News


38,400పైన ముగిస్తేనే ర్యాలీ ...

Monday 14th October 2019
Markets_main1571020415.png-28853

ఒకవైపు దేశీయంగా బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి, మరోవైపు అమెరికా-చైనాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఆశలతో భారత్‌ స్టాక్‌సూచీలు గతవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అలాగే ఈ సీజన్‌లో తొలుతగా వెలువడిన ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, టీసీఎస్‌ల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహపర్చడం కూడా సూచీల్ని ఊగిసలాటకు లోనుచేశాయి. క్యూ2 ఫలితాల పట్ల మార్కెట్‌కు పెద్దగా అంచనాలు లేనప్పటికీ, కార్పొరేట్లు ఇన్వెస్టర్లకు షాక్‌కు గురిచేస్తే మాత్రం...పన్ను కోతతో పెరిగిన ఈపీఎస్‌ అంచనాలు కాస్తా ఆవిరైపోయి, డౌన్‌గ్రేడ్‌లకు దారితీసే ప్రమాదం వుంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా-చైనాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఇరుదేశాలూ ప్రకటించినందున,  సమీప మార్కెట్‌ ట్రెండ్‌ను కార్పొరేట్‌ ఫలితాలే నిర్దేశించగలవు. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
అక్టోబర్‌ 11తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌ వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన మద్దతు స్థాయిలు, నిరోధశ్రేణిని మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తొలుత 37,415 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత వేగంగా 38,345 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 454 పాయింట్ల లాభంతో 38,127 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్‌ పెరుగుదల కొనసాగితే తొలుత 38350-38400 పాయింట్ల శ్రేణి సెన్సెక్స్‌కు అవరోధం కల్గించవచ్చు. అటుపై ముగిస్తేనే తదుపరి ర్యాలీ సాధ్యపడి  క్రమేపీ 38,850 పాయింట్ల వద్దకు చేరే అవకాశం వుంటుంది. మధ్యలో 38,650 పాయింట్ల సమీపంలో చిన్నపాటి అవరోధం కలగవచ్చు.  ఈ వారం సెన్సెక్స్‌ తొలి అవరోధం శ్రేణిపైన స్థిరపడలేకపోయినా, బలహీనంగా మొదలైనా 37,800 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 37,415 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 37,000 పాయింట్ల వద్దకు పతనం కొనసాగవచ్చు. 

నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 11360-11,400
గతవారం తొలుత 11,090 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ..తదుపరి వేగంగా 11,363 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 130 పాయింట్ల లాభంతో 11,305 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం నిఫ్టీకి 11,360-11,400 పాయింట్ల నిరోధశ్రేణి కీలకం. ఈ శ్రేణిని ఛేదిస్తేనే మరింత పెరిగే అవకాశం వుంటుంది. అటుపైన ముగిస్తే క్రమేపీ 11,555 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. మధ్యలో 11,480 పాయింట్ల సమీపంలో చిన్న అవరోధం కలగవచ్చు.  నిఫ్టీ ఈ వారం తొలి అవరోధశ్రేణిని అధిగమించలేకపోతే 11,210 పాయింట్ల సమీపంలో మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 11,090- 11,060 పాయింట్ల శ్రేణి వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 10,950 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. You may be interested

ఐఆర్‌సీటీసీ లిస్టింగ్‌ నేడే

Monday 14th October 2019

బంపర్‌ లాభాలకు చాన్స్‌... ఇష్యూ ధర రూ.320 లిస్టింగ్‌ రూ.500 పైనే ఉండొచ్చని అంచనాలు... న్యూఢిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) షేర్లు నేడు (సోమవారం) స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. సెప్టెంబర్‌ 30న మొదలై ఈ నెల 4న ముగిసిన ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా ఐఆర్‌సీటీసీ రూ.638 కోట్లు సమీకరించింది. రూ.10 ముఖ విలువ,  రూ.315-320 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఒక

క్యూ2 ఫలితాలే నడిపిస్తాయ్‌ .....!

Monday 14th October 2019

ఈ వారంలో దిగ్గజ కంపెనీల క్యూ2 ఫలితాలు  సానుకూల ప్రభావం చూపనున్న అమెరికా-చైనాల పాక్షిక ఒప్పందం  నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు  ఈ వారంలోనే ఆర్‌బీఐ పాలసీ మినట్స్‌ ఈ వారం మార్కెట్‌ ప్రభావిత అంశాలు  ఈ వారంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్తాన్‌ యూనిలివర్‌, విప్రో, అంబుజా,  తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు.

Most from this category