News


సెన్సెక్స్‌ కీలక మద్దతు 39,200 పాయింట్లు

Monday 17th June 2019
Markets_main1560748484.png-26335

అమెరికా....వివిధ దేశాలతో జరుపుతున్న వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతూ ఉండగా, ఈ అంశానికి తోడు ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం, కార్పొరేట్‌ డిఫాల్ట్‌లు, కార్పొరేట్‌ దుర్వినియోగాలతో దేశీయ సూచీలు గరిష్ట స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. కానీ, మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలు పార్లమెంట్‌ ముందుకు రానున్న నేపథ్యంలో బడ్జెట్‌ ర్యాలీకి బీజం పడుతుందో ? లేక అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలాంశాలకు మార్కెట్‌ తలొగ్గుతుందో ?... చూడాల్సి ఉంది. ఇక సూచీల సాంకేతికాంశాల విషయానికొస్తే...,

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
జూన్‌ 14తో ముగిసిన వారంలో 700 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంత క్రితం వారంతో పోల్చితే, 164 పాయింట్ల నష్టంతో 39,452 పాయింట్ల వద్ద ముగిసింది. 14 ట్రేడింగ్‌ సెషన్ల నుంచి కేవలం 3 శాతం శ్రేణిలో ఒడిదుడుకులకు లోనవుతున్న సెన్సెక్స్‌ త్వరలో ఈ శ్రేణి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వారం సెన్సెక్స్‌కు తొలుత లభించబోయే 39,280 పాయింట్ల మద్దతు స్థాయి కీలకం. ఈ స్థాయిని కోల్పోతే, డౌన్‌ ట్రెండ్‌ మొదలై 38,825 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 38,570 పాయింట్లకు పతనం కావచ్చు. ఈ వారం తొలుత మద్దతు స్థాయిని పరిరక్షించుకుంటే, 39,800 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై 40,060 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన 40.320 పాయింట్ల వరకూ పెరగవచ్చు. 


నిఫ్టీ కీలక మద్దతు 11,760 పాయింట్లు....
గత వారం 11,962-11,797 పాయింట్ల శ్రేణిలో గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 100 పాయింట్ల నష్టంతో 11,823 పాయింట్ల వద్ద ముగిసింది. గత 14 ట్రేడింగ్‌ సెషన్ల నుంచి 12,040-11,760 పాయింట్ల మధ్య ఊగిసలాడుతున్న నిఫ్టీ.... ఈ శ్రేణిని ఎటువైపు చేధిస్తే అటు వైపు ప్రయాణించవచ్చు. ఈ వారం నిఫ్టీకి 11,760 పాయింట్ల వద్ద లభించబోయే తొలి మద్దతు స్థాయి కీలకం. ఈ స్థాయిని వదులుకుంటే, వేగంగా 11,655 పాయింట్ల స్థాయికి పడిపోవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే, 11,615 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ వారం తొలి మద్దతు స్థాయిని పరిరక్షించుకుంటే, 11,910 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన 11,960పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఈ స్థాయి పైన ముగిస్తే, 12,100 పాయింట్లకు పెరగవచ్చు. 



You may be interested

రిలయన్స్‌ వైదొలగడం.. ఫండ్స్‌పై ప్రభావం చూపుతుందా?

Monday 17th June 2019

ప్ర: నేను, నా భార్య సీనియర్‌ సిటిజన్‌లం. మేం గత కొన్నేళ్లుగా నాలుగు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. అవి యాక్సిస్‌ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్‌ ఇండియా ట్యాక్స్‌షీల్డ్‌, ఐసీఐసీఐ ప్రు ఈక్విటీ అండ్‌ డెట్‌,  సుందరమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌. ఈ ఫండ్స్‌ ప్రస్తుతం మంచి పనితీరే కనబరుస్తున్నాయి. ఈ ఫండ్స్‌ల్లో  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమంటారా ? వేరే ఫండ్స్‌ల్లోకి మళ్లించమంటారా ? పన్ను ప్రయోజనాల కోసం ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం

ఫెడ్‌ నిర్ణయం, వాణిజ్య చర్చలే కీలకం..

Monday 17th June 2019

 బుధవారం వెల్లడికానున్న ఫెడ్‌ వడ్డీరేట్ల నిర్ణయం గురువారం ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి ఈవారంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం వాణిజ్య యుద్ధం, ముడిచమురుపై ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: ఎన్నికల ర్యాలీ అనంతరం పరిమిత శ్రేణిలో కదలాడుతున్న దేశీయ స్టాక్‌ సూచీలు.. ఇక్కడ నుంచి ఏదిశగా ప్రయాణించనున్నాయనే అంశానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకమని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈవారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంకానుండగా.. వడ్డీరేట్ల కోతకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే అంశంపైనే ప్రధానంగా మార్కెట్‌

Most from this category