News


37,000 దిగువన మరింత పతనం

Monday 9th March 2020
Markets_main1583736757.png-32363

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ హఠాత్తుగా అరశాతం వడ్డీ రేటును తగ్గించడంతో పాటు పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలకు సిద్ధంగా వున్నట్లు  ప్రకటించినప్పటికీ, కరోనావైరస్‌ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ వుంది. ఈ తరహా కేంద్ర బ్యాంకుల సాయం..   ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. అమెరికా, చైనా, హాంకాంగ్‌ కేంద్ర బ్యాంకులు ఇప్పటికే హఠాత్‌ వరకూ  కురిపించినప్పటికీ, ఆయా దేశపు సూచీలు ఇంకా పతనబాటలోనే వున్నాయన్నది గమనార్హం. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి  సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక  సాంకేతికాలు ఇలా వున్నాయి.....

  • సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...

మార్చి6తో ముగిసినవారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 39,090 పాయింట్ల గరిష్టస్థాయికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌  చేరిన అనంతరం తీవ్ర అమ్మకాల  ఒత్తిడిని చవిచూసి 37,011 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 720 పాయింట్ల నష్టంతో  37,577  పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు పతనక్రమంలో గతేడాది అక్టోబర్‌9నాటి ‘స్వింగ్‌ లో’ అయిన 37,415 స్థాయిని శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్‌  కోల్పోయినందున, కరెక‌్షన్‌ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ వారం సెన్సెక్స్‌ నెగిటివ్‌గా మొదలైతే 37,000 పాయింట్ల సమీపంలో తొలి  మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును పరిరక్షించుకోలేకపోతే వేగంగా 36,720 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 35,990  పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 37,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 38,385  పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 38,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు.  

  •  నిఫ్టీ 10,830 మద్దతు కోల్పోతే మరింత కరెక‌్షన్‌...

క్రితంవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, గత కాలమ్‌లో ప్రస్తావించినరీతిలోనే  11,390 పాయింట్ల వరకూ పెరిగిన తర్వాత వేగంగా 10,827 పాయింట్ల వద్దకు  పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 213 పాయింట్ల నష్టంతో 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లా కాకుండా, నిఫ్టీ గతేడాది  అక్టోబర్‌9నాటి ‘స్వింగ్‌ లో’ అయిన 11,090 పాయింట్ల దిగువనే ముగిసినందున, రానున్న వారాల్లో 10,670 పాయింట్ల వరకూ పతనం కొనసాగే  అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక ఈ వారం 10,830 పాయింట్ల స్థాయి నిఫ్టీకి తొలి మద్దతు. ఈ స్థాయిని వదులుకుంటే వేగంగా 10,670 పాయింట్ల స్థాయికి  పతనం కావొచ్చు. ఈ లోపున 10,580 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే 11,035 పాయింట్ల వరకూ  పెరగవచ్చు. అటుపైన 11,250 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే క్రమేపీ 11,390 పాయింట్ల వరకూ పెరగవచ్చు. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ రాణా కపూర్‌ అరెస్ట్‌!!

Monday 9th March 2020

11 దాకా ఈడీ కస్టడీ  రంగంలోకి సీబీఐ మోసం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు డిపాజిటర్లకు మరోసారి ఆర్‌బీఐ భరోసా ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. మనీ లాండరింగ్‌ ఆరోపణలపై వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను (62) మనీ లాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆదివారం అరెస్ట్‌ చేసింది. మార్చి 11 దాకా ఆయన్ను ఈడీ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెడితే

యస్‌ బ్యాంక్‌ హైజంప్‌- ఎస్‌బీఐ బోర్లా

Monday 9th March 2020

యస్‌ బ్యాంక్‌కు ఎస్‌బీఐ పుష్‌ 41 శాతం దూసుకెళ్లిన షేరు స్టేట్‌బ్యాంక్‌ 5 శాతం పతనం ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి సిద్ధపడుతున్న వార్తలు ఈ రెండు కౌంటర్లపైనా విభిన్నంగా ప్రభావం చూపుతోంది.ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11.20 ప్రాంతం‍లో యస్‌ బ్యాంక్‌ షేరు 41 శాతం దూసుకెళ్లింది. రూ. 23 సమీపానికి చేరింది. ఇక మరోపక్క యస్‌ బ్యాంకును సొంతం చేసుకోన్ను పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ షేరు 5 శాతం

Most from this category