News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 25th November 2019
Markets_main1574652334.png-29820

 


జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: 358
టార్గెట్‌ ధర: రూ.443
ఎందుకంటే:
భారత్‌లోని పెద్ద మీడియా కంపెనీల్లో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీఈఈఎల్‌) ఒకటి. జీ టీవీ చానెళ్లను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో 16.5 శాతం వాటాను ప్రమోటర్‌ సంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా విక్రయం కారణంగా రూ.4,560 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నిధులను తనఖా షేర్లను విడిపించుకోవడానికి వినియోగించాలనేది ప్రమోటర్‌ ఆలోచన. ఫలితంగా ప్రమోటర్‌ తనఖా పెట్టిన షేర్లు 96 శాతం నుంచి 20 శాతానికి(మొత్తం కంపెనీలో ఇది 1.1 శాతానికి సమానం) తగ్గుతాయి. 16.5 శాతం వాటా విక్రయానంతరం ప్రమోటర్‌ సంస్థకు ఇంకా 5 శాతం వాటా మిగిలి ఉంటుంది. పునీత్‌ గోయెంకానే ఎమ్‌డీ, సీఈఓగా కొనసాగే అవకాశాలుంటాయి. దిగ్గజ సంస్థలే వాటాను కొనుగోలు చేసే అవకాశాలుండటంతో భాగస్వామిగా వచ్చే ఈ దిగ్గజ సం‍‍స్థల కారణంగా కంపెనీ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగుపడే అవకాశాలున్నాయి. సానుకూల వ్యాపార వాతావరణం నెలకొనవచ్చు. ఏడాది కాలంగా ఎస్సెల్‌ గ్రూప్‌లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నా, నిబంధనలు కఠినతరమైనా, ప్రకటనల ఆదాయం తగ్గినా, ఈ కంపెనీ నిలకడైన పనితీరును సాధించింది. హిందీ, తెలుగు మార్కెట్లలలో తన మార్కెట్‌ వాటాను నిలుపుకోగలగడమే కాకుండా కన్నడ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ప్రకటనల ఆదాయం మెరుపడనుండటం, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనాలు, డైరెక్ట్‌ టు హోమ్‌(డీటీహెచ్‌) విస్తరణ కారణంగా చందా ఆదాయం పెరగనుండటం, దీర్ఘకాలంలో షేర్ల బైబ్యాక్‌ జరిగే అవకాశాలుండటం.... ఇవన్నీ సానుకూలాంశాలు. 20 శాతం షేర్లు ఇంకా తనఖాలోనే ఉండటం, ఆశించిన స్థాయిలో ప్రకటనల ఆదాయం పెరగకపోవడం...ప్రతికూలాంశాలు. 

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఆనంద్‌ రాఠి రీసెర్చ్‌ 
ప్రస్తుత ధర: 333
టార్గెట్‌ ధర: రూ.481
ఎందుకంటే:
మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఈ ఆర్థిక సేవల కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం(స్టాండ్‌అలోన్‌) 18 శాతం వృద్ధితో రూ.2,486 కోట్లకు పెరిగింది. రుణాలు 15 శాతం వృద్ధితో రూ.63,790 కోట్లకు పెరిగాయి. నిర్వహణ మార్జిన్లు 4 శాతం తగ్గి 51.6 శాతానికి చేరాయి. గత క్యూ2లో రూ.381 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.252 కోట్లకు తగ్గింది. ఇక అనుబంధ కంపెనీల పనితీరును విశ్లేషిస్తే, మహీంద్రా రూరల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.370 కోట్లకు, నికర లాభం 8 శాతం వృద్ధితో రూ.29 కోట్లకు పెరిగాయి. రుణాలు 11 శాతం వృద్ధితో రూ.8,010 కోట్లకు చేరాయి. ఆర్థిక మందగమనం, వర్షాలు సాధారణం కంటే ఎక్కువ నెలలే కురియడం... ఈ కంపెనీ గ్రామీణ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపించాయి. మరో అనుబంధ కంపెనీ-మహీంద్రా ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌(ఎమ్‌ఐబీఎల్‌) ఆదాయం 4 శాతం పెరిగింది. డిజిటల్‌ వ్యాపారంలో తన పెట్టుబడులను మహీంద్రా ఫైనాన్స్‌ కొనసాగిస్తోంది. ఆర్‌బీఐ ద్రవ్యపాలసీ, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ వ్యయాలు... ఈ అంశాలుఈ కంపెనీ వ్యాపారం ప్రభావం చూపుతాయి. ఈ అంశాల్లో ప్రతికూలతలు ఏర్పడితే కంపెనీపైకూడా కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కంపెనీ వ్యాపారం ప్రధానంగా, వాహన, హౌసింగ్‌ రంగాలకు సంబంధించినది కావడంతో ఈ రంగాల్లో ప్రతికూలతలు ఏర్పడితే అది కూడా కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. You may be interested

అనిల్ అంబానీ రాజీనామా తిరస్కరణ

Monday 25th November 2019

న్యూఢిల్లీ: దివాలా స్మృతి కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) డైరెక్టర్‌గా అనిల్ అంబానీ రాజీనామా చేయడాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఆయనతో పాటు మరో నలుగురు డైరెక్టర్ల రాజీనామాలను కూడా తోసిపుచ్చింది. నవంబర్‌ 20న జరిగిన సమావేశంలో సీవోసీ ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ తెలియజేసింది. ఆర్‌కామ్‌ డైరెక్టర్లుగా కొనసాగాలని, దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి పరిష్కార

40,000–40,800 శ్రేణి కీలకం

Monday 25th November 2019

  40,000–40,800 శ్రేణి కీలకం అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్‌ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో....ఈ నెలలో పలుదఫాలు నిఫ్టీ 12,000 పాయింట్లపైకి వెళ్లినా, నిలదొక్కుకోలేకపోవడంతో అలసిపోయిన బుల్స్‌ ఆఫ్‌లోడింగ్‌ కారణంగా ఇండియా మార్కెట్‌ గరిష్టస్థాయి నుంచి 1 శాతం వరకూ తగ్గింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు

Most from this category