News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 22nd July 2019
Markets_main1563779602.png-27226

ఫెడరల్‌ బ్యాంక్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ. 99
టార్గెట్‌ ధర: రూ.125

ఎందుకంటే:- ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ పనితీరు నిలకడగానే ఉంది. గత క్యూ4లో రూ.256 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.415 కోట్లకు పెరిగాయి. ఒత్తిడి రిటైల్‌ రుణాలు కేరళలోనే అధికంగా ఉన్నాయి. భారీ వరదల కారణంగా  కేరళలో పరిస్థితులన్నీ తల్లకిందులు కావడమే దీనికి కారణం. రికవరీ త్వరితంగానే ఉండగలదని యాజమాన్యం ఆశిస్తోంది. తాజా మొండి బకాయిల కారణంగా స్థూల మొండి బకాయిలు 2.99 శాతం నుంచి స్వల్పంగా పెరిగాయి. ఇతర ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.392 కోట్లకు, నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.1,154 కోట్లకు పెరిగాయి. మార్జిన్‌లు 3.15 శాతంగా ఉన్నాయి. తాజా మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు సీక్వెన్షియల్‌గా 8 శాతం పెరిగి రూ.192 కోట్లకు చేరాయి. నికర లాభం 46 శాతం వృద్ధితో రూ.384 కోట్లకు పెరిగింది. రుణాలు 19 శాతం వృద్ధి సాధించాయి. డిపాజిట్లు కూడా 19 శాతం పెరిగాయి. కొనసాగుతున్న వృద్ధి, నిలకడగా ఉన్న క్రెడిట్‌ కాస్ట్‌ వంటి అంశాల కారణంగా రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) జోరుగా పెరగగలదని అంచనా. రెండేళ్లలో రుణ వృద్ధి 21 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. 

ఇన్ఫోసిస్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర: రూ. 786
టార్గెట్‌ ధర: రూ.840
ఎందుకంటే:-
ఇన్ఫోసిస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్వల్పంగా అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఈ కంపెనీ శుభారంభంతో చేసిందని చెప్పవచ్చు. నిలకడ కరెన్సీ రేట్లలో  చూస్తే, ఆదాయం 12 శాతం పెరిగింది. ఎబిటా మార్జిన్‌ 3 శాతం పెరిగి 21 శాతానికి చేరింది. కంపెనీ ఐదు విభాగాలు (ఆర్థిక సేవలు, కమ్యూనికేషన్స్‌, ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్‌,  హై-టెక్‌) మంచి ఆదాయ వృద్ధి సాధించాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం ఆదాయం అంచనాలను 8-10 శాతం మేర పెంచింది. సమీప భవిష్యత్తులో మంచి వృద్ధి సాధనకు ఇది సంకేతమని భావిస్తున్నాం. ఫ్రీ క్యాష్‌ ఫ్లోస్‌లో ప్రస్తుతం 70 శాతంగా వాటాదారులకు తిరిగిస్తున్న మొత్తాన్ని 85 శాతానికి పెంచింది. ఈ క్యూ1లో మొత్తం 270 కోట్ల డాలర్ల డీల్స్‌ను సాధించింది. ఒక్క త్రైమాసిక కాలంలో ఇంత విలువైన డీల్స్‌ను సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి.  దీంట్లో కొత్త డీల్స్‌ సగానికి పైగా ఉండటం విశేషం. వ్యయ నియంత్రణపై దృష్టి సారిస్తామని కంపెనీ చెప్పడంతో మార్జిన్లు మరింతగా మెరుగుపడే అవకాశాలున్నాయి. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, షేర్‌ వారీ ఆర్జన (ఈపీఎస్‌) 12 శాతం మేర చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నాం. You may be interested

ఈ ఆర్థిక సంవత్సరమంతా మందగమనం ఉంటుంది: గిరీష్ పాయ్‌

Monday 22nd July 2019

జీడీపీ వృద్ధి 6-6.5శాతానికి పడిపోయే అవకాశం.  అమెరికా వృద్ధి మందగమనంపై మదుపర్ల ఆందోళన. దేశీయ, అంతర్జాతీయ మందగమన ప్రభావం ఎఫ్‌వై20 హెచ్‌2లో,  ఎఫ్‌వై 21 హెచ్‌1లో కనిపించనుంది.   ఆర్థిక సంవత్సరం 2020కి గాను ఆర్థిక వృద్ధి 6-6.5 శాతంగా నమోదుకావచ్చు. ఆదాయాల వృద్ధి 20-25 శాతం నుంచి తగ్గవచ్చని నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ గిరీష్ పై ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. వృద్ధి రేటు

కేజీ డీ6లో కనిష్ట స్థాయికి గ్యాస్

Monday 22nd July 2019

న్యూఢిల్లీ: గ్యాస్ ఉత్పత్తి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవడంతో కేజీ-డీ6 బ్లాక్ ప్రస్తుతం చివరి దశలో ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) వెల్లడించింది. గ్యాస్ ఉత్పత్తికి కావల్సినంత పీడనం లేకపోవడం, బావుల్లో నీరు చొరబడటం తదితర అంశాలు ఉత్పత్తి భారీగా పడిపోవడానికి కారణాలని వివరించింది. అయితే, కేజీ-డీ6 బ్లాక్‌లో పరిస్థితులను మళ్లీ మెరుగుపర్చేందుకు 2020 మధ్య నాటి నుంచి మూడు కొత్త ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభించే ప్రక్రియ చేపడుతున్నట్లు జూన్

Most from this category