంలో 59 శాతం ఆదాయన్ని సమకూర్చే ఎంటర్‌ప్రైజ్‌ విభాగం నిలకడగా ఉండటంతో ఆదాయం జోరుగా పెరిగే అవకాశాలున్నాయి. కమ్యూనికేషన్స్‌ విభాగం డీల్స్‌ పెరుగుతుండటం,   టెలికం విభాగం పుంజుకోవడం.. సానుకూలాంశాలు. ఈ కంపెనీ డీల్స్‌లో అధిక భాగం యూరప్‌ నుంచే రావడం, కరెన్సీ మారకం ఒడిదుడుకులు.. ప్రతికూలాంశాలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 15 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది. You may be interested

పెరిగిన మారుతీ సుజుకీ ఉత్పత్తి

Monday 9th December 2019

 నవంబర్‌లో 4 శాతం అప్‌ న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,41,834 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది నవంబర్‌లోని 1,35,946 యూనిట్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి 4.33 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. ప్రయాణికుల వాహనాల ఉత్పత్తి గతనెల్లో 1,39,084 యూనిట్లు కాగా, అంతకుముందు

40,250 దిగువన సెన్సెక్స్‌ మరింత బలహీనం

Monday 9th December 2019

సెప్టెంబర్‌ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయి 4.5 శాతానికి దిగజారినప్పటికీ, ఆ ప్రతికూలాంశాన్ని ఇప్పటికే డిస్కౌంట్‌ చేసుకున్నందున, గతవారం తొలిరోజున స్టాక్‌ మార్కెట్‌ స్థిరంగానే ముగిసింది. ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబాలుగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్న కొన్ని ప్రధాన బ్యాంకింగ్‌ షేర్లు కొత్త రికార్డుస్థాయికి చేరవయ్యాయి కూడా. ఇంతలో రిజర్వుబ్యాంక్‌ నిర్ణయం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా మార్చివేసింది. వృద్ధి రేటును వేగవంతం చేసేదిశగా వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయన్న నిపుణుల

Most from this category