News


40,250 దిగువన సెన్సెక్స్‌ మరింత బలహీనం

Monday 9th December 2019
Markets_main1575859802.png-30116

సెప్టెంబర్‌ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టస్థాయి 4.5 శాతానికి దిగజారినప్పటికీ, ఆ ప్రతికూలాంశాన్ని ఇప్పటికే డిస్కౌంట్‌ చేసుకున్నందున, గతవారం తొలిరోజున స్టాక్‌ మార్కెట్‌ స్థిరంగానే ముగిసింది. ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబాలుగా ఇన్వెస్టర్లు పరిగణిస్తున్న కొన్ని ప్రధాన బ్యాంకింగ్‌ షేర్లు కొత్త రికార్డుస్థాయికి చేరవయ్యాయి కూడా. ఇంతలో రిజర్వుబ్యాంక్‌ నిర్ణయం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా మార్చివేసింది. వృద్ధి రేటును వేగవంతం చేసేదిశగా వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయన్న నిపుణుల అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ రేట్లలో ఎటువంటి మార్పూ చేయకపోగా, పూర్తి సంవత్సరానికి జీడీపీ అంచనాల్ని 5 శాతానికి కుదించి, ద్రవ్యోల్బణ అంచనాల్ని 5 శాతానికి మించి పెంచేసింది. దీంతో మార్కెట్‌ కరెక్షన్‌ బాట పట్టింది. ఇక  డిసెంబర్‌ 15లోపున కుదురుతుందని భావిస్తున్న అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పైన ఆశలు, కొత్త ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌పైనే మార్కెట్‌కు వున్న అంచనాలే...భారీ కరెక్షన్‌ రాకుండా మార్కెట్‌ను పరిరక్షించవచ్చు. ఇక  సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
డిసెంబర్‌ 6తో ముగిసినవారం తొలిరోజున  41,094 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ చేరిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తర్వాత  వారాంతంలో బాగా తగ్గింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 349 పాయింట్ల  నష్టంతో 40,445 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో క్షీణత కొనసాగితే సెన్సెక్స్‌కు 40,275 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా మరింత బలహీనపడి 40,000 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే  39,680 పాయింట్ల వరకూ తగ్గవచ్చు.  అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్‌ పాజిటివ్‌గా మొదలైతే తొలుత 40,560 పాయింట్ల వద్దకు పెరగవచ్చు.  అటుపైన 40,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిని సైతం అధిగమిస్తే 40,950–41,160 పాయింట్ల శ్రేణిని అందుకునే ఛాన్సుంటుంది. 

నిఫ్టీ తక్షణ మద్దతు 11,880
 ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  గతవారం 12,131 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 11,888 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 135 పాయింట్ల నష్టంతో 11,921 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం మార్కెట్‌ పాజిటివ్‌గా మొదలైతే నిఫ్టీ 11,970 పాయింట్ల సమీపంలో తొలి నిరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటితే 12,055 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై మరోదఫా 12,100–12,160 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.  ఈ వారం తొలి నిరోధాన్ని నిఫ్టీ దాటలేకపోతే 11,880 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన నిఫ్టీ మరింత బలహీనపడి 11,800 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఆ లోపున క్రమేపీ 11,680 పాయింట్ల వరకూ కరెక్షన్‌ కొనసాగవచ్చు. 
 You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 9th December 2019

యాక్సిస్‌ బ్యాంక్‌ -  కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రస్తుత ధర: రూ.718 టార్గెట్‌ ధర: రూ.870 ఎందుకంటే: రుణాల పరంగా చూస్తే, దేశంలో అతి పెద్ద మూడవ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇది. ఈ బ్యాంక్‌ 4,284 బ్రాంచ్‌లు, 12,191 ఏటీఎంలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అన్ని రకాలైన రుణాలను ఈ బ్యాంక్‌ అందిస్తోంది. భారీ, మధ్య తరహా కంపెనీలకే కాకుండా లఘు, చిన్న తరహా వాణిజ్య సంస్థలకు, వ్యవసాయ, రిటైల్‌ రుణాలను కూడా ఇస్తోంది.

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Monday 9th December 2019

అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై పెరిగిన ఆశావాదం మంగళ, బుధవారాల్లో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం గురువారం యూకేలో సాధారణ ఎన్నికలు ఐఐసీ, ద్రవ్యోల్బణం డేటా ఈవారంలోనే.. న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితంకావడం, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం నష్టాలను నమోదుచేసింది. నిఫ్టీ 12,000 పాయింట్ల సైకలాజికల్‌ మార్కును కోల్పోయింది. ఇక

Most from this category