News


సెన్సెక్స్‌ తక్షణ నిరోధం 39,020-మద్దతు 38,475

Monday 15th July 2019
Markets_main1563169155.png-27058

ఒకవైపు అమెరికా స్టాక్‌ సూచీలు కొత్త రికార్డులు సృష్టిస్తుండగా, మరోవైపు యూరప్‌, ఆసియా సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గిస్తే అధిక ప్రయోజనం అందుకునే భారత్‌, చైనా, బ్రెజిల్‌, రష్యా వంటి వర్థమాన మార్కెట్లు...అమెరికా ట్రెండ్‌తో విడివడి నిస్తేజంగా ట్రేడవుతుండటం గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నడూ జరగలేదు. ఇది ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ మార్పునకు సూచనా? ఈ అంశంపై స్పష్టత రావాలంటే మరికొద్దివారాలు ఆగాల్సివుంటుంది. ఇక భారత్‌ సంగతికొస్తే...బడ్జెట్‌ ప్రతిపాదనలు రుచించని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో గతవారం భారీగా క్షీణించిన నేపథ్యంలో వెలువడుతున్న కార్పొరేట్‌ ఫలితాలు సూచీలను సమీప భవిష్యత్తులో ఒడుదుడుకులకు లోనుచేయవచ్చు. ఇక ప్రస్తుత సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూలై 12తో ముగిసిన వారంలో తొలిరోజున గ్యాప్‌డౌన్‌తో 39,441 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్, అటుతర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై ఆ మరుసటి రోజున 38,436 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది.అటుతర్వాత మూడు రోజులూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనై  చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 777 పాయింట్ల నష్టంతో 38,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఓవర్‌సోల్డ్‌ కండీషన్‌లో వున్నందున...పుల్‌బ్యాక్‌ ర్యాలీలు వస్తే ఈ వారం సెన్సెక్స్‌ 39,020 పాయింట్ల వద్ద ఎదురయ్యే నిరోధాన్ని తొలుత దాటాల్సివుంటుంది. ఆపైన ముగిస్తే 39,200 పాయింట్ల సమీపస్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 39,441-39,476 పాయింట్ల శ్రేణి రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కల్గించవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 38,475 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 38,000 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని కూడా నిలుపుకోలేకపోతే 37,640 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు.  

నిఫ్టీ తక్షణ నిరోధం 11,640-మద్దతు 11,475...
గత వారం 11,772 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ నిలువునా పతనమై 11,461 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 259 పాయింట్ల భారీ నష్టంతో 11,552 పాయింట్ల వద్ద ముగిసింది.  ఈ వారం నిఫ్టీ పెరిగితే 11,640 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన ముగిస్తే  50 డీఎంఏ కదులుతున్న 11,710 పాయింట్ల స్థాయివరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే గత సోమవారంనాటి ట్రేడింగ్‌గ్యాప్‌ 11,772-11,798 పాయింట్ల స్థాయి నిఫ్టీని రానున్న రోజుల్లో గట్టిగా నిరోధించవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 11,475 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ మద్దతులోపున ముగిస్తే 11,426 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఈ కీలకస్థాయిని కోల్పోతే వేగంగా 11,300 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. You may be interested

కమర్షియల్‌ పేపర్‌ అంటే.. ?

Monday 15th July 2019

ప్ర: కమర్షియల్‌ పేపర్‌ చెల్లింపుల్లో కంపెనీలు విఫలమయ్యాయంటూ తరుచూ వార్తలు వస్తున్నాయి కదా! ఇంతకీ ఈ కమర్షియల్‌ పేపర్‌ అంటే ఏమిటి ?  -ఇంతియాజ్‌, విజయవాడ  జ: కమర్షియల్‌ పేపర్‌.... మనీ మార్కెట్‌ సాధనాల్లో ఒకటి. వీటి మెచ్యూరిటీ కాలం ఒక ఏడాది. వీటిని కంపెనీలు జారీ చేస్తాయి. బ్యాంక్‌లు జారీ చేసే వాటిని సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌గా వ్యవహరిస్తే, కంపెనీలు జారీ చేసే మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ను కమర్షియల్‌ పేపర్‌గా వ్యవహరిస్తారు.

క్యూ1 ఫలితాలు, ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 15th July 2019

యస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్, ఏసీసీ, విప్రో ఫలితాలు ఈవారంలోనే.. బుధ, గురువారాల్లో జి-7 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం సోమవారం డబ్ల్యూఐపీ డేటా వెల్లడి న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా నష్టాలను నమోదుచేస్తున్న దేశీ స్టాక్‌ సూచీలకు ఈవారం కీలకంగా మారనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారంనాటి ముగింపుతో రెండు నెలల కనిష్టస్థాయిని నమోదుచేసిన ప్రధాన సూచీలకు క్యూ1 ఫలితాలు, ఆర్థికాంశాలే దిశా నిర్థేశం చేయనున్నాయని అంచనావేస్తున్నారు. ప్రస్తుత

Most from this category