News


39,440 పైన ర్యాలీ కొనసాగింపు

Monday 21st October 2019
Markets_main1571630829.png-29018

అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదరడం, ఇప్పటివరకూ  వచ్చిన  కార్పొరేట్‌ ఫలితాలు ఇన్వెస్టర్ల అంచనాలకు తగినట్లే వుండటం, యూరోపియన్‌ యూనియన్‌తో బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరిందంటూ బ్రిటన్‌ ప్రధాని వెల్లడించడం వంటి సానుకూల అంశాల నడుమ గతవారం భారత్‌ స్టాక్‌ సూచీలు 3 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. చాలా నెలల తర్వాత అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కొనుగోళ్లు జరపడం విశేషం. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ. 3000 కోట్లకుపైగా నికర పెట్టుబడులు జరిపారు. దేశీయ ఫండ్స్‌ రూ. 2000 కోట్లకుపైగా పెట్టుబడి చేశాయి.  ఈ నేపథ్యంలో వెలువడనున్న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు తగినట్లు వెలువడితే ర్యాలీ మరింత కొనసాగే అవకాశం వుంటుంది.  ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
అక్టోబర్‌ 18తో ముగిసిన వారంలో భారీ ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అంతక్రితం వారంతో పోలిస్తే 1,171 పాయింట్ల లాభంతో 39,298 పాయింట్ల వద్ద ముగిసింది. ర్యాలీ కొనసాగాలంటే ఈ వారం 39,440 పాయింట్ల స్థాయిని (సెప్టెంబర్‌ 23నాటి గరిష్టస్థాయి) సెన్సెక్స్‌ అధిగమించాల్సివుంటుంది. ఈ స్థాయిపైన వేగంగా 39,650 పాయింట్ల స్థాయికి పెరగవచ్చు. ఈ స్థాయిని సైతం ఛేదిస్తే 39830–40,030 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.  ఈ వారం తొలి నిరోధస్థాయిని ఛేదించలేకపోతే 39,100 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన 38,960 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 38,660 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు.  

నిఫ్టీ 11,695 దాటితే మరింత ర్యాలీ
గతవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రమేపీ పెరుగుతూ  11,685 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 357 పాయింట్ల భారీ లాభంతో 11,662 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి 11,695 పాయింట్ల స్థాయి కీలకం. గత నెల 23నాటి ఈ గరిష్టస్థాయిని అధిగమించడం ద్వారా మరింత పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. ఈ స్థాయిని దాటితే వేగంగా 11,790 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 11,870–11980 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్స్‌ వుంటుంది. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధస్థాయిని దాటలేకపోతే 11,600 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 11,550 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే క్రమేపీ 11,480 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. 



You may be interested

ఎయిరిండియా విక్రయానికి త్వరలో బిడ్లు

Monday 21st October 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాల విక్రయానికి బిడ్లు ఆహ్వానించడంపై  కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తి వ్యక్తీకరణ పత్రానికి (ఈవోఐ) తుది మెరుగులు దిద్దుతోంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో గానీ ప్రాథమికంగా బిడ్లు ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఇప్పటికే కొన్ని సంస్థలు ఎయిరిండియాపై ఆసక్తి కూడా వ్యక్తీకరించినట్లు వివరించాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ-బిడ్డింగ్

ట్రేడింగ్‌ ఆదాయంపై పన్ను చెల్లించాలా..?

Monday 21st October 2019

ఇంట్రాడే ట్రేడింగ్‌ లాభ, నష్టాలు వ్యాపారాదాయమే  ఈక్విటీ అయితే స్పెక్యులేటివ్‌ ఎఫ్‌అండ్‌వో అయితే నాన్‌ స్పెక్యులేటివ్‌ ఈ ఆదాయాలు వ్యక్తిగత ఆదాయానికి కలుస్తాయి శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సిందే నష్టాలు వస్తే ఇతర ఆదాయంలో సర్దుబాటు రూ.కోటి దాటితే ట్యాక్స్‌ ఆడిట్‌ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన  తక్కువ మందిలోనే ఉంటుందని చెప్పుకోవాలి. నేటి తరం యువతలో చాలా మంది

Most from this category