News


39,440 పైన ముగిస్తే ర్యాలీ

Tuesday 29th October 2019
Markets_main1572318678.png-29187

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లు గతవారం స్థిరంగా ట్రేడయినప్పటికీ, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీరాకపోవడంతో దేశీయ స్టాక్‌ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే ఈ వారం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం, బ్రెగ్జిట్‌ సందిగ్దత వంటి అంశాలున్నప్పటికీ, చాలా నెలల తర్వాత అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కలిసి గత కొద్దిరోజులుగా కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్‌ గరిష్టస్థాయిలోనే స్థిరపడే అవకాశాలున్నాయి.   ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
అక్టోబర్‌ 27తో ముగిసిన వారంలో (ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌తో కలిపి) బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,426– 38,718 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు  అంతక్రితం వారంతో పోలిస్తే 48 పాయింట్ల స్వల్పనష్టంతో 39,250 పాయింట్ల వద్ద ముగి
సింది. ర్యాలీ కొనసాగాలంటే ఈ వారం 39,440 పాయింట్ల స్థాయిని (సెప్టెంబర్‌ 23నాటి గరిష్టస్థాయి) సెన్సెక్స్‌ అధిగమించాల్సివుంటుంది. ఈ స్థాయిపైన వేగంగా 39,650 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 39830–40,030 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.  ఈ వారం తొలి నిరోధస్థాయిని ఛేదించలేకపోతే 38,840 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన 38,715 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 38,500 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు.  

నిఫ్టీ 11,695పైన ముగిస్తే మరింత ర్యాలీ....
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  తొలిస్థాయి వద్ద నిరోధాన్ని ఎదుర్కొని 11,500లోపునకు పడిపోయింది. 11,714–11,490 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 35 పాయింట్ల నష్టంతో 11,627 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి 11,695 పాయింట్ల స్థాయి కీలకం. గత నెల 27నాటి ఈ గరిష్టస్థాయిని అధిగమించి, ముగిస్తే మరింత పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. ఈ స్థాయిపైన 11,790 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన ముగిస్తే 11,870–11980 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధస్థాయిని దాటలేకపోతే 11,535 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 11,490 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ 11,420 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. You may be interested

ఏడాది చివరకు 42,000కు పసిడి!

Tuesday 29th October 2019

విశ్లేషకుల అంచనా రాజకీయ అనిశ్చితి,  బలహీన రూపాయి కారణాలు ఆర్‌బీఐ కొనుగోళ్లూ కలిసివచ్చే అంశమే! ముంబై: పసిడి 10 గ్రాముల ధర ఈ సంవత్సరాంతానికి దేశంలో రూ.42,000ను తాకుతుందని ‍కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనత, విదేశీ మారకద్రవ్య నిల్వల స్థిరత్వానికి వీలుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు దేశంలో పసిడి ధర పరుగుకు దోహదపడతాయని వారి

స్టాక్‌ మార్కెట్‌ అంటే.....కరీనాకు ఝుంఝున్‌వాలా టిప్స్‌

Monday 28th October 2019

ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝుంఝున్‌వాలా, బాలివుడ్‌ సినీనటి కరీనా కపూర్‌ మధ్య దీపావళి సందర్భంగా ఓ ఆంగ్ల చానెల్‌లో చిట్‌ చాట్‌ జరిగింది. రాకేష్‌ ఝుంఝున్‌వాలా, కరీనా కపూర్‌కు కొన్ని స్టాక్‌ మార్కెట్‌ టిప్స్‌ ఇచ్చారు. అందులో కొన్ని.. రాకేష్‌ ఝుంఝున్‌వాలా : స్టాక్‌ మార్కెట్‌ దేశానికి అవసరం. ఇతర రంగాలలో ఉన్నట్టుగానే మంచివాళ్లు, మోసగాళ్లు ఈ రంగంలో కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజలు తాము దాచుకున్న నగదును పెట్టవలసి వస్తుంది. దాచుకునే వారి

Most from this category