News


38,730 దిగువన సెన్సెక్స్‌ బలహీనం

Monday 22nd July 2019
Markets_main1563778818.png-27220

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ నెలాఖరులో జరపనున్న విధాన సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ, అమెరికా మార్కెట్‌ మినహా ఇతర ప్రధాన దేశాల సూచీల్లో జోష్‌ కన్పించడం లేదు. ఫెడ్‌ రేటు తగ్గింపుకంటే ట్రేడ్‌వార్స్‌, వినియోగ డిమాండ్‌ తగ్గడం తదితర అంశాలతో యూరప్‌, ఆసియా మార్కెట్లు సతమతమవుతుండగా, ఇందుకు తోడు కొన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు నొప్పించడంతో మన మార్కెట్లో క్షీణత అధికంగా వుంది. వరుసగా రెండు వారాల్లో భారత్‌ సూచీలు 3.5 శాతం నష్టపోయాయి. మరోవైపు ఇప్పటివరకూ  కార్పొరేట్‌ ఫలితాలు వెల్లడించిన ప్రధాన కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ షేరు కొత్త రికార్డు సృష్టించి, గతవారం ప్రధమార్థంలో సూచీల పతానాన్ని తాత్కాలికంగా నిరోధించగా, శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లపై ఇన్వెస్టర్ల స్పందన సమీప మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్దేశించవచ్చు. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూలై 19తో ముగిసిన వారం ప్రధమార్థంలో 39, 285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్, అటుతర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై శుక్రవారం  38,271  పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే  399 పాయింట్ల నష్టంతో 38,337 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం వేగంగా సెన్సెక్స్‌ 38,730 పాయింట్ల స్థాయిని అధిగమించలేకపోతే సమీప భవిష్యత్తులో కరెక‌్షన్‌ కొనసాగే ప్రమాదం వుంటుంది. పైన సూచించిన స్థాయిపైన ముగిస్తే 39,060 పాయింట్ల వద్దకు, అటుపైన 39,285 పాయింట్ల వద్దకు పెరిగే అవకాశం వుంటుంది. ఈ సోమవారం మార్కెట్‌ బలహీనంగా ప్రారంభమైతే తొలుత 37,735 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే 37,415 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ లోపున 200 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 37,065 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. 

నిఫ్టీ తక్షణ మద్దతు 11,320- నిరోధం 11,460
క్రితం వారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత కాలమ్‌లో ప్రస్తావించిన 50 డీఎంఏ 11,707 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 11,399 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 11,419 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు ‘స్వింగ్‌ లో’ అయిన 11,460 పాయింట్ల దిగువన నిఫ్టీ బలహీనంగా ట్రేడ్‌కావొచ్చు. ఈ వారం నిఫ్టీ క్షీణత కొనసాగితే తొలుత 11,320 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే వేగంగా 11,250 పాయింట్లస్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున  200 డీఎంఏ కదులుతున్న 11,125 పాయింట్ల స్థాయివరకూ పతనం కావొచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకున్నా, లేదా పాజిటివ్‌గా ప్రారంభమైనా తక్షణం 11,460 పాయింట్ల వద్ద నిరోధాన్ని చవిచూడవచ్చు. అటుపైన ముగిస్తే 11,640 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. 



You may be interested

డైరెక్ట్‌ ప్లానా ? రెగ్యులర్‌ ప్లానా ?

Monday 22nd July 2019

ప్ర: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఫండ్స్‌ ఎన్‌ఏవీ(నెట్‌అసెట్‌వేల్యూ) ప్రస్తుతమున్న స్థాయి నుంచి ఎంత మేర పతనమైతే, ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు ? -శ్రీనివాస్‌, విజయవాడ  జ: మీకు ఈ విషయంలో నేను ఎలాంటి సలహా ఇవ్వలేను. ఎన్‌ఏవీ తగ్గేదాకా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, మీరు చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కోసారి  ఈ వెయిటింగ్‌  నిరంతరం ఉండొచ్చు కూడా ! ఒకవేళ మార్కెట్‌ 20–25 శాతం

ఒడిదుడుకుల వారం..!

Monday 22nd July 2019

గురువారం జూలై సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు  మారుతి సుజుకి, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌యుఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈవారంలోనే.. నెమ్మదించిన వినియోగం, పేలవమైన ఫలితాలు, పన్ను అంశాలతో దెబ్బతిన్న సెంటిమెంట్‌ ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో గతవారం నష్టాలను నమోదుచేసిన దేశీ స్టాక్‌ సూచీలు.. ఈవారంలో భారీ ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడే ఆస్కారం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన పలు దిగ్గజ కంపెనీల మొదటి

Most from this category