News


సెన్సెక్స్‌ 41,180 స్థాయికి అటూ...ఇటూ

Monday 17th February 2020
Markets_main1581909197.png-31838

కరోనా వైరస్‌ ప్రభావం వున్నప్పటికీ, అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌...అవసరమైతే పాలసీని సరళీకరిస్తామంటూ అభయం ఇవ్వడంతో  అమెరికా, జర్మనీ  స్టాక్‌ సూచీలు గతవారం కొత్త రికార్డుల్ని నెలకొల్పగా, మిగిలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు దాదాపు స్థిరంగా ట్రేడయ్యాయి. అయితే భారత్‌ మార్కెట్‌కు సంబంధించి  టెలికాం కంపెనీల ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికల కారణంగా ఇన్వెస్టర్లలో ఆందోళన తలెత్తింది. ఈ నేపథ్యంలో రానున్న కొద్దిరోజుల్లో బ్యాంకింగ్‌  షేర్ల కదలికలు మన మార్కెట్‌ను నిర్దేశించవచ్చు. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో ఇప్పటికే భారత్‌ మార్కెట్లోకి దాదాపు రూ. 25,000 కోట్లు  కుమ్మరించినందున, మార్కెట్లో నాటకీయంగా డౌన్‌ట్రెండ్‌ వచ్చే అవకాశాలు సైతం ప్రస్తుతానికి కన్పించడం లేదు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా  వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
ఫిబ్రవరి 14తో ముగిసినవారం ప్రధమార్థంలో గత మార్కెట్‌ పంచాంగంలో సూచించిన అంచనాలకు అనుగుణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,800 పాయింట్ల  సమీపంలో తక్షణ మద్దతు పొందిన తర్వాత క్రమేపీ 41,709 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది.  చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 116 పాయింట్ల   లాభంతో  41,258 పాయింట్ల వద్ద ముగిసింది. టెక్నికల్‌ సెటప్‌ దాదాపు గతవారంలానే వున్నందున, స్వల్పకాలిక మద్దతు, అవరోధాలకు సంబంధించి పెద్దగా  మార్పేదీ వుండదు. ఈ సోమవారం గత శుక్రవారంనాటి కనిష్టస్థాయి అయిన 41,180 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకుంటే  తొలుత 41,330 పాయింట్ల  స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ 41,700 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్‌సాధ్యపడి 42,000  పాయింట్ల మార్క్‌ను అందుకునే వీలుంటుంది. ఈ వారం తొలి మద్దతును కోల్పోతే తిరిగి 40,820-40,690 పాయింట్ల శ్రేణిని పరీక్షించవచ్చు. ఈ లోపున   40,475 పాయింట్ల స్థాయికి వేగంగా తగ్గవచ్చు. 

నిఫ్టీ 12,090పైన స్థిరపడితేనే...

గతకాలమ్‌లో అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,990 పాయింట్ల వద్దకు తగ్గిన తర్వాత, క్రమేపీ పెరుగుతూ 12,246 పాయింట్ల గరిష్టస్థాయికి  చేరింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 15 పాయింట్ల లాభంతో 12,113 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీకి సెన్సెక్స్‌లానే శుక్రవారంనాటి  కనిష్టస్థాయి 12,090 పాయింట్లపైన స్థిరపడితేనే.... పెరిగే అవకాశం వుంటుంది. ఈ స్థాయిపైన తక్షణం 12,145 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై క్రమేపీ  12,225 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 12,270-12,330 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి  మద్దతుస్థాయిని కోల్పోతే తిరిగి 11,985-11,950 పాయింట్ల శ్రేణిని పరీక్షించవచ్చు. ఈ లోపున క్రమేపీ 11,885 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. You may be interested

వేరే ఫండ్‌కు మారిపోవాలా?

Monday 17th February 2020

ప్ర: నేను గత కొంతకాలంగా బ్యాంకింగ్‌ రంగానికి చెందిన సెక్టోరియల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించవచ్చా  జ: అసలు సెక్టోరియల్‌ ఫండ్స్‌కు దూరంగా ఉంటేనే మంచిది. డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందడం కోసమే మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అయితే సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీకు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు లభించవు. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో అన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లే ఉంటాయి.  బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి ప్రతికూల

ట్రంప్ పర్యటనపై కార్పొరేట్ల ఆశలు

Monday 17th February 2020

మినీ వాణిజ్య ఒప్పందంపై అంచనాలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ఈ నెల 24,25న భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్‌పై దేశీ కార్పొరేట్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా 'మినీ' వాణిజ్య ఒప్పందం కుదరగలదని, అమెరికా కంపెనీలు మరింత పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా ఒక చిన్న పాటి వాణిజ్య ఒప్పందమైనా కుదిరితే తదుపరి సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని

Most from this category