News


ఈవారం స్టాక్‌ సిఫార్సులు

Monday 15th July 2019
Markets_main1563169622.png-27061

టైటాన్‌ కంపెనీ    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ 
ప్రస్తుత ధర: రూ.1,101
టార్గెట్‌ ధర: రూ.1,250

ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో ఆభరణాల విభాగం పనితీరు అంతంతమాత్రంగానే ఉందని కంపెనీ పేర్కొంది. పుత్తడి ధరలు పెరగడం, వినియోగం తగ్గడం వంటి కారణాల వల్ల ఈ విభాగం ఆదాయం 13 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇతర జ్యూయలరీ కంపెనీల మార్కెట్‌ వాటా తగ్గుతుండగా, తనిష్క్‌ బ్రాండ్‌ మార్కెట్‌ వాటా పెరుగుతోంది. టీసీఎస్‌ కంపెనీ నుంచి భారీ ఆర్డర్‌ కారణంగా వాచ్‌ల విభాగం ఆదాయం 19 శాతం పెరిగింది. పరిశ్రమ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, టైటాన్‌ మార్కెట్‌ వాటా పెరగడం గతం నుంచి  జరుగుతున్న విషయమే. ఇటీవల షేర్‌ పతనం,... ఈ షేర్‌ కొనుగోలుకు మంచి అవకాశంగా భావిస్తున్నాం. తనిష్క్‌ అందించిన స్వయమ్‌ కలెక్షన్‌కు ఆదరణ బాగా ఉంది. ఈ క్యూ1లో కొత్తగా 12 తనిష్క్‌ షోరూమ్‌లను ఏర్పాటు చేసిన  ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 70 కొత్త స్టోర్స్‌ను ప్రారంభించనున్నది. ఇ‍‍క వాచ్‌ల విషయానికొస్తే, టెక్నాలజీ ఎనేబుల్డ్‌ వాచ్‌లను అందుబాటులోకి తెస్తుండటంతో ఈ విభాగం అమ్మకాలు జోరుగా ఉండగలవని భావిస్తున్నాం. ఆన్‌లైన్‌ అమ్మకాలు పుంజకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాల పనితీరును బట్టి, ఆదాయ, నికర లాభం అంచనాలను స్వల్పంగా తగ్గిస్తు‍న్నాం. అయితే దీర్ఘకాలం దృష్ట్యా చూస్తే,  ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చు. దాదాపు ఎలాంటి రుణ భారం లేకపోవడం, రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌(ఆర్‌ఓసీఈ) 32 శాతానికి పైగా ఉండటం, మార్కెట్‌ వాటా పెరుగుతుండటం, కొత్త స్టోర్ల ఏర్పాటు, టైటాన్‌ బ్రాండ్‌ వేల్యూ...ఇవన్నీ సానుకూలాంశాలు. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, నికర లాభం 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలవని భావిస్తున్నాం. 


శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌    కొనచ్చు
​‍బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.1,047
టార్గెట్‌ ధర: రూ.1,300

ఎందుకంటే: ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాల కొనుగోళ్లకు రుణాలందించే ఈ కంపెనీ విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీ),రిటైల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు(ఎన్‌సీడీ)ల ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించింది. అయితే వీటికి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపైన తాజా మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో ఒకింత నిలకడ సాధించాయి. తాజా మొండి బకాయిలు నియంత్రణలోనే ఉన్నాయి. మొండి బకాయిల రద్దు 60 శాతం పెరిగి రూ.2,340 కోట్లకు చేరింది. గత రెండేళ్లలో మొండి బకాయిల రద్దు దాదాపు రెట్టింపైంది. బకాయిల రద్దు భారీగా ఉన్నప్పటికీ, ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో(పీసీఆర్‌) 35 శాతం రేంజ్‌లో మెయింటైన్‌ చేస్తోంది. బ్రాంచ్‌ల విస్తరణ ఆరోగ్యకరంగాఉంది.  కొత్తగా 335 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. ఇటీవల లిక్విడిటీ సమస్య కారణంగా రుణాల మంజూరీ తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ ఇచ్చిన రుణాలు 25 శాతం తగ్గాయి.   ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలల్లో 22 శాతంగా ఉన్న నిర్వహణ ఆస్తుల వృద్ధి గత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో 9 శాతానికే పరిమితమైంది. నిర్వహణ ఆస్తుల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి పుంజుకోగలదని భావిస్తున్నాం. 2020 నుంచి మాత్రమే వృద్ధి పుంజుకోవచ్చు. రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) 2.5 శాతంగా, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 16 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం. ప్రతికూలతలున్నా ఈ షేర్‌ ఏడాది కాలంలో రూ.1,300కు చేరగలదని భావిస్తున్నాం. కొనొచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం.You may be interested

కంపెనీగా కొనసాగలేమేమో !

Monday 15th July 2019

ఆందోళన వ్యక్తం చేసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ క్యూ4లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు  కంపెనీకి ఇవే అత్యధిక నష్టాలు  న్యూఢిల్లీ: గత కొన్ని క్వార్టర్లలో జరిగిన పరిణామాల కారణంగా,.. భవిష్యత్తులో కంపెనీగా కొనసాగలేమోనన్న ఆందోళనను హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో క్వార్టర్‌లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు వచ్చాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. రూ.3,280 కోట్ల అదనపు కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని, తమ కంపెనీ చరిత్రలో

27 ఏళ్ల కనిష్ఠానికి చైనా వృద్ధి

Monday 15th July 2019

 వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా డిమాండ్‌ మందగించడంతో  చైనా వృద్ధి రెండవ క్వార్టర్‌లో మూడు దశాబ్దాల కంటే తక్కువగా నమోదయ్యిందని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా పేర్కొంది. మొదటి త్రైమాసికంలో 6.4 శాతం వృద్ధి రేటు నమోదు కాగా రెండవ క్వార్టర్‌లో అది 6.2 శాతానికి పడిపోయింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన అధికారిక డేటా ఏఎఫ్‌పీ విశ్లేషకుల అంచానాలతో పోలి ఉండడం గమనర్హం. మొత్తం సంవత్సరానికి

Most from this category