News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 5th August 2019
news_main1564991321.png-27544

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా    కొనచ్చు
బ్రోకరేజ్‌ సం‍స్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.105
టార్గెట్‌ ధర: రూ.140
ఎందుకంటే:
ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ల విలీనాంతరం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించిన ఫలితాలు ఇవి. నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పెరిగి రూ.6.498 కోట్లకు పరిమితమైంది. ట్రేడింగ్‌ లాభాలు, ఫీజు ఆదాయం 8 శాతం పెరగడంతో ఇతర ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.338 కోట్లకు పెరిగింది. రూ.4,276 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. నికర లాభం రూ.710 కోట్లు సాధించింది. మొండి బకాయిలకు కేటాయింపులు 11 శాతం (సీక్వెన్షియల్‌గా 70 శాతం) తగ్గి రూ.3,566 కోట్లకు చేరాయి.  ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో నిలకడగా 77.34 శాతంగా ఉంది. రిటైల్‌ రుణాలు 21 శాతం పెరగడంతో మొత్తం రుణాలు 6 శాతం వృద్ధితో రూ.6,33,181 కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల మొండి బకాయిలు స్వల్పంగా పెరిగి 10.28 శాతానికి పెరిగాయి. తాజా మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా చూస్తే, 15 శాతం తగ్గి రూ.5,583 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలు 15 శాతం, డిపాజిట్లు 10 శాతం చొప్పున  వృద్ధి చెందగలవని బ్యాంక్‌ ధీమాగా ఉంది. తాజా మొండి బకాయిలు తగ్గుతాయని, రికవరీలు పెరుగుతాయని, నికర మొండి బకాయిలు 3 శాతంలోపే ఉండగలవని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. 


టెక్‌ మహీంద్రా    కొనచ్చు
బ్రోకరేజ్‌ సం‍స్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 
ప్రస్తుత ధర: రూ.636
టార్గెట్‌ ధర: రూ.935
ఎందుకంటే:
సాధారణంగా ఐటీ కంపెనీలకు జూన్‌ క్వార్టర్‌ సీజన్‌ బలహీనంగా ఉంటుంది. ఈ కారణంగా టెక్‌ మహీంద్రా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక(జూన్‌ క్వార్టర్‌) ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. డాలర్ల పరంగా ఆదాయం సీక్వెన్షియల్‌గా 2 శాతం తగ్గింది. వేతనాల పెంపు, రూపాయి బలపడటం, వీసా వ్యయాలు  వంటి కారణాల వల్ల ఇబిటా మార్జిన్‌ 4 శాతం తగ్గి 11.5 శాతానికి పరిమితమైంది. మంచి డీల్స్‌ సాధించడం, కొన్ని భారీ డీల్స్‌కు సంబంధించి చర్చలు దాదాపు తుది దశకు చేరుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి మంచి వృద్ధి సాధిస్తామని కంపెనీ ధీమాగా ఉంది. కమ్యూనికేషన్స్‌ విభాగం పుంజుకోవడం, ఈ విభాగంలో పెద్ద డీల్స్‌ చేజిక్కించుకోవడం కంపెనీకి కలసివచ్చే అంశం. యూరప్‌ మార్కెట్‌పై అధికంగా ఆధారపడటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకునే అవకాశాలు... ప్రతికూలాంశాలు. టెలికం విభాగంలో ఐటీ సేవలందించే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన టెక్‌ మహీంద్రా షేర్‌ ఇటీవల కాలంలో ఆరోగ్యకరమైన కరెక్షన్‌కు గురైంది.  ఈ షేర్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌(షేర్‌ వారీ ఆర్జన)కు 12 రెట్ల ధరకు ​‍ప్రస్తుతం ట్రేడవుతోంది. కొనుగోళ్లకు ఇది ఆకర్షణీయ ధర అని భావిస్తున్నాం. దేశంలో అది పెద్ద ఐదో ఐటీ కంపెనీ అయిన ఈ షేర్‌ ఏడాది కాలంలో రూ.935 ధరను చేరుతుందని అంచనా వేస్తున్నాం. You may be interested

మరోసారి ఆర్‌బీఐ రేట్ల కోత!

Monday 5th August 2019

- ఈ నెల 7న పాలసీ సమీక్ష నిర్ణయం... - కీలక వడ్డీరేట్లలో పావు శాతం తగ్గింపునకు అవకాశం... - బ్యాంకర్లు, నిపుణుల అంచనా... న్యూఢిల్లీ: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోతకు సై అంటుందా? కీలక గణాంకాలన్నీ మందగమనాన్ని స్పష్టంగా చూపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు వరుసగా నాలుగోసారి కీలక పాలసీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల

సెన్సెక్స్‌ 37,390 దాటితేనే రిలీఫ్‌ర్యాలీ

Monday 5th August 2019

పి.సత్యప్రసాద్‌ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గతవారం వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, భవిష్యత్‌ రేట్లకోతపై అయోమయ సంకేతాల్నినివ్వడంతో పాటు, చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరిగి టారీఫ్‌ పెంపు హెచ్చరికల్ని చేయడంతో...ఇప్పటివరకూ పటిష్టంగా అమెరికా మార్కెట్‌ కూడా క్షీణతను చవిచూసింది. ఇప్పటికే సతమతమవుతున్న యూరప్‌, ఆసియా మార్కెట్లు మరింత కుదేలయ్యాయి. ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో భారత్‌ సూచీల్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా నాలుగు

Most from this category