News


40,000–40,800 శ్రేణి కీలకం

Monday 25th November 2019
Markets_main1574652022.png-29819

 

  • 40,000–40,800 శ్రేణి కీలకం

అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్‌ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో....ఈ నెలలో పలుదఫాలు నిఫ్టీ 12,000 పాయింట్లపైకి వెళ్లినా, నిలదొక్కుకోలేకపోవడంతో అలసిపోయిన బుల్స్‌ ఆఫ్‌లోడింగ్‌ కారణంగా ఇండియా మార్కెట్‌ గరిష్టస్థాయి నుంచి 1 శాతం వరకూ తగ్గింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వాటి రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతుండగా, ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీలు వాటి ఇటీవలి కనిష్టస్థాయిల వద్ద కదులుతున్నాయి. ఈ హెవీవెయిట్ల కదలికల్లో భారీ మార్పు వస్తేనే స్టాక్‌ సూచీలు ఎటో ఒకవైపు వేగంగా పయనించే అవకాశం వుంటుంది. సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
నవంబర్‌ 22తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,222 కనిష్టస్థాయి నుంచి పెరిగి, 40,816 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయిలో స్థిరపడలేక, వారాంతంలో దిగువకు జారిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 2 పాయింట్ల స్వల్ప లాభంతో 40,359 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న 40,000–40,800 శ్రేణిని ఛేదించే దిశ...సెన్సెక్స్‌  ట్రెండ్‌కు కీలకం.  ఈ శ్రేణి దిగువస్థాయిని కోల్పోయి,  ముగిస్తే సెన్సెక్స్‌ స్వల్పకాలిక కరెక్షన్‌కు లోనుకావొచ్చు. ఈ సందర్భంలో తొలుత 39,800 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. తరువాత  39,500 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన శ్రేణిలో ఈ వారం సెన్సెక్స్‌ కదలితే తొలుత 40,535 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై ముగిస్తే క్రమేపీ 40,750–40,815 పాయింట్ల శ్రేణిని తిరిగి పరీక్షించవచ్చు. 

నిఫ్టీకి 11,800–12,035 శ్రేణి కీలకం
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,035 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని ఎదుర్కొని, గతవారం ప్రధమార్థంలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోలేకపోయింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 19 పాయింట్ల స్వల్పలాభంతో 11,915 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ నిఫ్టీ కదిలిన 11,800–12,035 శ్రేణి నుంచి వెలుపలికి వస్తేనే మార్కెట్లో ఆ దిశగా ట్రెండ్‌ వుండవచ్చు.  ఈ వారం నిఫ్టీ 11,800 పాయింట్ల మద్దతును ముగింపులో కోల్పోతే 11,720 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 11,650 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  లేదా గత మూడువారాల శ్రేణిలోనే నిఫ్టీ కదలికలు పరిమితమైతే తొలుత 11,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 12,030–12,040 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే నిఫ్టీ అల్‌టైమ్‌ గరిష్టం 12,103 పాయింట్ల స్థాయిని దాటే అవకాశాలుంటాయి. You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 25th November 2019

  జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: 358 టార్గెట్‌ ధర: రూ.443 ఎందుకంటే: భారత్‌లోని పెద్ద మీడియా కంపెనీల్లో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌(జీఈఈఎల్‌) ఒకటి. జీ టీవీ చానెళ్లను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో 16.5 శాతం వాటాను ప్రమోటర్‌ సంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ విక్రయించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ వాటా విక్రయం కారణంగా రూ.4,560 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నిధులను తనఖా షేర్లను

వాణిజ్య ఒప్పంద పరిణామాలు కీలకం

Monday 25th November 2019

విదేశీ పెట్టుబడుల ప్రవాహం నవంబర్ సిరీస్‌ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ ఈ వారం మార్కెట్‌ను నిర్దేశించే అంశాలు న్యూఢిల్లీ: అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అంశానికి సంబంధించిన పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, డెరివేటివ్స్‌కి సంబంధించి ముగియనున్న నవంబర్ సిరీస్ తదితర అంశాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. "ఈ వారం మార్కెట్లు మరీ ఆసక్తికరంగా

Most from this category